• తాజా వార్తలు
  •  

మనం ఓటర్ లిస్టు లో ఉన్నామో లేమో చెక్ చేసుకోవడం ఎలా?`

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరునికి ఓటు అనేది ఒక కీలక ఆయుధం. మన భారత రాజ్యాంగం కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతీ భారత పౌరునికీ ఓటు హక్కు ను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. వచ్చే సంవత్సరo సాధారణ ఎన్నికలు ఉండడం దానితో పాటే రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడం తో కొత్త ఓట్ల చేర్పు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు ప్రక్రియను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రారంభించింది. ఇది ప్రతీ సంవత్సరం చేసేదే అయినా ఎన్నికలు సమీపిస్తుండడం తో ఈ సంవత్సరం చాలా పకడ్భందీ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యం లో అసలు మీ పేరు ఓటర్ లిస్టు లో ఉందో లేదో అనే అనుమానం వచ్చిందా? అయితే మీ కోసమే ఈ ఆర్టికల్. మీ పేరు ఓటర్ లిస్టు లో ఉందో లేదో ఆన్ లైన్లో తెలుసుకోవడం ఎలా అనే అంశంపై ఈ ఆర్టికల్ ఇస్తున్నాం. మరి ఇది చదివి మీ పేరు ఓటర్ లిస్టు లో ఉందో లేదో చెక్ చేసుకోండి.

ఓటర్ లిస్టు లో పేరును చెక్ చేసుకోవడం ఎలా ?

నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ ( NVSP ) ఎలక్ట్రోరల్ సెర్చ్ పేజి ను విజిట్ చేయాలి. మీ EPIC నెంబర్ ను ఉపయోగించి సెర్చ్ చేయాలి. ఒకవేళ మీకు ఎపిక్ నెంబర్ లేకపోతే మీ వివరాలను మాన్యువల్ గా ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఈ రెండు పద్దతుల గురించి ఇక్కడ ఇస్తున్నాం .

మీకు ఎపిక్ ( EPIC ) నెంబర్ ఉంటే ఎలా చేయాలి?

  1. NVSP ఎలక్ట్రోరల్ సెర్చ్ పేజి ని విజిట్ చేయాలి.
  2. సెర్చ్ బై ఎపిక్ నెంబర్ పై క్లిక్ లేదా టాప్ చేయాలి.
  3. మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి, డ్రాప్ డౌన్ మెనూ నుండి స్టేట్ ను సెలెక్ట్ చేసుకుని అక్కడ కనిపించే ఇమేజ్ లో ఉన్న కోడ్ ను ఎంటర్ చేయాలి.
  4. మీ పేరు ఓటర్ లిస్టు లో ఉన్నట్లయితే అక్కడ మీ పేరు , ఊరు తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. అక్కడ కనిపించలేదు అంటే మీ పేరు ఓటర్ లిస్టు లో లేనట్లే లెక్క. వెంటనే ఫారం-6 ద్వారా కొత్త ఓటు కోసం అప్లై చేయాలి.

మీకు ఎపిక్ ( EPIC ) నెంబర్ లేకపోతే ఎలా చేయాలి?

  1. NVSP ఎలక్ట్రోరల్ సెర్చ్ పేజి ను విజిట్ చేయాలి.
  2. సెర్చ్ బై డీటెయిల్స్ పై క్లిక్ గానీ టాప్ గానీ చేయాలి.
  3. మీ పేరు, వయసు, లింగం, అసెంబ్లీ నియోజకవర్గం తదితర వివరాలన్నీ అక్కడున్న పేజి లో ఎంటర్ చేయాలి.
  4. అక్కడే ఉన్న క్యాప్చా ఇమేజ్ లో ఉన్న కోడ్ ను ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి.
  5. నీ పేరు ఓటర్ లిస్టు లో ఉనట్లయితే అక్కడ కనిపిస్తుంది. లేకపోతే లేనట్లే అర్థం.

నోట్ : సాధారణంగా  ఓటర్  కార్డు పై ఉండే మన వివరాలలో చాలా వరకూ స్పెల్లింగ్ మిస్టేక్ లు ఉంటాయి. ఈ వివరాలతో సెర్చ్ చేసేటపుడు మీకు సరైన  ఫలితం రాకపోవచ్చు. కాబట్టి EPIC నెంబర్ ద్వారా సెర్చ్ చేయడమే మంచిది. మీ ఓటర్ కార్డు పై తప్పులు ఏవీ లేవు అని అనుకుంటే డీటెయిల్స్ ఎంటర్ చెఇ సెర్చ్ చేసుకోవచ్చు. ఛాయిస్ మీదే!

జన రంజకమైన వార్తలు