• తాజా వార్తలు
  •  

ఎయిర్ టెల్, బి.ఎస్.ఎన్.ఎల్ యూజర్లు ఆధార్ తో లింక్ అయిన ఫోన్ నంబర్లు తెలుసుకోవడం ఎలా ?

మొబైల్ వినియోగదారులందరూ తమ మొబైల్ నెంబర్ ను మార్చి31 వ తేదీలోగా  ఆధార్ తో లింక్ చేసుకోవాలి అనే గడువును భారత సుప్రీంకోర్టు నిరవధికంగా వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసినదే. దీని అర్థం ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాదు అని కాదు. కాకపొతే గడువుతేదీ ఏదీ లేదు. ఎప్పటికైనా మన మొబైల్ నెంబర్ ను ఆధార్ తో లింక్ చేయాల్సిందే. ఈ నేపథ్యం లో అసలు మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ తో లింక్ అయిందో లేదో తెలుసుకోవడం ఎలా? అనే అంశం పై ఈ రోజు ఆర్టికల్ లో చర్చిద్దాం. అయితే ఈ సౌకర్యం ప్రస్తుతం ఎయిర్ టెల్ మరియు BSNL యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎయిర్ టెల్ మరియు BSNL యూజర్ లు తమ నెంబర్  ఆధార్ తో లింక్ అయింది లేదో తెలుసుకోవడం ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం   

ఎయిర్ టెల్ యూజర్ లు తెలుసుకోవడం ఎలా?

ఎయిర్ టెల్ యూజర్ లు తమ మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ అయిందో లేదో తెలుసుకోవాలి అంటే ADCHK మీ ఆధార్ నెంబర్ ను టైపు చేసి 121 కు sms చేయాలి. అంతే మీ ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ల వివరాలు మీకు sms రూపం లో వస్తాయి. అయితే ఇక్కడ మీకు కేవలం ఎయిర్ టెల్ నెంబర్ ల వివరాలు మాత్రమే తెలుస్తాయి. ఉదాహరణకు మీకు రెండు ఎయిర్ టెల్ మరియు ఒక వోడాఫోన్ నెంబర్ లు ఉన్నాయనుకోండి. ఈ విధానం  ద్వారా కేవలం ఎయిర్ టెల్ నెంబర్ యొక్క వివరాలు మాత్రమే తెలుస్తాయి. మరొక ముఖ్య విషయం ఏమిటంటే మీ మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఆధార్ తో లింక్ అయి ఉంటేనే ఈ వివరాలు తెలుస్తాయి.లేకుంటే తెలియవు.

BSNL యూజర్ లు ఎలా తెలుసుకోవాలి?         

BSNL యూజర్ లు కూడా కేవలం ఒకే ఒక్క sms ద్వారా ,ఈ మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. మీ మొబైల్ నుండి ALIST మీ ఆధార్ నెంబర్ ను టైపు చేసి 53734 కు sms చేయాలి. వెంటనే మీ ఆధార్ తో లింక్ అయి ఉన్నఫోన్ నెంబర్ ల వివరాలు తెలుస్తాయి. ఇక్కడకూడా కేవలం BSNL నెంబర్ లు మాత్రమే తెలుసుకునే వీలు ఉంటుంది. ఉదాహరణకు మీకు రెండు BSNL ఒక ఎయిర్ టెల్ నెంబర్ ఉందనుకోండి. ఈ పద్దతిలో కేవలం BSNL నెంబర్ కు సంబందించిన వివరాలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడకూడా మీ BSNL నెంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాల్సిందే.

జన రంజకమైన వార్తలు