• తాజా వార్తలు
  •  

IRCTC అకౌంట్ ని ఆధార్ తో లింక్ చేసి రూ 10,000/- లు గెలుచుకోవడం ఎలా?

అవును మీరు చదువుతున్నది నిజం! ప్రయాణికులను ఆకర్షించడానికి IRCTC సరికొత్త పతాకాన్ని ముందుకు తెచ్చింది. IRCTC కస్టమర్ లకు క్యాష్ రివార్డ్ లు అందిస్తుంది.ఇందులో భాగంగా మీకు రూ 10,000/- లు గెలుచుకునే అవకాశం ఉంది. దీనితో పాటు సమ్మర్ స్పెషల్ గా 42 సరికొత్త రైళ్ళను కూడా వివిధ మార్గాలలో తిప్పనుంది. వీటికి సంబందించిన విశేషాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

మీ IRCTC ఎకౌంటు ఆధార్ తో లింక్ చేయండి. రూ 10,000/- లు గెలవండి

మీకు IRCTC ఎకౌంటు ఉందా? అయితే మీ ఎకౌంటు ను మీ ఆధార్ కార్డు తో లింక్ చేస్తే మీకు రూ 10,000/- క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ స్కీం గత సంవత్సరం డిసెంబర్ లోనే IRCTC ప్రవేశపెట్టినప్పటికీ జనాల లోనికి అంతగా ఎక్కని కారణంగా మరొకసారి ఈ స్కీం ను ముందుకు తీసుకువచ్చి ప్రమోషన్ చేస్తున్నారు. ఈ ఆఫర్ జూన్ వరకూ అందుబాటులో ఉంటుంది.

మీరు మీ IRCTC ఎకౌంటు ను ఉపయోగించి జూన్ లోపు టికెట్ బుక్ చేసుకోవాలి. మీ ఎకౌంటు తప్పనిసరిగా ఆధార్ తో లింక్ అయి ఉండాలి. మీ IRCTC ఎకౌంటు లో ఉండే పేరు మరియు మీ ఆధార్ కార్డు మీద ఉండే పేరు ఒకే రకంగా ఉండాలి. దీనికి సంబంధించి లక్కీ డ్రా ను తీయడం జరుగుతుంది. లక్కీ డ్రా లో గెలిచిన వారి యొక్క టికెట్ డబ్బు మొత్తాన్ని రిఫండ్ చేస్తారు. మరియు రూ 10,000/- ల నగదు బహుమతిని కూడా అందజేస్తారు. ప్రతీ నెలా అలా ఒక విజేతను ప్రకటిస్తారు. లక్కీ డ్రా లో గెలిచిన వారికీ ఈ మెయిల్ ద్వారా మెసేజ్ పంపిస్తారు. మొట్టమొదటి డ్రా జనవరి నెలలో తీయడం జరిగింది. ఈ నగదు బహుమతులు మరియు లాటరీ లకు సంబంధించి భారత ప్రభుత్వం రూ 340 కోట్ల ను ప్రకటించింది.

వేసవికి 42 స్పెషల్ రైళ్ళు

పెరుగుతున్న వేసవి తాపాన్ని, వేసవి సెలవులలో ఉండే రద్దీని  దృష్టిలో ఉంచుకుని భారత రైల్వేస్ 42 ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. ఇవి దేశ వ్యాప్తంగా మొత్తం 452 రూట్ల లో తిరుగుతాయి. చత్రపతి శివాజీ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్ మరియు గోరఖ్ పూర్, మండువాది, జమ్మూ తావి, లక్నో, వారణాసి, నాగపూర్, పాట్నా, కర్మాలి, చెన్నై సెంట్రల్, సంత్రగచ్చి, బిలాస్ పూర్, కొచువేలి మరియు సావంత్వాడి రోడ్ నగరాల మధ్య ఈ రైళ్ళు తిరగనున్నాయి.

జన రంజకమైన వార్తలు