• తాజా వార్తలు

ఫోన్ పోయినా, దొంగిలించ‌బ‌డినా వాట్సాప్‌ను రీ స్టోర్ చేసుకోవ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీ ఫోన్ పోయినా, ఎవ‌రైనా దొంగిలించినా దానికాస్ట్ కంటే అందులో ఉండే మ‌న కాంటాక్ట్స్,  డేటా, డిజిట‌ల్ వాలెట్స్‌, బ్యాంకింగ్ అకౌంట్స్ గురించే ఎక్కువ‌గా ఆందోళ‌న ప‌డ‌తాం.  ఆఫోన్‌కొట్టేసిన వాళ్లు మ‌న వాట్సాప్‌, ఫేస్‌బుక్ అకౌంట్ల నుంచి  ఎవ‌రికైనా త‌ప్పుడు మెసేజ్‌లు పంపించే ప్ర‌మాదం కూడా ఉంది. దానికితోడు వాట్సాప్ పేమెంట్స్ ఆప్ష‌న్ కూడా రావ‌డంతో పేమెంట్స్ ప‌రంగానూ సెక్యూరిటీ ప్రాబ్ల‌మే. అందుకే  మీ ఫోన్ పోయినా వాట్సాప్ అకౌంట్‌ను సెక్యూర్ చేయ‌డానికి ఇదీ ప‌ద్థ‌తి.
ఎలా చేయాలంటే..
1. మీ నెట్‌వ‌ర్క్ ప్రొవైడ‌ర్‌కు ఫోన్ చేసి మొబైల్ సిమ్‌ను లాక్‌ చేయండి. అప్పుడు మీ ఫోన్ నుంచి ఎలాంటి మెసేజ్‌లు చేయ‌లేరు. ఎందుకంటే మీ వాట్సాప్ అకౌంట్‌, ఫేస్‌బుక్ అకౌంట్ ఇలా దేన్ని వాడాల‌న్నా మీ మొబైల్ నెంబ‌ర్‌కే ఓటీపీతో కన్ఫ‌ర్మ్ చేయాల్సి ఉంటుంది.
2. మీ సిమ్ లాక్ అయ్యాక మీ వాట్సాప్ అకౌంట్‌ను వేరే ఫోన్‌లో యాక్టివేట్ చేయొచ్చు. కానీ వాట్సాప్‌ను ఒక నెంబ‌ర్‌తో ఒక ఫోన్‌లో మాత్ర‌మే యాక్సెస్ చేయ‌గ‌ల‌మ‌ని గుర్తు పెట్టుకోండి.
3. లేదంటే వాట్సాప్ టీమ్‌కు మెయిల్ చేయొచ్చు. ఈ మెయిల్ బాడీలో "Lost/stolen: Deactivate my account అని మెన్ష‌న్ చేసిమీ మొబైల్ నెంబ‌ర్‌, కంట్రీ కోడ్ ఇస్తేమీ అకౌంట్‌ను కొత్త ఫోన్‌లో యాక్టివేట్ చేస్తారు.
4.అంతేకాదు మీరు పోగొట్టుకున్న ఫోన్‌లో ఉన్న సిమ్ లాక్ అయినా వైఫై క‌నెక్ష‌న్‌తో వాట్సాప్ అకౌంట్‌ను న‌డిపించ‌వ‌చ్చు.కాబ‌ట్టి వాట్సాప్ టీమ్‌కు రిపోర్ట్ చేసి మీ వాట్సాప్ అకౌంట్ డీయాక్టివేట్ చేయించాలి.
5. ఇలా డీయాక్టివేట్ అయిన అకౌంట్‌ను మీ నెంబ‌ర్‌తో కొత్త సిమ్ తీసుకుని దాన్ని వేరే హ్యాండ్‌సెట్‌లో వేసుకుని రీయాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే నెల రోజుల్లోపు రీ యాక్టివేట్‌చేసుకోవాలి. ఆ నెల రోజులు మీకు ఏమైనా మెసేజ్‌లు వ‌చ్చినా పెండింగ్ లో ఉంటాయి.  నెల రోజుల త‌ర్వాత యాక్టివేష‌న్ విండో క్లోజ్ అయిపోతుంది. ఆలోపు చేయించుకోక‌పోతే మీ అకౌంట్ ప‌ర్మినెంట్‌గా తొల‌గించ‌బ‌డుతుంది.
6.మీ ఫోన్ పోక‌ముందు మీరు గూగుల్ డ్రైవ్, వ‌న్‌డ్రైవ్ లాంటి క్లౌడ్ స‌ర్వీస్‌లో క‌నుక మీ చాట్ బ్యాక‌ప్ స్టోర్‌చేసుకుని ఉంటే దాన్ని రీ స్టోర్‌చేసుకోవ‌చ్చు.
 

జన రంజకమైన వార్తలు