• తాజా వార్తలు
  •  

మీ ఫోన్ తోనే సైబర్ క్రైమ్ ని ఫైట్ చేయడo ఎలా ?

స్మార్ట్ ఫోన్ ల ద్వారా తీసిన ఫోటో లను విశ్లేషణ చేయడం ద్వారా వాటిని గుర్తించే టెక్నాలజీ అందుబాటులోనికి వచ్చింది. ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్ లు మరియు పాస్ వర్డ్ లకు బదులుగా ఒక సరికొత్త అథెన్టికేషన్ ప్రక్రియ కు మార్గం సిద్దం చేయడం ద్వారా సైబర్ క్రైమ్ ను సమర్థవంతంగా ఎదుర్కోనుంది.

ఏ రెండు స్మార్ట్ ఫోన్ లూ ఒకే రకంగా ఉండవు. తయారీదారునితో సంబంధం లేకుండా ప్రతి డివైస్ కూడా కొన్ని విశిష్ట          (యూనిక్) మైక్రోస్కోపిక్ ఇమేజింగ్ దోషాలను అది తీసే ప్రతీ ఫోటో లోనూ కలిగిఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే గన్ లో బులెట్ లు ఎలా మ్యాచ్ చేస్తామో స్మార్ట్ ఫోన్ కెమెరా లో కూడా ఫోటో లు అలా మ్యాచ్ చేస్తాం అన్నమాట. క్యాష్ రిజిస్టర్ లు, ATM మరియు ఆన్ లైన్ ట్రాన్సక్షన్ చేసే ప్రక్రియ లో ఉండే పిన్ నెంబర్ లు మరియు పాస్ వార్డ్ ల ద్వారా టెక్నాలజీ అథెన్టికేషన్ ప్రక్రియ లో ఒక భాగంగా మారింది. ఎవరిదైనా వ్యక్తిగత సమాచారం సైబర్ క్రిమినల్ ల ద్వారా తస్కరణ కు గురైనపుడు వారు వారి పేరు పై చేసే కొనుగోళ్ళ ద్వారా వాటిని నిరోధించే అవకాశం ఉంది.

డిజిటల్ కెమెరా లు అన్నీ ఒకే రకంగా తయారు చేయబడతాయి. అయితే ప్రతీ ఒక్కదానిలో ఉండే కొన్ని కొన్ని తయారీ లోపాలు ప్రతీ కెమెరా యొక్క సెన్సార్ లలో చిన్న చిన్న వ్యత్యాసాలకు కారణం అవుతాయి.ఈ వ్యత్యాసాలను ఫోటో రెస్పాన్స్ నాన్ యూనిఫార్మిటి ( PRNU ) అని అంటారు. వీటి వలన ఈ సెన్సార్ లద్వారా తీసే ఫోటో లలో ఉండే రంగులు అవి ఉండవలసిన వాటికంటే కొంచెం ఎక్కువ బ్రైట్ గానూ లేక డార్క్ గానూ వస్తాయి. ఇలా తీసే ఫోటో లలో సారూప్యత లేకపోవడాన్ని ప్యాటర్న్ నాయిస్ అని అంటారు. ప్రత్యేకమైన ఫిల్టర్ ల ద్వారా చూసినపుడు ఈ పాటర్న్ అనేది ఒక్కో కెమెరా కూ ఒక్కోరకంగా ఉంటుంది.

ఈ PRNU విశ్లేషణ అనేది డిజిటల్ ఫోరెన్సిక్ సైన్సు లో సాధారణంగా ఉండేదే. అయితే ఇంతవరకూ ఇది సైబర్ సెక్యూరిటీ లోనికి ప్రవేశించలేదు. దీనికి కారణం ఇది ఒకే కెమెరా ద్వారా తీసిన 50 ఫోటో లను విశ్లేషణ చేయవలసి ఉంటుంది. అయితే అన్ని ఫోటో లను నిపుణులు ఇవ్వడానికి అంత ఆసక్తి చూపించరు.

సాధారణ డిజిటల్ కెమెరా తో పోలిస్తే ఈ ఇమేజ్ సెన్సార్ అనేది చిన్నగా ఉంటుంది. ఈ తగ్గుదల అనేది పిక్సెల్ డైమెన్షనల్ నాన్ యూనిఫార్మిటి ని ఎక్కువ చేయడం ద్వారా ఒక దృఢమైన PRNU సృష్టిస్తుంది.  తద్వారా 50 మామూలు ఫోటో లతో మ్యాచ్ బదులు ఒక్క స్మార్ట్ ఫోన్ తో తీసిన ఫోటో ను డిజిటల్ ఫోరెన్సిక్ లో మ్యాచ్ చేయడానికి వీలవుతుంది.

ఇది ఎలా పని చేస్తుందంటే ..... మొదటగా ఒక కస్టమర్ ఒక బిజినెస్ ను రిజిస్టర్ చేసుకున్నాడు అనుకుందాం. అతను ఆ బ్యాంక్ కు గానీ లేదా రిటైలర్ కు గానీ ఒక ఫోటోను రిఫరెన్స్ లా ఇస్తాడు. ఈ కస్టమర్ ఏదైనా ట్రాన్సక్షన్ చేసేటపుడు ATM లేదా క్యాష్ రిజిస్టర్ లో ఉండే రెండు QR కోడ్ లను ఫోటో తీయవల్సిందిగా రిటైలర్ అడుగుతాడు. ఇదంతా ఒకా యాప్ ద్వారా జరుగుతుంది. ఈ యాప్ ను ఉపయోగించి కస్టమర్ ఆ ఫోటో ను రిటైలర్ కు పంపుతాడు. అప్పుడు అతను ఆ స్మార్ట్ ఫోన్ యొక్క PRNU యాప్ ద్వారా విశ్లేషణ చేస్తాడు. ఈ PRNU లో ఏదైనా తేడాలుంటే వెంటనే పసిగట్టేస్తారు.

చాలామంది చేయి తిరిగిన సైబర్ నేరగాళ్ళు తమ డివైస్ లనుండి ఈ PRNU లను చాలా సమర్థవంతంగా తీసివేయగలుగుతారు. అయితే ఈ సరికొత్త ప్రోటోకాల్ లో QR కోడ్ లు కూడా కలిసిఉండడం వలన అలా తీసివేయడం అనేది సైబర్ క్రిమినల్ లకు క్లిష్టతరంగా మారుతుంది. ఈ టెస్ట్ ల ద్వారా సదరు ట్రాన్సక్షన్ అనేది అప్రూవ్ అవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు.   

 ఈ విధంగా మీరు మీ స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి సైబర్ క్రిమినల్ లతో ఫైట్ చేయవచ్చు.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు