• తాజా వార్తలు

గూగుల్ బారినుండి మీ ప్రైవసీ ని కాపాడుకోండి ఇలా!

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మనకు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లో వెదుకుతాం కదా! ఇలా మనం గూగుల్ లో సెర్చ్ చేసేటపుడు గూగుల్ మన కార్యకలాపాలను పసిగడుతుందని మీకు తెలుసా? అవును ఇది వాస్తవం. మీ గురించి మీ తలిదండ్రులకు కూడా తెలియని అనేక విషయాలు గూగుల్ కు తెలుసనే సంగతి మీకు తెలుసా ?  మీ వ్యక్తిగత సమాచారం, మీరు తాజాగా విజిట్ చేసిన ప్రదేశాలు,మీ ఇష్టాయిష్టాలు ఇలా మీకు సంబందించిన అనేక విషయాల గురించి గూగుల్ దగ్గర పెద్ద డేటా నే ఉంది. ఆశ్చర్యపోకండి. అసలు గూగుల్ కు మన గురించిన ఏమేమి విషయాలు తెలుసు? వాటిని చెక్ చేసుకోవడం ఎలా? గూగుల్ కు అవి తెలియకుండా జాగ్రత్త ఎలా? తద్వారా గూగుల్ బారినుండి మన ప్రైవసీ ని కాపాడుకోవడం ఎలా? తదితర విషయాలను గురించి ఈ ఆర్టికల్ లో చదువుకుందాం.

  1. మన యాక్టివిటీ లు

మనం తరచుగా గూగుల్ లో చేసే సెర్చ్ లను ఇది విశ్లేషణ చేస్తుంది. అంటే మనం గూగుల్ నుండి తీసుకునే సమాచారాన్ని మాత్రమే గాక మిగతా కంపెనీ యాప్ ల ద్వారా మనం అందించే సమాచారాన్ని కూడా సంగ్రహించి విశ్లేషిస్తుంది.

చెక్ చేయడం ఎలా ?

మీరు మీ గూగుల్ ఎకౌంటు కు సైన్ ఇన్ అయ్యారో లేదో చెక్ చేసుకోండి. అక్కడ మీ ఎకౌంటు లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవసీ సెక్షన్ లో ఉండే మై యాక్టివిటీ పై క్లిక్ చేయండి. మీరు సెర్చ్ చేసిన కంటెంట్ రోజులు, వారాలు, నెలల వారీగా అక్కడ కనిపిస్తుంది.

డిజేబుల్ చేయడం ఎలా ?       

ఎడమవైపు సైడ్ బార్ లో ఉండే మై ఎకౌంటు యాక్టివిటీ కంట్రోల్ ల లోనికి వెళ్ళండి. వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ పై క్లిక్ చేయండి. కుడి వైపు ఉండే బ్లూ ట్యాబ్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని ఆఫ్ చేయండి. మీ ప్రీవియస్ సెర్చ్ హిస్టరీ ని డిలీట్ చేయాలి అనుకుంటే మై యాక్టివిటీ సెక్షన్ లోనికి మళ్ళీ వెళ్లి అక్కడ ఉండే డిలీట్ యాక్టివిటీ బై అనే ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు అవసరం లేదు అనుకున్న హిస్టరీ ని డిలీట్ చేయవచ్చు.

  1. మీ లొకేషన్

మీరు ఏ సమయం లో ఎక్కడున్నారో గూగుల్ కు ఇట్టే తెలిసిపోతుంది. మీరు మీ గూగుల్ ఎకౌంటు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మాత్రమే గాక మీ సెర్చ్ ను బట్టి కూడా గూగుల్ మీ లొకేషన్ ను చెప్పేస్తుంది.

చెక్ చేయడం ఎలా ?

ఎడమవైపు బార్ లో ఉండే మై ఎకౌంటు యాక్టివిటీ కంట్రోల్స్ సెక్షన్ కు మరొక్కసారి వెళ్ళండి.అక్కడ లొకేషన్ హిస్టరీ అనే ఒక సెక్షన్ ఉంటుంది. అందులో ఉండే మేనేజ్ యాక్టివిటీ పై క్లిక్ చేస్తే మీరు విజిట్ చేసిన ప్రదేశాల గురించిన సమాచారం అక్కడ కనపడుతుంది.

డిజేబుల్ చేయడం ఎలా?

యాక్టివిటీ కంట్రోల్ ల సెక్షన్ లో లొకేషన్ హిస్టరీ పక్కన ఉండే బ్లూ ట్యాబ్ ను ఆఫ్ చేస్తే దీనిని డిజేబుల్ చేసినట్లే. మీ లొకేషన్ హిస్టరీ ని డిలీట్ చేయాలి అంటే కుడి వైపు క్రింద భాగం లో ఉండే ట్రాష్ సింబల్ పై క్లిక్ చేయడమే.

  1. మీ యూ ట్యూబ్ యాక్టివిటీ లు

మీరు యూ ట్యూబ్ లో ఎలాంటి కాంటెంట్ కోసం వెదుకుతున్నారు? ఎలాంటి వీడియో లను చూస్తున్నారు? తదితర వివరాలన్నీ గూగుల్ కు తెలిసిపోతాయి.

చెక్ చేసుకోవడం ఎలా?

ఇంతకుముందు లాగే యాక్టివిటీ కంట్రోల్స్ సెక్షన్ లోనికి వెళ్లి యూ ట్యూబ్ సెర్చ్ హిస్టరీ మరియు యూ ట్యూబ్ ప్లే హిస్టరీ పై క్లిక్ చేస్తే మీ యూ ట్యూబ్ యాక్టివిటీ లకు సంబందించిన సమస్త సమాచారం అక్కడ కనిపిస్తుంది.

డిజేబుల్ చేయడం ఎలా?

ప్రతీ సెక్షన్ లో వాటి ప్రక్కన ఉండే బ్లూ ట్యాబ్ ను టర్న్ ఆఫ్ చేస్తే ఇది డిజేబుల్ అవుతుంది.

  1. డివైస్ లలోని సమాచారం

మీ డివైస్ లో ఉన్న కాంటాక్ట్ లు, క్యాలెండర్ లు, యాప్ లు, మ్యూజిక్ ఇంకా మీ బ్యాటరీ వినియోగం తదితర అంశాలకు సంబందించిన సమాచారం అంతటినీ గూగుల్ సేకరిస్తుంది.

చెక్ చేయడం ఎలా ?

యాక్టివిటీ కంట్రోల్స్ లోనికి వెళ్లి ఇన్ఫర్మేషన్ ఫ్రం అదర్ డివైసెస్ అనే సెక్షన్ పై క్లిక్ చేస్తే ఆ సమాచారం మీకు కనిపిస్తుంది.

డిజేబుల్ చేయడం ఎలా?

ఇంతకుముందు చేసిన విధంగానే ఆ సెక్షన్ దగ్గర ఉన్న బ్లూ ట్యాప్ ను టర్న్ ఆఫ్ చేస్తే ఇది డిజేబుల్ అవుతుంది.

మీ ఆసక్తులు

మీరు తరచుగా చేసే సెర్చ్ లను బట్టి మీరు ఏ ఏ విషయాలపై ఆసక్తిని కలిగి ఉన్నారో అనే విషయాన్ని అంచనా వేస్తుంది. తద్వారా మీరు ఆడా?మగా? మీ వయసు తదితర విషయాలను కూడా అంచనా వేస్తుంది.

చెక్ చేయడం ఎలా?

యాక్టివిటీ కంట్రోల్స్ లో రిలేటెడ్ సెట్టింగ్స్ అనే సెక్షన్ ఉండే యాడ్స్ అనే ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు ఈ వివరాలు తెలుస్తాయి.

డిజేబుల్ చేయడం ఎలా?

యాడ్ కస్టమైజేషన్ దగ్గర ఉండే బ్లూ ట్యాబ్ ను టర్న్ ఆఫ్ చేయడం ద్వారా దీనిని డిజేబుల్ చేయవచ్చు.

  

జన రంజకమైన వార్తలు