• తాజా వార్తలు
 •  

పాన్ కార్డ్ కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

మీకు పాన్ కార్డు ఉందా? పాన్ కార్డు అనేది ప్రస్తుతం మన దేశం లో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అయింది. ఆర్థిక పరమైన లావాదేవీలలో దాదాపుగా ప్రతీ దానికీ పాన్ కార్డు అవసరం అవుతుంది. ఇన్ కం టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికీ, రూ 50,000/- లు ఆ పైన పేమెంట్ లు చేయడానికీ ఇది తప్పనిసరి. అంతే గాక భారత పౌరులకూ, NRI లకు ఐడెంటిటీ ప్రూఫ్ గా కూడా ఉపయోగపడుతుంది. కొన్ని ఏజెన్సీ లు మరియు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పాన్ కార్డు ఇప్పిస్తామని చెబుతారు. వీటికోసం వీళ్ళు రూ 300/- ల నుండీ రూ 600/- ల వరకూ వసూలు చేస్తారు. భారత ఆదాయ పన్ను శాఖ వీటిని మంజూరు చేస్తుంది. అయితే ఆన్ లైన్ లో మీ పాన్ కార్డు కు మీరే అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?

ఇలా పాన్ కార్డు కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకునే సౌలభ్యం కేవలం ఇండివిడ్యువల్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అసోసియేషన్స్, సంస్థలు, కమిటీ లు, కంపెనీ, ట్రస్ట్, భాగస్వామ్యం లో ఉన్న సంస్థ లు, ఆర్టిఫిసియల్ జ్యుడిషియరీ పర్సన్ మొదలైన వారికి ఈ అవకాశం లేదు.

అవసరమైన డాక్యుమెంట్ లు ఏవి?

పాన్ కార్డు కోసం అప్లై చేసే భారత పౌరులకు మూడు రకాల డాక్యుమెంట్ లు అవసరం అవుతాయి. అవి ఐడెంటిటీ ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ మరియు డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్. ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడిన ఫోటో ఐడెంటిటీ కార్డు మొదలైనవి ఐడెంటిటీ ప్రూఫ్ గా పనికివస్తాయి. బర్త్ సర్టిఫికేట్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, రిజిస్ట్రార్ ద్వారా జారీ చేయబడిన మ్యారేజ్ సర్టిఫికేట్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి ఏజ్ మరియు డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ గా ఉపయోగపడతాయి.

ఎంత ఖర్చు అవుతుంది?

కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేయడానికి భారత పౌరులకు రూ 116/- లు మరియు విదేశీ పౌరులకు అయితే రూ 1020/- లు ఖర్చు అవుతుంది. ఆన్ లైన్ పేమెంట్ ఛార్జ్ మరొక రూ 5/- లు అదనం.

పాన్ కార్డు కోసం ఆన్ లైన్ లో అప్లై చేయడం ఎలా?

 1. NSDL లేదా UTITSL వెబ్ సైట్స్ ద్వారా పాన్ కార్డు కు అప్లై చేయాలి. ఇండియా లో పాన్ కార్డు మంజూరు కు ఈ రెండు వెబ్ సైట్ లు అథరైజేషణ్ ను కలిగి ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో NSDL వెబ్ సైట్ యొక్క ప్రక్రియ ను చూద్దాం.
 2. NSDL వెబ్ సైట్ ను ఓపెన్ చేసిన వెంటనే ఆన్లైన్ పాన్ అప్లికేషను ఫారం ఓపెన్ అవుతుంది. అప్లికేషను ఫారం దగ్గర న్యూ పాన్- ఇండియన్ సిటిజెన్ ( ఫారం 49A ) ను సెలెక్ట్ చేసుకోవాలి. విదేశీయులు అయితే న్యూ పాన్ – ఫారెన్ సిటిజెన్ ఫారం 49AA ను సెలెక్ట్ చేసుకోవాలి.
 3. మీకు అవసరమైన పాన్ కార్డు టైపు ను సెలెక్ట్ చేసుకోవాలి. సాధారణంగా అందరికీ ఇది ఇండివిడ్యువల్ అని ఉంటుంది.
 4. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలను పూర్తి చేసి , క్యాప్చా ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
 5. ఇక్కడ మీకు మూడు ఆప్షన్ లు కనిపిస్తాయి. అథెంటికేషన్ అదార్ ద్వారా చేసేది ఒకటి, డాక్యుమెంట్ లను స్కాన్ చేసి అప్ లోడ్ చేసేది రెండవది మరియు ఫిజికల్ గా సబ్మిట్ చేసేది మరొకటి. వీటిలో ఆధార్ ద్వారా చేసేదానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే దానికి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కు otp వస్తుంది. దానిని ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయడమే.
 6.  ఆధార్ నెంబర్ తో సహా అన్ని డీటెయిల్స్ నూ ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి.
 7. ఈ స్టెప్ లో మీ పేరు, డేట్ అఫ్ బర్త్ మొదలైన వాటిని ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయాలి.
 8. తర్వాత అసేసింగ్ ఆఫీసర్ కోడ్ పై క్లిక్ చేస్తే నాలుగు ఛాయస్ లు వస్తాయి. ఇండియన్ సిటిజెన్, ఫారెన్ సిటిజెన్ మరియు NRI, డిఫెన్సు ఎంప్లాయిస్, గవర్నమెంట్ కేటగరీ లలో ఎదో ఒకదానిని  సెలెక్ట్ చేసుకోవాలి.
 9. మీ రాష్త్రం మరియు ఉండే ఏరియా ను సెలెక్ట్ చేసుకోవాలి. AO కోడ్ ల లిస్టు మీకు అక్నిపిస్తుంది. అక్కడ ఉండే కోడ్ లలో మీ కోడ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
 10. నెక్స్ట్ పై క్లిక్ చేయాలి.
 11. మీకు సంబందించిన డాక్యుమెంట్ లను సెలెక్ట్ చేసి, అక్కడ కూడా వివరాలను పూర్తి చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
 12. పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఉండే ఆన్ లైన్ పేమెంట్ పద్దతులలో మీకు అనువుగా ఉన్న దానిని ఉపయోగించి పేమెంట్ ను పూర్తి చేయాలి.
 13. అక్నాలేడ్జ్ మెంట్ వస్తుంది. ఆ తర్వాత మీ అడ్రస్ కు మీ పాన్ కార్డ్ కొరియర్ ద్వారా పంపబడుతుంది.

జన రంజకమైన వార్తలు