• తాజా వార్తలు

ట్రిపుల్ ఐ,టి. నుండి ఐ.ఐ.టి. గౌహతి కి నా జర్నీ

మేము ట్రిపుల్ ఐటి నూజివీడు లో చదివేటపుడు,ఫైనల్ ఇయర్ లో ఉన్నపుడు గేట్  పరీక్ష గురించి వినడం జరిగింది.మేము కోచింగ్ తీసుకుని గేట్ ఎంట్రన్స్ పరీక్ష రాశాము.ఎందుకంటే చాలా వరకూ ప్రభుత్వ రంగ సంస్థలు  గేట్ స్కోర్ ను ఆధారంగా చేసుకుని ఉద్యోగాలను ఆఫర్ చేస్తాయి.కాబట్టి కష్టపడి రాశాము.అయితే నాకు ఆ పరీక్షలో ఒక మోస్తరు ర్యాంకు వచ్చింది.కానీ  ఆ ర్యాంకు నన్ను తీసుకు వెళ్లి ఐఐటి గౌహతిలో కూర్చోబెట్టింది.ఎం.టెక్ చేయడానికి గౌహతి లో నాకు అడ్మిషన్ దొరికింది.నా జేవితంలో ఇది మరొక పెద్ద మలుపు.

కొత్త ప్రదేశం, మన భాష కాదు అనే బెరుకు ఎక్కడో కొంచెం ఉన్న సరే అక్కడి పరిస్తితులకు నేను వెంటనే అలవాటు పడిపోయాను. నేను ఇంతకూ ముందు చదివిన విద్యా సంస్థలతో పోలిస్తే ఇది పెద్ద ప్లాట్ ఫాం. ఇక్కడ ఉన్న వారంతా గేట్ లో నాకంటే మంచి ర్యాంకు సంపాదించిన వారు కావడంతో పోటీ అనేది ఎప్పుడూ తీవ్ర స్థాయిలో ఉండేది.

ఇది నాకు అక్కడ కొత్త సవాళ్ళను ఇచ్చింది.అంత మంది టాప్ ర్యాంకర్ ల మధ్య నిలవాలంటే కష్టపడి చదవడం ఒక్కటే మార్గం కాబట్టి మరింత శ్రద్దతో చదివాను.ఫలితంగా గేట్ లో ఉన్న టాప్ ర్యాంకర్ లను అందరినీ వెనక్కు నెట్టి మూడవ స్థానంలో నిలవగలిగాను.అది నాకు చాలా ఆనందం కలిగించింది.మొత్తం మీద ఇప్పటి వరకూ అక్కడ నేను 86. 4 శాతం మార్కులను సంపాదించాను. మా పిజి రెండవ సంవత్సరం లో ఉన్నపుడే క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగాయి. వాటి కోసం కష్టపడి ప్రయత్నించాను.తొలి ప్రయత్నం లోనే ఈటన్ అనే కంపెనీ లో పది లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉన్నత ఉద్యోగాన్ని సంపాదించాను.కానీ ఇంటెల్ కానీ ARM లో కానీ ఉద్యోగం సంపాదించాలని లక్ష్యం గా పెట్టుకున్నాను. తప్పకుండా సాధిస్తాననే నమ్మకం ఉన్నది.

నా ఈ మొత్తం విద్యా జీవితం లో నా వెన్నంటి నిలిచిన వారు నా తలిదండ్రులు.వారు లేక పోతే నేను లేను.వారి ఋణం తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని నేను అనుకుంటున్నాను.ఈ భూమి మీద ఉన్న గొప్పవారు ఎవరంటే వారు తలిదండ్రు లేనని నా అభిప్రాయం.

చివరిగా కంప్యూటర్ విజ్ఞానం గురించి చెప్పుకోవాలి.తెలుగులో టెక్నాలజీ కి సంబందించిన వార్తలను ఎప్పటికప్పుడు అప్ డేట్ గా అందిస్తున్న కంప్యూటర్ విజ్ఞానం వెబ్ సైట్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు.నాకు తెలిసి తెలుగులో ఇది ఈ తరహాలో మొట్టమొదటి ప్రయోగం. ఇన్ని రకాల అంశాలకు సంబందించిన అంశాలకు సంబందించిన సమాచారాన్ని ఇస్తున్నందుకు కంప్యూటర్ విజ్ఞానాన్ని ప్రత్యేకంగా అభినందించాలి.నా అనుభవాలను పాఠకులతో పంచుకోవడానికి అవకాశం కల్పించిన కంప్యూటర్ విజ్ఞానం సంపాదకులకు నా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుకుంటూ..................

నామతోటి శివ C,V,R. IIT,గౌహతి.

 

జన రంజకమైన వార్తలు