• తాజా వార్తలు
  •  

ఫేస్ బుక్ గ్రూప్ లో పోస్ట్ ను డిలీట్ చేయడం ఎలా?

ఫేస్ బుక్ గ్రూప్ మెయింటైన్ చేస్తున్నారా? అయితే అందులో ఎవరైనా అసభ్యంగా, అమర్యాదగా ఏదైనా పోస్ట్ చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు నడుపుతున్న గ్రూప్ లో ఎవరైనా అలాంటివి పెడితే మీదే బాధ్యత అవుతుంది. కాబట్టి కేర్ ఫుల్ గా ఉండండి. అంతేకాదు అలాంటి పోస్ట్ ను డిలీట్ చేయడం చాలా ఈజీ కూడా. అభ్యంతరకరమైన పోస్ట్ ఉంటే ఎలా డిలీట్ చేయాలంటే
   1.డిలీట్ చేయాల్సిన మెసేజ్ తర్వాత ఉన్న డౌన్ యారోను క్లిక్ చేయండి.

   2. డ్రాప్ డౌన్ మెనూ నుంచి Delete post ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.

   3. ఫేస్ బుక్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. కాబట్టి delete ను మళ్ళీ క్లిక్ చేయండి.

   4. అంతే మెసేజ్ డిలీట్ ఐపోతుంది.                                

   5. ఒకవేళ మీరు గ్రూప్ ఆడ్మిన్ కాకపోయినా ఇలాంటి అసభ్య కరమైన, అభ్యన్తరకరమైన మెసేజ్ లు ఉన్నట్టు గుర్తిస్తే అడ్మిన్ దృష్టికి       తీసుకెళ్ళొచ్చు. ఇందుకోసం డౌన్ యారోలో ఉన్న Report to Adminను క్లిక్ చేయండి.
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు