• తాజా వార్తలు

కంప్యూట‌ర్లో లాస్ట్ మెమ‌రీ స్పేస్‌ను రిక‌వ‌ర్ చేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

కంప్యూట‌ర్‌లో కానీ స్మార్ట్‌ఫోన్‌లో గానీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ చాలా కీల‌కం. మీరు ఏం స్టోర్ చేసుకోవాల‌న్నా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే  పీసీ లేదా స్మార్ట్‌ఫోన్ల‌లో కొన్ని సెక్ష‌న్ల‌లో ఉన్న మెమ‌రీని సిస్టం గుర్తించ‌య‌లేదు. ఇది  లాస్ట్ స్పేస్‌గా ఉండిపోతుంది.  స్పేస్ అంతా నిండిపోయింద‌ని చాలా మంది దాన్ని ప‌ట్టించుకోరు. కానీ ఈ lost spaceను కూడా యూజ్ చేసుకోవ‌డానికి కొన్ని మెథ‌డ్స్ ఉన్నాయి.  
ఈ రెండూ మెయిన్‌
 lost spaceను యూజ్ చేసుకోవాలంటే మెయిన్‌గా రెండు మెథ‌డ్స్ ఉన్నాయి.  మీ సిస్టం హార్డ్ డిస్క్‌లో ఉన్న జంక్ ఫైల్స్‌ను క్లియ‌ర్ చేయ‌డం,  హార్డ్ డిస్క్‌లో ఉన్న మెమ‌రీని ప్రాప‌ర్ సెక్టార్స్‌గా రీ ఎస్సైన్ చేయ‌డం.  
1) జంక్ పైల్స్ క్లియ‌రెన్స్ 
జంక్ ఫైల్స్ అంటే ఇన్‌స్టాలేష‌న్ ఫైల్స్‌, విండోస్ అప్‌డేట్ ఫైల్స్‌, బ్రౌజ‌ర్లు, సిస్టం ప్రాసెస్‌ల‌లో ఉన్న  క్యాచీ మెమ‌రీ. ఈ జంక్ ఫైల్స్‌ను క్లియ‌ర్ చేస్తే స్పేస్ ఫ్రీ అవ‌డ‌మే కాదు. మీ సిస్టం స్పీడ్ కూడా పెరుగుతుంది. జంక్ ఫైల్స్ క్లియ‌ర్ చేయ‌డం ఇలా..
* క‌ర్స‌ర్‌ను కోర్టానా సెర్చ్‌బార్‌లోకి తీసుకెళ్లి   Disk Cleanup అని టైప్ చేయండి. ఇప్పుడు విండో ఓపెన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ క్యాచీ క్లీనింగ్ యాప్‌కు స‌మానం. దీని ద్వారా మీరు సిస్టంలో స్టోర‌యి ఉన్న టెంప‌ర‌రీ ఫైల్స్‌ను డిలెట్ చేయొచ్చు.  
*  డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్లి   మీరు జంక్ క్లియ‌ర్ చేయాల‌నుకున్న డ్రైవ్‌ను సెలెక్ట్ చేయండి. ప్రైమ‌రీ హార్డ్‌డిస్క్ పార్టిష‌న్‌తో ఈ క్లీనింగ్ స్టార్ట్ చేస్తే మంచిది.  Clean up system files ను క్లిక్ చేస్తే క్లీనింగ్ స్టార్ట‌వుతుంది.  
*  డ్రైవ్‌ను సెలెక్ట్ చేయ‌గానే అందులో ఉన్న ఏ ఫోల్డ‌ర్ ఎంత మెమ‌రీ తీసుకుంది? ఎంత స్పేస్‌ను క్లియ‌ర్ చేయ‌గ‌ల‌మో చూపిస్తుంది. 
* కావాల‌సిన ఫోల్డ‌ర్ల‌న్నీ సెలెక్ట్ చేసి  Ok బ‌ట‌న్ నొక్కితే మీ టెంప‌ర‌రీ ఫైల్స్ అన్నీపీసీ నుంచి డిలీట్ అవుతాయి.   
* ఇదే ప‌ద్ధ‌తిలో మిగిలిన పార్టిష‌న్స్‌లో కూడాజంక్ క్లియ‌ర్ చేయండి. 
2) డీ ఫ్రాగ్మెంటేష‌న్
డీ ఫ్రాగ్మెంటేష‌న్ అంటే హార్డ్ డిస్క్‌లో ఉన్న మెమ‌రీని ప్రాప‌ర్ సెక్టార్స్‌గా రీ ఎస్సైన్ చేయ‌డం.  ఇది ప‌నికిరాని ఫైల్స్‌ను డిలీట్ చేయ‌దు. కానీ మీ సిస్టంలో ఉన్న ఫైల్స్‌ను పుస్త‌కాల షెల్ఫ్‌లో పుస్త‌కాలను స‌ర్దిన‌ట్లు  రీ ఎరేంజ్ చేస్తుంది. దీంతో స్పేస్ మిగులుతుంది.  ఈ ప్రాసెస్‌లో ఎక్కువ స్పేస్ సేవ్ అవుతుంది కానీ టైం చాలా తీసుకుంటుంది.  

 

జన రంజకమైన వార్తలు