• తాజా వార్తలు
  •  

మీ ఓటర్ కార్డు లో తప్పులను ఆన్ లైన్ లో సరిచేసుకోవడం ఎలా?

కొత్తగా వోటర్ కార్డు కోసం ఆన్ లైన్ లో ఎలా అప్లై చేయాలి? మీ అప్లికేషను యొక్క స్టేటస్ ను ఆన్ లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి? అనే అంశాల గురించి గత రెండు ఆర్టికల్ లలో ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆర్టికల్ లో మీ వాటర్ కార్డు లో ఉన్న తప్పులను ఆన్ లైన్ లో ఎలా సరి చేసుకోవాలి? అనే అంశం గురించి వివరించడం జరుగుతుంది.

వోటర్ కార్డు లో తప్పులు

మీరెప్పుడైనా మీ వోటర్ కార్డు ను నిశితంగా గమనించారా? అందులో మీ యొక్క వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో గమనించారా? సాధారణంగా వోటర్ కార్డు మీద మీ పేరు, తండ్రి పేరు, వయసు , చిరునామా మొదలగు వివరాల తో పాటు మీ ఫోటో కూడా ఉంటుంది. అయితే ఎక్కువశాతం వోటర్ కార్డు లలో ఈ వివరాల లో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ లు, అడ్రెస్ లో మార్పులు, వయసు తప్పుగా నమోదు అవడం లాంటి తప్పులు సాధారణంగా వోటర్ కార్డు పై ఉంటాయి. కొంతమందికి అయితే ఫోటో కూడా తప్పుగా ఉంటుంది. చాలామంది వీటిని గమనించరు. కొంతమంది గమనించినా ఏముందిలే అని పట్టించుకోకుండా ఉంటారు. అయితే మనకు సంబందించిన డాక్యుమెంట్ లు ఏవైనా ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా, తప్పులు లేకుండా ఉంచుకోవడం చాలా మంచిది. మరి ఈ వోటర్ కార్డు లో ఉన్న తప్పులను ఆన్ లైన్ లో సరిచేసేదేలా?

వోటర్ ఐడి కార్డు లో వివరాల సవరణకు అప్లై చేసేదెలా?

  1. మీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేసి నేషనల్ వోటర్ సర్వీస్ పోర్టల్ వెబ్ సైట్ ను బ్రౌజ్ చేయాలి. పేజి ఓపెన్ అవుతుంది.
  2. ఆ పేజి ని క్రిందకు స్క్రోల్ చేస్తే కరెక్షన్స్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎలేక్ట్రోరల్ రోల్ అనే ఐకాన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయాలి లేదా క్లిక్ హియర్ అనే దానిపై క్లిక్ చేయాలి. లేదా NVSPform8 పేజి ని డైరెక్ట్ గా విజిట్ చేయాలి.
  3. డ్రాప్ డౌన్ మెనూ ద్వారా మీ భాషనూ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ రాష్ట్రం, అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గం మొదలైన వివరాలను పూర్తి చేయాలి.
  4. క్రిందకు స్క్రోల్ చేస్తే please tick the entry which is to be corected  అనే సెక్షన్ వస్తుంది. ఇక్కడ మీరు సరి చేయాలి అనుకుంటున్న వివరాలను టిక్ చేయాలి. అనేక వివరాలను ఒకేసారి కూడా టిక్ చేయవచ్చు.
  5. మీరు ఈ వివరాలను టిక్ చేసిన తర్వాత ఆ వివరాలు ఉన్న ప్రదేశo బూడిద రంగులోనుండి తెలుపు రంగు లోనికి మారుతుంది. అక్కడ మీరు సరైన వివరాలను ఫిల్ చేయాలి.
  6. ఆ తర్వాత ఆ ఫారం లో మిగిలిన వివరాలైన ఈ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తదితరాలను కూడా ఎంటర్ చేయాలి.
  7. ఒకవేళ మీ ఫోటో మార్పు అయితే మీ యొక్క సరైన ఫొటో ను అప్ లోడ్ చేయాలి.
  8. అన్నీ పూర్తి అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుని పేజి క్రింద భాగం లో ఉండే సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేయాలి.

తర్వాతి ప్రక్రియ ఏమిటి ?

మీ ఏరియా కు సంబందించిన బూత్ లెవెల్ ఆఫీసర్ కు మీ అప్లికేషను ఆన్ లైన్ ద్వారా పంపబడుతుంది. ఆ అధికారి విచారణ చేసి సంబందిత డాక్యుమెంట్ లను మీ దగ్గర నుండి తీసుకుని వాటిని ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారు. అంతే మీ వివరాలు వోటర్ ఐడి కార్డు లో మారిపోతాయి.

అవసరమైన డాక్యుమెంట్ లు ఏవి?

మీరు కావాలి అనుకున్న మార్పులను బట్టి అవసరమైన డాక్యుమెంట్ లు ఆధారపడి ఉంటాయి. ఫోటో మార్పు అయితే ఫోటో కావాలి. పేరు లు తప్పులు, పుట్టిన తేదీ తదితర వివరాల కోసం అయితే బర్త్ సర్టిఫికేట్, PAN కార్డు, పాస్ పోర్ట్ తదితర డాక్యుమెంట్ లు అవసరo అవుతాయి.

 

  

జన రంజకమైన వార్తలు