• తాజా వార్తలు
  •  

వాట్స్ అప్ లో ఫోన్ కెమెరా తో డబ్బు పంపడం ఎలా ?

సోషల్ మీడియా దిగ్గజం అయిన వాట్స్ అప్ సరికొత్త పేమెంట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అదే QR కోడ్ ఆప్షన్. వాట్స్ అప్ లో కెమెరా ను ఉపయోగించి QR కోడ్ లను స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ లు చేసే సరికొత్త  ఫీచర్ అందుబాటులోనికి వచ్చింది. ఈ ఫీచర్ ఐఒఎస్ మరియు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఇది బీటా యూజర్ లకు మాత్రమే అందుబాటులో ఉన్నది. దీనిని ఉపయోగించడం ఎలాగో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఇప్పటివరకూ ఉన్నవాట్స్ అప్ పేమెంట్ ఫీచర్

స్టెప్ 1 : ముందుగా మీ వాట్స్ అప్ ఎకౌంటు కు లాగ్ ఇన్ అవ్వండి

స్టెప్ 2 : కుడి వైపు పైభాగాన ఉండే మూడు చుక్కల పై ( డాట్స్ ) క్లిక్ చేయండి.

స్టెప్ 3 : పేమెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4 : అక్కడ ఉండే ట్యాబ్ లను ఫిల్ చేయడం ద్వారా మీ వాట్స్ అప్ ఎకౌంటు కు లింక్ అయి ఉన్న మీ బ్యాంకు ఎకౌంటు నుండి మీరు ఎవరికైతే డబ్బు పంపాలి అనుకుంటున్నారో వారికి సెండ్ ఆప్షన్ ను ఉపయోగించి డబ్బు పంపవచ్చు.

ఇది ఇప్పటివరకూ వాట్స్ అప్ లో ఉన్న మనీ సెండింగ్ ఫీచర్. ఇప్పుడు తాజా అప్ డేట్ ఎలా ఉందో చూద్దాం.

QR కోడ్ ద్వారా వాట్స్ అప్ లో డబ్బు పంపడం

స్టెప్ 1 : మీ వాట్స్ అప్ ఎకౌంటు కు లాగ్ ఇన్ అవ్వండి.

స్టెప్ 2 : వాట్స్ అప్ సెట్టింగ్స్ లోనికి వెళ్ళండి

స్టెప్ 3 : పేమెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 4 : న్యూ పేమెంట్స్ పై క్లిక్ చేసి స్కాన్ QR కోడ్ ను సెలెక్ట్ చేసుకోండి.

స్టెప్ 5 : మీరు డబ్బు పంపాలి అనుకున్నవారి QR కోడ్ వైపు ఫోన్ కెమెరా ను ఉంచి దానిని స్కాన్  చేయాలి. అంతే పేమెంట్ ఆటోమాటిక్ గా అయిపోతుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి అవడానికి UPI పిన్ అవసరం అవుతుంది.

గమనిక : ఈ వాట్స్ అప్ QR కోడ్ ఆప్షన్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే లో వెర్షన్ 2.18.93 గా ఇది చూపిస్తుంది. అయితే వాట్స్ అప్ తన 1.5 బిలియన్ల ఆక్టివ్ యూజర్ ల కోసం అప్డేట్  లను కూడా లాంచ్ చేస్తుంది. ఈ అప్ డేట్ లు గూగుల్ ప్లే బీటా ప్రోగ్రాం కోసం లాంచ్ చేయబడ్డాయి. కొన్ని కొన్ని రిపోర్ట్ ల ప్రకారం తదుపరి సవరణల కోసం ఇది ప్రస్తుతం డిజేబుల్ చేయబడి ఉంది. అయితే అతి త్వరలోనే దీనియొక్క స్టేబుల్ వెర్షన్ అందుబాటులోనికి వచ్చింది. అంటే ఇకపై ఎంచక్కా వాట్స్ అప్ కెమెరా ద్వారానే పేమెంట్ లు చేసుకోవచ్చు అన్నమాట.

జన రంజకమైన వార్తలు