• తాజా వార్తలు

వాట్స్ అప్ గ్రూప్ లో మీ మొబైల్ నెంబర్ హైడ్ చేయడం ఎలా ?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఈ మధ్య సోషల్ మీడియా లో ఒక జోక్ బాగా పాపులర్ అయింది. అదేంటంటే మీకు ఎవరిమీదైనా కోపం ఉంటే వాడిని ఒక పది వాట్స్ గ్రూప్ లలో యాడ్ చేస్తే చాలు వాడి తిక్క కుదురుతుంది అని. చూడడానికి ఇది జోక్ లా ఉన్నా వాట్స్ గ్రూప్ ల వలన యూజర్ లు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేదానికి ఇది ఒక ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎవరో ఒకరు మనలను ఎదో ఒక గ్రూప్ లో మన ప్రమేయం లేకుండానే యాడ్ చేస్తారు. ఆ గ్రూప్ లో మనతో పాటు మన ఫ్రెండ్స్ మాత్రమే గాక మన ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ కి  ఫ్రెండ్స్ ఇలా ఎవరో మనకు పరిచయం లేని వ్యక్తులు కూడా ఉంటారు. క్విట్ అవుదామంటే మొహమాటం లేకపోతే ఆయా గ్రూప్ లనుండి వచ్చే పోస్ట్ ల ఉదృతి తట్టుకోవడం కష్టం. ఇదంతా నాణానికి ఒకవైపు. మరొకవైపు ఏమిటంటే మీరు కూడా ఆ గ్రూప్ లో కొన్ని పోస్ట్ లు పోస్ట్ చేస్తున్నారు అనుకోండి. మీ నెంబర్ ఆ గ్రూప్ లో డిస్ప్లే అవుతుంది. ఆ నంబర్ సహాయం తో ఆ గ్రూప్ లో ఉన్న మీకు తెలియని సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రత్యేకించి యువతులు, మహిళల విషయం లో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరిగిన దాఖలాలు ఉన్నాయి. మరి దీనికి ఏమిటి పరిష్కారం? ఆ గ్రూప్ నుండి క్విట్ అవకుండానే, మీ పోస్ట్ లను మీరు పోస్ట్ చేయాలి, కానీ ఆ పోస్ట్ దగ్గర మీ నంబర్ కనపడకూడదు. ఎలా.........

సాధారణంగా గ్రూప్ చాట్ లో ఉన్నపుడు మీ నంబర్ ను హైడ్ చేసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యం. గ్రూప్ లో మీరు ఏది పోస్ట్ చేసినా సరే దానితో పాటు మీ నంబర్ ఆటోమాటిక్ గా డిస్ప్లే  అవుతుంది. మరి మీ నెంబర్ కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.

నంబర్ హైడ్ చేయడం ఎలా ?

మొదటగా మీ ప్రస్తుత వాట్స్ అప్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి మళ్ళీ రీ-ఇన్ స్టాల్ చేయండి.

మీ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసేటపుడు మీ మొబైల్ ను ఫ్లైట్ మోడ్ లో ఉంచండి.

ఇప్పుడు “ వెరిఫై త్రూ SMS “ అనే బటన్ పై క్లిక్ చేసి మీ ఈ మెయిల్ ఐడి ని ఎంటర్ చేసి సెండ్ బటన్ పై క్లిక్ చేయాలి.

కాన్సిల్ బటన్ పై రెండు సార్లు క్లిక్ చేస్తే ఈ ప్రక్రియ పూర్తీ అవుతుంది.

http://vlivetricks.com ద్వారా స్పూఫ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.

మీ ఫోన్ లో ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.

అవుట్ బాక్స్ కి వెళ్లి స్పూఫ్ అప్లికేషను యొక్క అన్ని వివరాలను కాపీ చేసి వెరిఫికేషన్ కు పంపాలి.

మీరు మీ డీటెయిల్స్ ను వేరే స్పూఫ్ నెంబర్ తో పంపి వెరిఫై చేసుకోవాలి.

ఒక్కసారి వెరిఫై అయిన తర్వాత మీరు ఇక గ్రూప్ లో ఏ పోస్ట్ పెట్టినా సరే మీ ఒరిజినల్ నంబర్ కి బదులు స్పూఫ్ నంబర్ కనపడుతుంది.

ప్రస్తుతానికి ఈ ఫీచర్ వాట్స్ అప్ లో అందుబాటులో లేదు. అయితే స్పూఫ్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా ఎంచక్కా గ్రూప్ చాట్ లో మీ నంబర్ ను హైడ్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు