• తాజా వార్తలు
  •  

ఎయిర్ టెల్ కస్టమర్ లు ఉచిత అమజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ పొందడం ఎలా ?

ఎయిర్ టెల్ తన పోస్ట్ పెయిడ్ మరియు వి- ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ లకోసం ఒక సంవత్సరం పాటు ఉచిత అమజాన్ ప్రైమ్ సర్వీస్ ను అందిస్తుంది. ఎయిర్ టెల్ టీవీ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా దీనిని పొందవచ్చు. ఇది ఇంతకుముందు కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ప్రస్తుతం ఈ ప్రమోషనల్ ఆఫర్ తన యూజర్ లకు మూవీ లను మరియు టీవీ షో లను చూపించే మరొక ఫ్లాట్ ఫాం ను అందించడమే గాక మూవీ స్ట్రీమింగ్ మరియు లైవ్ టీవీ యాప్ ల విషయం లో జియో తో పోటీ పడడానికి ఎయిర్ టెల్ కు సహాయం చేస్తుంది. ఈ ఆఫర్ మై ఇన్ఫినిటీ ప్లాన్ లో రూ 499/- అంతకంటే ఎక్కువ ప్లాన్ లో ఉన్న ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ కస్టమర్ లకు మరియు రూ 1000/- కంటే ఎక్కువ ప్లాన్ లో ఉన్న వి-ఫైబర్ కస్టమర్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎయిర్ టెల్ మరియు అమజాన్ ల మధ్య ఈ ఒప్పందం ఈ సంవత్సరం డిసెంబర్ వరకూ ఉంటుంది. అంటే ఒక సంవత్సరం పాటు యూజర్ లు ఉచిత ప్రైమ్ సర్వీస్ లను ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు దీనిని జూన్ లో యాక్టివేట్ చేసుకుంటే మీకు కేవలం 7 నెలల సబ్ స్క్రిప్షన్ మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్ మరియు వి- ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ లు ఈ ఆఫర్ ను వినియోగించుకోగలరు.

ఈ ఆఫర్ ను వినియోగించుకోవడం ఎలా?

ముందుగా ఎయిర్ టెల్ టీవీ యాప్ ను ప్లే స్టోర్ నుండి కానీ యాప్ స్టోర్ నుండి కానీ డౌన్ లోడ్ చేసుకోవాలి.

మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి లాగ్ ఇన్ అవ్వాలి.

లాగ్ ఇన్ అయ్యిన తర్వాత క్రిందకు స్క్రోల్ చేస్తే అమజాన్ ప్రైమ్ యొక్క బ్యానర్ ఒకటి మీకు కనిపిస్తుంది.

ఆ బ్యానర్ పై ట్యాప్ చేస్తే ప్రైమ్ సర్వీస్ యొక్క వివరాలతో కూడిన ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు యాక్టివేట్ పై ట్యాప్ చేయాలి.

ఇక్కడ మీరు మీ అమజాన్ ఎకౌంటు క్రెడెన్షియల్స్ ను ఇవ్వవలసి ఉంటుంది.

ఈ క్రెడెన్షియల్స్ వెరిఫై చేయబడిన తర్వాత మీ ఫ్రీ 365 రోజుల అమజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ స్టార్ట్ అవుతుంది. దీని వివరాలు మీకు SMS ద్వారా గానీ ఈ మెయిల్ ద్వారా గానీ పంపబడతాయి.

        ఈ ఆఫర్ కేవలం ప్రైమ్ మెంబర్ షిప్ లేని అమజాన్ యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే మీరు సబ్ స్క్రైబర్ అయినట్లయితే మీ సబ్ స్క్రిప్షన్ పీరియడ్ పూర్తి అయేంతవరకు వేచి చూసి ఆ తర్వాత దీనిని పొందవలసి ఉంటుంది. ఉచిత ట్రయల్ లో ఉన్న అమజాన్ కస్టమర్ లు కూడా ఇదే విధంగా దీనిని ఉపయోగించుకోవాలి. ఎయిర్ టెల్ చెబుతున్న దాని ప్రకారం కస్టమర్ లు ప్రస్తుతం ఉన్న ప్లాన్ కొనసాగించినంత కాలం ఇది అందుబాటులో ఉంటుంది.  ప్రస్తుత ప్లాన్ కంటే ఎక్కువ ప్లాన్ లోనికి మారినా దీనిని వినియోగించుకోవచ్చు. కానీ ప్రస్తుత ప్లాన్ కంటే తక్కువ ప్లాన్ లోనికి మారితే మాత్రం ఇది ఆపివేయబడుతుంది. ఒక సంవత్సరం పాటు ఉచిత సబ్ స్క్రిప్షన్ పూర్తి అయిన తర్వాత రూ 999/- లు ఛార్జ్ చేయబడుతుంది.

 

జన రంజకమైన వార్తలు