• తాజా వార్తలు

మీ ఆధార్ బయో మెట్రిక్ ని లాక్ కానీ అన్ లాక్ కానీ చేయడం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మన దేశం లో ప్రతీ చిన్న విషయానికీ  ఆధార్ నెంబర్ అనేది తప్పనిసరి అయింది. తప్పనిసరి అనేకంటే మన జీవితం లో ఒక భాగం అయింది అంటే బాగుంటుందేమో! బ్యాంకు ఎకౌంటు ల నుండీ పాన్ కార్డు ల వరకూ, ఇన్సూరెన్స్ పాలసీ ల దగ్గరనుండీ మొబైల్ నెంబర్ ల వరకూ, స్థిర చరాస్తుల కొనుగోల్ల లోనూ ఇలా ఇంకా అనేక విషయాలలో ఆధార్ కార్డు తప్పనిసరి అయింది.మరి ఇంతలా మన జీవితాలలో పెనవేసుకోపోయిన ఆధార్ కార్డు ను సెక్యూర్ గా ఉంచుకోవలసిన బాద్యత మనపై ఉందా? లేదా? మన ఆధార్ కార్డు ను సెక్యూర్ గా ఉంచుకోవడం అంటే మన బయో మెట్రిక్ లను లాక్ చేయడమే. మొట్టమొదటిగా మనం ఆధార్ కార్డు తీసుకునేటపుడు మన రెండు చేతుల వేలిముద్రలు అలాగే కంటి యందలి ఐరిష్ లను స్కాన్ చేస్తారు. వీటినే బయో మెట్రిక్ లంటారు. ఈ సంగతి మనకు తెలిసినదే. అయితే ఈ బయో మెట్రిక్ లను కూడా లాక్ చేసుకునే వెసులుబాటును UIDAI కల్పించింది. మీ ఆధార్ వివరాలు దుర్వినియోగం  అవకుండా మీ బయో మెట్రిక్ లను మీరే లాక్ చేసుకోవచ్చు మరియు అన్ లాక్ కూడా చేసుకోవచ్చు. ఈ వివరాలతో కూడిన ఆర్టికల్ ను ఇంతకూ ముందే మన వెబ్ సైట్ లో ప్రచురించడం జరిగింది. తాజా మార్పులు, అప్ డేట్ ల తో మరొక్క సారి మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకుల కోసం దీనిని అందిస్తున్నాం.

గమనిక : ఆధార్ లోని బయో మెట్రిక్ లను లాక్/అన్ లాక్ చేయాలి అంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మీ ఆధార్ తో లింక్ అవ్వకపోతే మీకు దగ్గరలోని ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కు వెళ్లి వెంటనే రిజిస్టర్ చేయించుకోండి.

  1. 'https://resident.uidai.gov.in/biometric-lock' ను మీ బ్రౌజరు లో పేస్టు చేయండి.
  2. ఆ పేజి ఓపెన్ అయిన తర్వాత మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ను అక్కడ ఎంటర్ చేయండి. అక్కడ దిగువన ఉన్న బాక్స్ లో 4 అంకెల సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. దానిని కూడా ఎంటర్ చేయండి.
  3. Send OTP అని ఉన్న లింక్  పై క్లిక్ చేయండి.
  4. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది. OTP sent to your registered mobile number. Check your mobile  అని అక్కడ ఉన్న సెక్యూరిటీ బాక్స్ క్రింద పచ్చ రంగులో ఒక మెసేజ్ కనిపిస్తుంది.
  5. ఒకవేళ ఆ మెసేజ్ రాకపోతే అక్కడ ఉన్న 4 అంకెల సెక్యూరిటీ కోడ్ ను మళ్ళీ ఎంటర్ చేసి మెసేజ్ కోసం వేచి చూడండి.
  6. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని అక్కడ ఎంటర్ చేయండి.
  7. అక్కడ ఉన్న లాగ్ ఇన్ లింక్ పై క్లిక్ చేస్తే  ఎనేబుల్ బయో మెట్రిక్ లాకింగ్ అనే పేజి కు వస్తుంది.
  8. దానిపై క్లిక్ చేస్తే “ కంగ్రాచ్యులేషన్స్ , యువర్ బయోమెట్రిక్ డేటా ఈజ్ లాక్డ్” అనే మెసేజ్ వస్తుంది.
  9. అంటే ఇకపై మీ వేలి ముద్రలు గానీ ఐరిస్ గానీ ఆధార్ లో పనిచేయవు అన్నమాట. మళ్ళీ ఇదే ప్రాసెస్ లో మీ ఆధార్ యొక్క బయో మెట్రిక్ లను అన్ లాక్ కూడా చేసుకోవచ్చు.
  10. అన్ లాకింగ్ ప్రాసెస్ కూడా ఇదే ఉంటుంది. కాకపోతే ఎనేబుల్ అనే చోట డిజేబుల్ అని కనిపిస్తుంది. అంతే తేడా!

జన రంజకమైన వార్తలు