• తాజా వార్తలు
  •  

ప‌బ్లిక్‌లో ఉన్న మీ అమేజాన్ విష్‌లిస్ట్‌ను ప్రైవేట్ చేయ‌డం ఎలా?

అమెజాన్‌లో మ‌నం ఏదైనా వ‌స్తువుల‌ను ఎంచుకునేట‌ప్పుడు వాట‌న్నిటిని విష్‌లిస్ట్‌లో పెడుతుంటాం. మ‌న మెయిల్ ఐడీతో అమెజాన్‌ను లాగిన్ అయిన ప్ర‌తిసారీ మ‌నం ఆ విష్ లిస్ట్‌లో ఉన్న వ‌స్తువులేంటో తెలుసుకోవ‌చ్చు. అయితే మ‌న‌కు సంబంధించిన వ‌స్తువుల‌ను ఎంచుకోవ‌డం మ‌న ప్రైవ‌సీ. వాటిని ఎవ‌రికీ చూపించ‌క్క‌ర్లేదు. కానీ ఎప్పుడైనా మ‌నం  ఈమెయిల్ లాగ్ ఔట్ చేయ‌కుండా వ‌దిలేసినా.. లేదా అమేజాన్‌ను లాగౌట్ చేయ‌క‌పోయినా.. వేరేవాళ్లు ఆ ఆ సైట్‌ను చూసే అవ‌కాశాలున్నాయి. మ‌న విష్ లిస్ట్‌ను తెలుసుకునే అవ‌కాశం ఉంది.

విష్ లిస్ట్‌ను క‌నిపించ‌కుండా ఉండాలంటే ఏం చేయాలి?
విష్ లిస్ట్‌ను ప్రైవేట్ చేయాలంటే ముందుగా అమెజాన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.  మీ అకౌంట్ వివ‌రాలను క్లిక్ చేసిన త‌ర్వాత మీకు విష్ లిస్ట్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. విష్ లిస్ట్‌ను క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత  రైట్ కార్న‌ర్‌లో  టాప్‌లో ఉన్న లిస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. దానిలో ఉన్న విష్ లిస్ట్ సెట్టింగ్స్‌లో మీకు ఒక డ్రాప్ డౌన్ బాక్స్ క‌నిపిస్తుంది. ప్రైవ‌సీ సెక్ష‌న్‌లో ఇది ఉంటుంది.  దీనిలో మీరు ప్రైవేట్ అనే ఆప్ష‌న్ ఎంచుకుంటే చాలు. మీ విష్‌లిస్ట్ కేవ‌లం మీకు మాత్ర‌మే క‌నిపిస్తుంది. కొంత‌మందికి మాత్ర‌మే విష్‌లిస్ట్ క‌నిపించాల‌ని అనుకుంటే వారి పేరుతో మీరు ట్యాగ్ చేసుకోవ‌చ్చు.

ప్రొఫైల్ నుంచి కంటెంట్ అంతా హైడ్ చేయాలంటే..
మీ అమేజాన్ విష్ లిస్ట్ మాత్ర‌మే కాదు మీ ప్రొఫైల్ మొత్తాన్ని కూడా మీరు కావాల‌నుకుంటే హైడ్ చేసుకోవ‌చ్చు. దీని కోసం ముందుగా మీరు మీ అమేజాన్ అకౌంట్‌లోని అకౌంట్స్, లిస్ట్స్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఆర్డ‌రింగ్, షాపింగ్ ప్రిఫ‌రెన్స్ ఆప్ష‌న్ దిగువున ఉన్న ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.  అది క్లిక్ చేసిన వెంట‌నే మీ ప్రొఫైల్‌లోకి వెళ్లిపోతారు. పబ్లిక్ వ్యూ, ప్రైవేట్ వ్యూ రెండూ దీనిలో ఉంటాయి.  ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి.  మీరు కావాలంటే మీరు పేరు, ఇన్ఫ‌ర్మేష‌న్ మార్చుకోవ‌చ్చు.  మెయిల్ ఐడీ ఛేంజ్ చేసుకోవ‌చ్చు. ఇదే కాక హైడ్ యాక్టివిటీ ఆన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే చాలు. మీ ప్రొఫైల్ హైడ్ అయిపోతుంది.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు