• తాజా వార్తలు

మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్ ఫైల్ చేసేయండి..

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే ప్ర‌పంచం గుప్పిట్లో ఉన్న‌ట్లే! ఎందుకంటే ప్ర‌తి ప‌నికి ఒక యాప్‌... ప్ర‌తి టాస్క్‌కు ఒక సాఫ్ట్‌వేర్ వ‌చ్చిన రోజులివి. అందుకే ఎక్కువ‌మంది త‌మ ఫోన్ ద్వారానే రోజువారీ కార్య‌క‌లాపాలు చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. టిక్కెట్లు బుక్ చేయాల‌న్నా.. ఫుడ్ డెలివ‌రీ ఆర్డర్ ఇవ్వాల‌న్నా.. చివ‌రికి కూర‌గాయ‌లు తేవ‌లన్నా యాప్‌తోనే ప‌నైపోతుంది. కేవ‌లం ఇవి మాత్ర‌మే కాదు మ‌న ఆర్థిక కార్య‌క‌లాపాలు కూడా స్మార్ట్‌ఫోన్‌లోనే జ‌రిగిపోతున్నాయి. ఇప్పుడు ఇన్‌కంటాక్స్ రిట‌ర్న్స్ ఫైల్ చేయ‌డం కూడా మీ చేతుల్లోనే ఉంది. ఒక యాప్‌తో మీ రిట‌ర్న్ సుల‌భంగా ఫైల్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.
ఐటీఆర్ యాప్‌తో..
ఇన్‌కంటాక్స్ యాప్‌తో సులభంగా రిట‌ర్న్ వేసే అవ‌కాశం ఉంది. ఈ యాప్‌లో ఉన్న స్టెప్ బై స్టెప్ గైడెన్స్ వ‌ల్ల టాక్స్ ఫైల్ చేసే స‌మ‌యంలో మ‌న‌కు ఎలాంటి డౌట్స్ వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు. తొలిసారి టాక్స్ రిటర్న్ పైల్ చేస్తున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండ‌డ‌మే ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. త‌మ‌న‌కు రిట‌ర్న్ ఎంత వ‌స్తుందో కంజ్యుమ‌ర్ల‌కు తెలియ‌డ‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు స్టేట‌స్‌ను ఈ యాప్ అంద‌జేస్తుంది. అంటే ప్రొఫెష‌న‌ల్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కుండానే మ‌నం సుల‌భంగా రిట‌ర్న్ ఫైల్ చేయ‌చ్చు. చాలామంది ఫ్రొఫెష‌న‌ల్స్ రిటర్న్ ఫైల్ చేయ‌డానికి ఎక్కువ డ‌బ్బులు ఆశిస్తారు. పైగా నాన్చుతారు. కానీ ఐటీయార్ యాప్‌తో ఇలాంటి ప్రాబ్ల‌మ్స్ ఉండ‌వు. మ‌న‌కు గంట‌ల వ్య‌వ‌ధిలో టాక్స్ రిట‌ర్న్ ఫైల్ అయిపోతుంది.
యూజ‌ర్ ఫ్రెండ్లీ
ఐటీఆర్ యాప్ యూజ‌ర్ ఫ్రెండ్లీ. మ‌నం ఉప‌యోగించ‌డం చాలా సుల‌భం. ఇందులో ఉండే కాలమ్స్ కూడా చాలా సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా ఉంటాయి. ఒక్కో నిబంధ‌న‌ను చ‌దువుతూ ముందుకెళితే స‌రిపోతుంది. మీ సంస్థ ఇచ్చిన ఫామ్ 16 మీ ద‌గ్గ‌ర పెట్ట‌కుని ఐటీఆర్ యాప్ ఇచ్చే సూచ‌న‌ల‌ను పాటిస్తూ ఒక్కో స్టెప్ చేసుకుంటూ వెళ్లాలి. అయితే ముందుగా ఫామ్ 16ను మీ ఫోన్ స్టోరేజ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత యాప్ ఓపెన్ చేయాలి. అందులో ఇ-ఫిల్లింగ్‌, ఇన్‌కంటాక్స్ కాలిక్యులేట‌ర్‌, హెచ్ఆర్ఏ కాలిక్యులేట‌ర్‌, రెంట్ రిసిప్ట్ జ‌న‌రేట‌ర్ లాంటి ఆప్ష‌న్లు ఉంటాయి. ఇ-ఫిల్లింగ్ క్లిక్ చేస్తే రెండు ట్యాబ్‌లు ఓపెన్ అవుతాయి. ఒక‌టి మీరు ఫామ్ 16 అప్‌లోడ్ చేసే ట్యాబ్‌, రెండోది మీరు డాక్యుమెంట్ స‌బ్‌మిట్ చేసే ట్యాబ్. ఫామ్ 16 అప్‌లోడ్ చేసి, పాస్‌వ‌ర్డ్ టైప్ చేసి, అన్ని కాల‌మ్స్ ఫిల్ చేసి బట‌న్ క్లిక్ చేయాలి. ఛార్జీలు ఎంత అవుతాయి?
అయితే ఆన్‌లైన్‌లో టాక్స్ రిటర్న్ ఫైల్ చేయ‌డానికి దాదాపు రూ.350 ఛార్జీ అయ్యే అవ‌కాశాలున్నాయి. అయితే టాక్స్ కన్‌స‌ల్టెంట్లు రూ.1000 వ‌ర‌కు వ‌సూలు చేస్తారు. మీ ఎర్నింగ్స్‌లో కాంప్లిక్సిటీని బట్టి వాళ్లు ర‌క‌ర‌కాల ప్ర‌త్యామ్నాయాల్లో టాక్స్ ఫైల్ చేస్తారు. కొంత‌మందికి ఛార్జీలు రూ.700 వ‌ర‌కు అయితే.. మ‌రికొంద‌రికి రూ.1500 వ‌ర‌కు అవుతాయి. అంటే ప్లాన్స్‌ను బ‌ట్టి రేటు మారుతుంది. మ‌ల్టిపుల్ ప్రాప‌ర్టీలు, పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించే వారు కొంచెం ఎక్కువ మొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

జన రంజకమైన వార్తలు