• తాజా వార్తలు
  •  

ఆన్ లైన్లో ఆడియో కాన్ఫరెన్స్ సర్వీసు ను డయల్ నెంబర్స్ తో వాడుకోండి .. ఇలా

బెస్ట్ ఫ్రీ ఆన్ లైన్ ఆడియో కాన్ఫరెన్స్ సర్వీసులలో టాప్ 2 సర్వీసులను మీకోసం అందిస్తున్నాం. వీటిని ఉపయోగించి మీరు మీ టీంతో ఆడియో కాన్ఫరెన్సింగ్ సెషన్లను నిర్వహించుకోవచ్చు. ఈ సర్వీసులను ఉపయోగించడం చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా సైన్ అప్ చేయడం ఒకటే. మీకు ఫ్రీ ఇండియన్ డయల్ నెంబర్ ను అందిస్తారు. తర్వాత ఈ ఆడియో నెంబర్ తో సులభంగా కాన్ఫరెన్స్ స్టార్ట్ చేయవచ్చు. ఇవి పూర్తిగా వెబ్ ఆధారిత సర్వీసులు.

ఆడియో కాన్ఫరెన్స్ మాత్రమే కాకుండా వీడియో కాల్స్, స్క్రీన్ షేరింగ్, ఫైల్ షేరింగ్ వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉంటాయి.

1. ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ( free conference call)

బెస్ట్ ఫ్రీ ఆన్ లైన్ ఇండియన్ ఆడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసులలో ఇది ఒకటి. హై డెఫినిషన్ ఆడియో కాన్ఫరెన్స్ సెషన్స్ ను ఫ్రీగా వెయ్యి మంది పాల్గొనేలా నిర్వహిస్తుంది. కాన్ఫరెన్స్ డ్యూరెషన్ కు సంబంధించి ఎలాంటి టైం లిమిట్ ఉండదు. ఈ సర్వీసు కోసం రిజిస్ట్రర్ చేసినప్పుడు...కాన్ఫరెన్స్ కు ఉపయోగించే ఫ్రీ డయల్ అప్ నెంబర్ ను మీరు పొందుతారు. ఆడియో కాన్ఫరెన్సింగ్ తో పాటు, వీడియో కాన్ఫరెన్స్, స్క్రీన్ షేరింగ్ కోసం కూడా ఈ వెబ్ సైట్ ను ఉపయోగించవచ్చు. ఫ్రీ వెర్షన్ లో భాగంగా ఈ సర్వీసు మీకు 1జిబి ఫ్రీ స్టోరేజిలో మాత్రమే లభిస్తుంది.

ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ఉపయోగించి...ఆడియో కాన్ఫరెన్సింగ్ ఎలా చేయాలి?

స్టెప్1. స్టార్ట్ చేసే ముందు...ఈ సర్వీసు యొక్క హోం పేజికి వెళ్లి...కొత్త అకౌంట్ కోసం సైన్ అప్ చేయాలి. ఇలా చేసిన వెంటనే ఆటోమెటిగ్గా మీకు డయల్ ఇన్ వివరాలను జనరేట్ చేస్తుంది. మీరు ఫ్రీ డయల్ ఇన్ నెంబర్ యాక్సిస్ కోడ్ తోపాటు హోస్ట్ పిన్ కూడా ఇవ్వబడుతుంది.

స్టెప్ 2. ఇప్పుడు ఫ్రీగా ఆడియో కాన్ఫరెన్సింగ్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితే...ఆడియో కాన్ఫిరెన్సింగ్ను స్టార్ట్ చేయడానికి డయన్ ఇన్ నెంబర్ను కాల్ చేస్తారు. అప్పడు యాక్సెస్ కోడ్ను ఎంటర్ చేసి...హోస్ట్ పిన్ తో జాయిన్ అయిన తర్వాత కాన్ఫరెన్స్ నిర్వహించాలి.

స్టెప్ 3. డయల్ ఇన్ నెంబర్ను మీ గ్రూప్ మెంబర్స్ తో యాక్సెస్ కోడ్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఆడియో నెంబర్ కు చేరుకునేందుకు యాక్సెస్ కోడ్ ను కూడా ఉపయోగించవచ్చు. ఎలాంటి కాల పరిమితి లేకుండా ఫ్రీగా కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చు.

స్టెప్ 4. కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ఫోన్ కీ ప్యాడ్ ఆదేశాలతో పలు అంశాలను కంట్రోల్ చేస్తారు. ఉదాహరణకు 3 బటన్ను నొక్కినట్లయితే బ్రేక్ అవుట్ రూమ్స్, 9 నెంబర్ నొక్కినట్లయితే కాల్ రికార్డు చేయవచ్చు.

ఫ్లాక్ (flock)

ఫ్లాక్....బెస్ట్ ఫ్రీ ఆన్ లైన్ ఎంటర్ ప్రైజెస్ కమ్యూనికేషన్ టూల్స్ లో ఒకటి. చాట్, ఫైల్ ఫేరింగ్, వీడియో కాల్స్ తోపాటు మరిన్నింటికోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్నింటికీ కాకుండా...బ్రిడ్జ్ అని పిలిచే మరొక ఫీచర్ ను కూడా యాడ్ చేశారు. ఈ ఫీచర్ ఒక ఇండియన్ డయల్ నెంబర్ ఆడియో కాన్ఫరెన్సింగ్ లో సులభం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే ఈ ఫీచర్ కొన్ని పరిమితులను కలిగి ఉంటుంది. ప్రీ కాన్ఫరెన్స్ కాల్ మాదిరిగా కాకుండా...కేవలం పది మంది మాత్రమే పాల్గొంటారు. ప్రతి సెషన్ కు 90 నిమిషాల కాలపరిమితి ఉంటుంది.

ప్లాక్ తో ఆడియో కాన్ఫరెన్సింగ్ చేయటం ఎలా?

స్టెప్ 1...మొదటగా ప్లాక్ ఓపెన్ చేసి మీ అకౌంట్ కు లాగిన్ అవ్వాలి. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీ గ్రూప్ సభ్యులను ఆహ్వానించాలి. వారితో చాట్ చేయవచ్చు. చాటింగ్ చేస్తున్నప్పుడు టాప్ లో మీరు బ్రిడ్జ్ ఆప్షన్ ను చూస్తారు.

స్టెప్ 2. ఇప్పుడు ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి బ్రిడ్జ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీకోసం డయల్ ఇన్ సమాచారాన్ని క్రియేట్ చేస్తుంది. ఫ్రీ ఇండియన్ డయల్ ఇన్ నెంబర్ పిన్ పాల్గొనే వ్యక్తి, పిన్ మోడరేటర్ ను పొందుతారు.

స్టెప్ 3. కాన్ఫరెన్స్ ప్రారంభించాలంటే...మిగతా అన్నింటిని పక్కనపెట్టాలి. కాన్ఫరేన్స్ లో పాల్గొనేవారిని మోడరేటర్ పిన్ తర్వాత ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆడియో కాన్ఫరేన్సును స్టార్ట్ చేస్తుంది. మిమ్మల్ని హోస్ట్ గా పరిగణిస్తుంది.

స్టెప్ 4. ఇప్పుడు మీరు గ్రూప్ సభ్యులతో డయల్ ఇన్ నెంబర్ ను షేర్ చేసుకోవచ్చు. వారు కాన్ఫరేన్స్ లో పాల్గొనేందుకు సమాచారాన్ని ఉపయోగింవచ్చు. అయితే ఈ సెషన్ గడువు 90నిమిషాల తర్వాత ఆటోమెటిక్ గా ముగుస్తుంది.

 

జన రంజకమైన వార్తలు