• తాజా వార్తలు

ఆన్ లైన్ జాబ్ పోస్టింగ్ లలో ఫేక్ వాటిని కనిపెట్టడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

తాజాగా విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అభ్యర్థులకూ అలాగే సంవత్సరాల తరబడీ కోచింగ్ సెంటర్ లలో మగ్గి ఇక ప్రభుత్వ ఉద్యోగం దైవాదీనం, ముందు ఏదో ఒక ప్రైవేటు జాబ్ లో సెటిల్ అవుదాం అనుకునే అభ్యర్థులకూ గమ్య స్థానం ఆన్ లైన్ జాబ్ పోర్టల్స్. ప్రత్యేకించి టెక్నికల్ అర్హతలు ఉన్న అభ్యర్థులకు అయితే ఇవి తప్ప ఇంకో మార్గం లేదన్నట్లుగా నేడు పరిస్థితి తయారయింది. ఉద్యోగార్థులలో ఉన్న ఈ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ అనేక ఫేక్ జాబ్ పోర్టల్ లు మోసాలకు పాల్పడుతున్నాయి. ఆన్ లైన్ లో జాబ్ ల కోసం వెదికే అభ్యర్థులను మోసం చేసి వారివద్దనుండి వ్యక్తిగత,ఆర్థిక సమాచారాన్ని తస్కరించి డబ్బు కొట్టేసిన సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సంఘటనే ఒకటి అమెరికా లో జరిగింది. ఇలాగే ఒక ఫేక్ జాబ్ ఆఫర్ వెబ్ సైట్ లో కనిపించింది. ఈ నకిలీ రిక్రూటర్ లు ఇంటర్ వ్యూ ను యాహూ మెసెంజర్ లో నిర్వహించారు. ఒకవేళ అతనికి ఉద్యోగం కల్పిస్తే కొన్ని కంప్యూటర్ అప్లికేషను ల సిరీస్ ను పంపవలసి ఉంటుందనీ దానికోసం కొంత అమౌంట్ చెల్లించాలి అనీ అందుకు తన బ్యాంకు అకౌంట్ వివరాలు ఇవ్వవలసినదిగా అడిగారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఊహించవచ్చు. కాబట్టి ఆన్ లైన్ లో జాబ్ ఆఫర్ లు ఉన్నపుడు ఏవి అసలైనవో ఏవి నకిలీవో గుర్తించడం చాలా ముఖ్యం. వాటిని గుర్తించడం ఎలా? మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? తదితర వివరాలు ఈ ఆర్టికల్ లో చదువుకుందాం.

వీటిని గుర్తించడం ఎలా ?

ఈ జాబ్ ఆఫర్ లు చూసేటపుడు ఏ విధమైన పేమెంట్ లు చేయకూడదు. మీకు ఉద్యోగం ఇవ్వడానికీ ఏ కంపెనీ కూడా డబ్బు అడుగదు. ఒకవేళ అడిగితే అది ఖచ్చితంగా నకిలీదే! కాబట్టి అలాంటి ఆఫర్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

మీ బ్యాంకు వివరాలను పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వవద్దు. మీకు జాబ్ గ్యారంటీ శాలరీ కోసం అని అడిగినా సరే కేవలం ఆన్ లైన్ ద్వారా చూసినంత మాత్రాన మీ బ్యాంకు వివరాలు ఇవ్వకూడదు.ఏ కంపెనీ కూడా బ్యాంకు వివరాలను ఆన్ లైన్ లో అడుగదు. మీ ఆర్థిక లావాదేవీలు వారికి అవసరం లేదు.

నమ్మదగిన జాబ్ పోర్టల్ లను మాత్రమే ఉపయోగించండి. ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే సదరు కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోండి. అసలు సందేహాస్పదంగా ఉన్న వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే ఇంకా మంచిది.

 లింక్డ్ ఇన్ ద్వారా ఎవరినీ ఫ్రెండ్స్ గా యాక్సెప్ట్ చేయవద్దు. ఎందుకంటే లింక్డ్ ఇన్ లో ఫాల్స్ ప్రొఫైల్ ల సంఖ్య పెరిగి పోతుంది. కాబట్టి వీటిపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి.

సదరు జాబ్ ఆఫర్ యొక్క వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి. రిక్రూటర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ను పరిశీలించడం చాలా ముఖ్యం.కార్పొరేట్ మెయిల్ సర్వీస్ కాకుండా ఫ్రీ మెయిల్ సర్వీస్ ను ఇచ్చినా లేదా ల్యాండ్ లైన్ నెంబర్ కు బదులు కేవలం మొబైల్ నెంబర్ ను మాత్రమే ఇచ్చినా దానిని అనుమానించి దూరంగా ఉండాలి.

జన రంజకమైన వార్తలు