• తాజా వార్తలు
  •  

మీ ఆధార్ నంబర్ తెలిసిన వారెవరైనా మీ ఎకౌంటు ఏ బ్యాంకు లో ఉందో తెలుసుకోవచ్చు ఇలా !

ఆధార్ ను జారీ చేసే అథారిటీ అయిన UIDAI తన యొక్క మ్యాపర్ వెబ్ సైట్ ద్వారా ప్రజలు తమ ఆదార్ నెంబర్ బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందా లేదా? అయితే ఏ బ్యాంకు కు లింక్ అయింది తదితర విషయాలను తెలుసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది. యూజర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP ని పంపుతారు. ఆ OTP ని ఎంటర్ చేస్తే మీ ఆదార్ లింకింగ్ యొక్క వివరాలు తెలుస్తాయి. అయితే అదృష్టమో, దురదృష్టమో గానీ ఈ OTP ద్వారా కాకుండా ఆదార్ లింకింగ్ వివరాలు తెలుసుకునే మరొక మార్గం కూడా ఉంది. అంటే మీ ఆదార్ నెంబర్ తెలిసిన వారు ఎవరైనా సరే ఎటువంటి అథెంటికేషన్ లేకుండానే మీ బ్యాంకు ఎకౌంటు కు ఆదార్ లింక్ అయిందా లేదా తెలుసుకోవచ్చు అన్నమాట.

SMS  ద్వారా ఈ వివరాలు తెలుసుకునే సౌలభ్యం గురించి UIDAI ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం.

మీ ఫోన్ నుండి *99*99*1# కు డయల్ చేయాలి.ఈ మెసేజ్ కు గానూ మీకు 50 పైసలు ఛార్జ్ చేయబడుతుంది.

మీ 12 అంకెల ఆదార్ నంబర్ ఎంటర్ చేయవలసిందిగా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.

మీరు ఆదార్ నెంబర్ ను ఎంటర్ చేయగానే కన్ఫాం చేయమని అడుగుతుంది.

మీరు మీ ఆదార్ నంబర్ ను కన్ఫాం చేయగానే ఆ ఆదార్ నెంబర్ లింక్ అయి ఉన్న బ్యాంకు యొక్క పేరు ను చూపిస్తుంది.

ఈ SMS ఆధారిత సేవకు ఏ విధమైన OTP అవసరం లేదు. అంటే కస్టమర్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో పని లేదన్నమాట.

అంతేగాక ఎవరైనా మీ ఆదార్ నంబర్ ద్వారా మీ బ్యాంకు లింకింగ్ వివరాలు చూస్తున్నపుడు కనీసం మీకు నోటిఫికేషన్ లను కూడా పంపించదు.

ఉదాహరణకు మీ కొలీగ్ యొక్క ఆదార్ నెంబర్ ఏ బ్యాంకు తో లింక్ అయి ఉందో మీరు తెలుసుకున్నారని అనుకోండి. ఆ విషయం అతనికి తెలిసే అవకాశం లేదు.

అయితే ఇది అన్ని బ్యాంకు లకూ పనిచేయదు.

మీ ఆదార్ నంబర్ ఎక్కువ బ్యాంకు లకు కనెక్ట్ అయి ఉంటే అన్ని బ్యాంకు లనూ చూపించదు. కేవలం ఒక్క బ్యాంకు ను మాత్రమే చూపిస్తుంది.

జన రంజకమైన వార్తలు