• తాజా వార్తలు
  •  

ఇప్పటివరకూ మీరు డౌన్ లోడ్ చేసిన టోటల్ యాప్స్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

మీ స్మార్ట్ ఫోన్ లో ఇప్పటివరకూ ఎన్ని యాప్ లు డౌన్ లోడ్ చేసారో మీకు తెలుసా? మీరు ఫోన్ కొన్నదగ్గరనుండీ చాలా యాప్ లు డౌన్ లోడ్ చేసి వాటిని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటారు. అవసరం లేదు అనుకున్న వాటిని అన్ ఇన్ స్టాల్ కూడా చేసుకుని ఉంటారు. వాటిలో అన్నింటినీ గుర్తు ఉంచుకోవడం చాలా కష్టం. అయితే ఇకపై ఆ బెంగ లేదు. మీరు మీ ఫోన్ ను కొన్న దగ్గరనుండీ ఎన్ని యాప్ లను ఇన్ స్టాల్ చేసుకున్నారు? అవి ఏవి? వాటిని తెలుసుకోవడం ఎలా ? ఇలాంటి విషయాలను గురించి ఈ ఆర్టికల్ లో చదువుకుందాం.

ఆండ్రాయిడ్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇప్పటివరకూ ఇన్ స్టాల్ చేసిన యాప్ ల గురించి తెలుసుకోవాలి అంటే ఆండ్రాయిడ్ యాప్ హిస్టరీ లో వెదకాలి. దీనిని మీరు మీ ఫోన్ లోనూ మరియు వెబ్ లోనూ కూడా చేసుకోవచ్చు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ యాప్ ను ఓపెన్ చేసి హ్యాం బర్గర్ మెనూ పై క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. అక్కడ మై యాప్స్ సెక్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ అప్ డేట్స్, ఇన్ స్టాల్డ్ , లైబ్రరి అని మూడు ఐకాన్ లు కనిపిస్తాయి. వాటిలో ఇన్ స్టాల్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ప్రస్తుతం ఉన్న యాప్ లు కనిపిస్తాయి. లైబ్రరీ పై క్లిక్ చేస్తే మీరు మీ ఫోన్ కొన్న దగ్గరనుండీ ఇప్పటివరకూ మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న యాప్ లు అన్నీ కనిపిస్తాయి. కావాలి అనుకుంటే మీరు మళ్ళీ వాటిని రీ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.

కంప్యూటర్ లో కూడా ఇంతే. గూగుల్ ప్లే స్టోర్ లోనికి వెళ్లి యాప్స్ పై క్లిక్ చేస్తే మై యాప్స్ అనే మరొక  సెక్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి పై విధంగానే చేస్తే మీరు డౌన్ లోడ్ చేసుకున్న యాప్ లన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి.

iOS

ఐఒఎస్ కి సంబందించిన యాప్ హిస్టరీ ని ఐ ఫోన్ లోనూ మరియు కంప్యూటర్ ద్వారా అయితే ఐ ట్యూన్స్ లోనూ చూడవచ్చు. దీనితో పాటు మీరు పాటలు, ఆల్బమ్స్, మూవీస్, టీవీ షో లు, బుక్స్, ఆడియో బుక్స్ లు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే మీ దగ్గర ఐ ట్యూన్స్, ఐఒఎస్ లేదా మాక్ ఒఎస్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ఉండాలి.

మీ ఐ ఫోన్ లేదా ఐ పాడ్ లో యాప్ సెక్షన్ ను ఓపెన్ చేసి కుడి వైపు మూలాన ఉండే అప్ డేట్స్ పై క్లిక్ చేయాలి. పర్చేస్డ్/మై పర్చేజేస్ పై క్లిక్ చేస్తే మీరు మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న యాప్ ల వివరాలు అక్కడ కనిపిస్తాయి.

మీ డెస్క్ టాప్ లోని ఐ ట్యూన్స్ లో అయితే ప్రొఫైల్ లో పై భాగాన ఉండే ఐకాన్ పై క్లిక్ చేయాలి. అక్కడున్న డ్రాప్ డౌన్ మెనూ లో పర్చేస్డ్ పై క్లిక్ చేస్తే మీరు డౌన్ లోడ్ చేసుకున్న యాప్ లు అన్నీ మీకు అక్కడ కనిపిస్తాయి.

విండోస్ 10 మొబైల్

మీ మొబైల్ లో కానీ డెస్క్ టాప్ లో కానీ విండోస్ స్టోర్ యాప్ ను ఓపెన్ చేయాలి. సెర్చ్ బాక్స్ పక్కన ఉండే మీ ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. మై లైబ్రరీ పై క్లిక్ చేయాలి.మీ యాప్ హిస్టరీ చూడడానికి లాగ్ ఇన్ అవ్వాలి. లాగ్ ఇన్ అయిన తరవాత షో ఆల్ పై క్లిక్ చేస్తే మీ డివైస్ లో ఇప్పటివరకూ ఇన్ స్టాల్ అయిన యాప్ లు అన్నీ అక్కడ కనిపిస్తాయి.

జన రంజకమైన వార్తలు