• తాజా వార్తలు
  •  

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్‌8+, ట్యాబ్ ఎస్‌3లతో జియో డ‌బుల్ డేటా ఆఫ‌ర్ పొందడం ఎలా?

ఫ్రీ ఆఫ‌ర్ల‌తో ఇండియ‌న్ టెలికం సెక్టార్‌ను షేక్ చేసిన జియో కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో యూజ‌ర్ల‌ను ఆక‌ట్ట‌కుంటూనే ఉంది. జియో ధ‌నాధ‌న్ ఆఫ‌ర్ ఇప్ప‌టికీ మార్కెట్‌లో ఉన్న బెస్ట్‌ప్లానేన‌ని చెప్పాలి. జియో తాజాగా మ‌రో ఆఫ‌ర్ ఇచ్చింది. శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్‌8, ఎస్ 8+, ట్యాబ్ ఎస్‌3 కొంటే దానిపై డ‌బుల్ డేటా ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.
డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు మాత్ర‌మే
శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8, ఎస్ 8+, ట్యాబ్ ఎస్‌3 కొన్న‌వారికి గిఫ్ట్‌గా ఒక జియో సిమ్‌ను శాంసంగ్ గిఫ్ట‌గా ఇస్తుంది. ఇప్ప‌డు యూజ‌ర్ ఆ సిమ్‌ను వాడుకోవాలంటే 309 లేదా 509 రూపాయ‌ల రీఛార్జి చేసుకోవాలి. ఈ రెండు ప్లాన్లూ జియో ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తో వ‌స్తాయి. సాధార‌ణంగా ఈ ప్లాన్లు తీసుకున్న వినియోగ‌దారుల‌కు 309 రూపాయ‌ల రీఛార్జి అయితే 28 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. 509 రూపాయ‌ల రీఛార్జి అయితే 56 జీబీ డేటా వ‌స్తుంది. ఈ డ‌బుల్ డేటా ఆఫ‌ర్‌లో 309 రూపాయ‌ల రీఛార్జి తో 56 జీబీ, 509 రూపాయ‌ల రీఛార్జి అయితే 112 జీబీ డేటా ఉచితంగా వ‌స్తుంది. యాక్టివేష‌న్ చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఎనిమిది రీఛార్జిల వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. అది కూడా మే 1 నుంచి ఈ ఏడాది డిసెంబ‌ర్ 31వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. ఈ సిమ్‌ను వేరే హ్యాండ్‌సెట్‌లోకి మార్చితే ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌దు.
ఆఫ‌ర్ ఎలా పొందాలంటే?
1.శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 లేదా ఎస్ 8+ లేదా ట్యాబ్ ఎస్‌3 కొని దానిలో మై జియో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
2. సిమ్ కోడ్ జ‌న‌రేట్ చేసుకోవాలి. రిల‌య‌న్స్ స్టోర్‌కు వెళ్లి కొత్త జియో సిమ్ కార్డు తీసుకుని మినిమ‌మ్ 309 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకోవాలి.
3. మీకు 48 గంట‌ల్లోగా మై జియో యాప్‌లోని వోచ‌ర్స్ సెక్ష‌న్స్‌లో మీకు ఒక వోచ‌ర్ వ‌స్తుంది.
4. ఆ వోచ‌ర్‌ను రిడీమ్ చేసుకుంటే డ‌బుల్ డేటా ఆఫ‌ర్ అప్ల‌య్ అవుతుంది.

మీరు ఇప్ప‌టికే జియో క‌స్ట‌మ‌ర్ అయితే.. 1.మీ సిమ్ కార్డ్‌ను కొత్త డివైస్‌లో వేసి మినిమ‌మ్ 309 రూపాయ‌ల‌తో రీఛార్జి చేసుకోవాలి.
2. రీ ఛార్జి చేసుకున్న 48 గంట‌ల్లోగా మై జియో యాప్‌లోని వోచ‌ర్స్ సెక్ష‌న్స్‌లో మీకు ఒక వోచ‌ర్ వ‌స్తుంది.
3. ఆ వోచ‌ర్‌ను రిడీమ్ చేసుకుంటే డ‌బుల్ డేటా ఆఫ‌ర్ అప్ల‌య్ అవుతుంది.