• తాజా వార్తలు
  •  

వాట్స్ అప్ మెసేజ్ ని సెండర్స్ కి తెలియకుండా చూసేయడం ఎలా ?

సోషల్ మీడియా లో టాప్ పొజిషన్ లో ఉన్న వాట్స్ అప్ గత కొన్ని సంవత్సరాలుగా అనేక కొత్త ఫీచర్ లను యాడ్ చేసుకుంటూ వస్తుంది. వాటిలో అతి ముఖ్యమైనది రీడ్ రిసిప్ట్ ఫీచర్. మీకు ఏదైనా మెసేజ్ వచ్చినపుడు మీరు దానిని చదివిన వెంటనే అ మెసేజ్ దగ్గర ఉన్న రెండు డబల్ క్లిక్ లు బ్లూ కలర్ లోనికి మారి అవతలి వారికి కనిపిస్తాయి. మీరు పంపిన మెసేజ్ అవతలి వారు చదివినా మీకు ఇలాగే కనిపిస్తుంది. ఇది అందరికీ తెలిసినదే. సాధారణంగా ఈ ఫీచర్ ను ఆఫ్ చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో అంటే మనకు వచ్చిన మెసేజ్ మనం చదివినట్లు అవతలివారికి తెలియకూడదు అనిపిస్తే! దానికి సెట్టింగ్స్ లో చైనా మార్పులు చేయడం ద్వారా మెసేజ్ పంపిన వారికీ తెలియకుండానే చదివేయవచ్చు. ఇదేమీ కష్టతరమైంది కాదు, చాలా సింపుల్. అది ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

మెసేజ్ పంపిన వారికి తెలియకుండానే వాట్స్ అప్ మెసేజ్ చదివేయండి ఇలా?

వాస్తవానికి ఇందులో పెద్ద సెట్టింగ్స్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం బుర్ర ఉపయోగిస్తే చాలు. అదెలాగో చూద్దాం.

మీకు ఏదైనా వాట్స్ అప్ మెసేజ్ వచ్చిన వెంటనే మొదటగా నోటిఫికేషన్ ప్యానెల్ ను క్రిందకు స్క్రోల్ చేసి, మీ ఫోన్ ను ఎయిర్ ప్లేన్ మోడ్ కు స్విచ్ ఆన్ చేయండి.

ఇప్పుడు మీ ఫోన్ ఆఫ్ లైన్ లోనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాట్స్ అప్ ను ఓపెన్ చేసి ఆ మీకు వచ్చిన మెసేజ్ ను చదవండి.

చదవడం పూర్తి అయ్యాక వాట్స్ అప్ యాప్ ను మల్టి విండోస్ నుండి క్లోజ్ చేయండి. దీనివలన అది బ్యాక్ గ్రౌండ్ లో కూడా రన్ అవ్వకుండా ఉంటుంది.

యాప్ ను పూర్తి గా క్లోజ్ చేసాక ఎయిర్ ప్లేన్ మోడ్ ను స్విచ్ ఆఫ్ చేయండి.

గమనిక: మీరు మీ మెసేజ్ ను చదివిన వెంటనే తప్పనిసరిగా మల్టి విండోస్ లో ఉన్న యాప్ ను క్లోజ్ చేసేయాలి. లేకపోతే ఆ యాప్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటుంది. దీనివలన యాప్ రున్నింగ్ లో ఉంది కాబట్టి మీరు అ మెసేజ్ ను చదివనట్లు అవతలి వారికి ఇట్టే తెలిసిపోతుంది. అంటే అ మెసేజ్ పై బ్లూ కలర్ లో డబుల్ టిక్ లు అవతలివారికి కనిపిస్తాయి.   

జన రంజకమైన వార్తలు