• తాజా వార్తలు

మోస్ట్ ఎట్రాక్టివ్ బ్రాండ్‌.. గూగుల్‌ ఇండియా

ఎంప్లాయిస్ దృష్టిలో ఇండియాలో అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా సెర్చి ఇంజిన్ గూగుల్‌ ఇండియా నిలిచింది. రాండ్‌స్టడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ 2017 సర్వే ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. మెర్సిడెజ్‌-బెంజ్ సెకండ్ ప్లేస్ సాధించింది. ఈ-కామర్స్ కేట‌గిరీలో అమెజాన్‌ ఇండియా; ఎఫ్‌ఎంసీజీలో ఐటీసీ; క‌న్స్యూమ‌ర్‌, హెల్త్‌కేర్ కేట‌గిరీలో ఫిలిప్స్‌ ఇండియా.. ఇండియాలో టాప్ కంపెనీలుగా నిలిచాయి. ర్యాండ్‌స్ట‌డ్ వివిధ రంగాల్లో పని చేస్తున్న 3500 మందిని స‌ర్వే చేసి ఈ ర్యాంకులు ఎనౌన్స్ చేసింది.
సూప‌ర్ వ‌ర్క్ ఎక్స్‌పీరియ‌న్స్‌
వ‌ర‌ల్డ్ మోస్ట్ యూజ్డ్ సెర్చి ఇంజిన్ గూగుల్ లో పని చేయ‌డమే చాలా మంది గోల్‌గా పెట్టుకుంటారు. కంపెనీ ఇచ్చే శాల‌రీ కంటే అక్క‌డ దొరికే ఫెసిలిటీస్‌.. టార్గెట్లంటూ వ‌ర్క్ బర్డెన్ లేక‌పోవ‌డం, క్రియేటివిటీకి ఎక్కువ స్కోప్‌, వ‌ర్క్ ఎట్మాస్పియ‌ర్‌, ఆఫీస్ లో ఉండే సౌక‌ర్యాలు ఇవ‌న్నీ చాలా మంది ఇండియ‌న్ యూత్‌కు గూగుల్‌లో జాబ్ మా డ్రీమ్ అనేలా చేస్తుంటాయి. కంపెనీని సెల‌క్ట్ చేసుకునేట‌ప్పుడు శాల‌రీ, పెర్క్స్ కి ఎక్కువ ప్రిఫ‌రెన్స్ ఇస్తామ‌ని స‌ర్వేలో పార్టిసిపేట్ చేసిన చాలా మంది చెప్పారు. వ‌ర్క్‌- ప‌ర్స‌న‌ల్ లైఫ్ మ‌ధ్య సౌలభ్యం, జాబ్ గ్యారంటీ వంటివి కీల‌క‌మైన అంశాల‌ని మ‌రికొంత మంది చెప్పారు. ఇలాంటివ‌న్నీ గూగుల్ ఇండియాలో పుష్క‌లంగా ఉంటాయి కాబ‌ట్టి మేం బెస్ట్ ఎంప్లాయ‌ర్‌గా గూగుల్‌నే చెబ‌ముతున్నామ‌న్నారు.
ఐటీని మించింది లేదు..
ఐటీ రంగం ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూస్తున్నా.. ఇంట‌ర్నేష‌న‌ల్ ఇష్యూస్ ఐటీ ఫీల్డ్‌ను ఎంత క‌ల‌వ‌ర‌పెడుతున్నా ఇండియాలో ఇప్ప‌టికీ ఎక్కువ మంది ఇష్ట‌ప‌డే ది ఐటీ రంగాన్నే. మంచి శాల‌రీ, వ‌ర్క్ ఫ్రం హోం వంటి ఫెసిలిటీస్‌, గ్రోత్ .. ఇవ‌న్నీ ఐటీని టాప్‌లో నిల‌బెట్టాయ‌ని స‌ర్వే చెప్పింది. ఐటీ త‌ర్వాత బ్యాంకింగ్‌, ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌, ఇన్స్యూరెన్స్ సెక్టార్ కంపెనీల్లో పనిచేయడానికి ఇండియ‌న్ ఎంప్లాయిస్ ఇష్ట‌ప‌డుతున్నారు. కంపెనీల బ్రాండింగ్‌, మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలు చూసుకోవాల‌ని చాలా మంది చెప్పారు. అవసరమనుకుంటే కంపెనీయే కాదు ఫీల్డ్ మార‌డానిఇక కూడా చాలా మంది సిద్ధంగా ఉన్న‌ట్లు స‌ర్వేలో చెప్పారు.