• తాజా వార్తలు
  •  

50 కోట్ల యూజర్లతో లింక్డిన్ రికార్డు


ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ కీలక మైలురాయిని చేరుకుంది. తన యూజర్ బేస్ లో స్థిరమైన వృద్ధిని కనబరుస్తూ 50 కోట్ల మంది వినియోగదారుల మార్క్ ను చేరుకుంది. గత ఏడాది జూన్ నాటికి ఈ సైట్ కు 43.3 కోట్ల మంది వినియోగదారులు ఉండేవారు. కాగా లింక్డ్ ఇన్ కు 200 దేశాల్లో వినియోగదారులున్నారు.

వారానికి లక్ష ఆర్టికల్స్ లింక్డ్ ఇన్ ను కొద్దికాలం కిందట మైక్రోసాఫ్టు 2600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. మరోవైపు లింక్డిన్ లో ఒక కోటి యాక్టివ్ జాబ్ లిస్టింగ్స్ ఉన్నాయి. సుమారు 90 లక్షల సంస్థలకు చెందిన ఉద్యోగవకాశాల సమాచారాన్ని ఇందులో యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు... వారానికి ఇందులో లక్ష ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తుంటారు.
టార్గెట్ మరో 10 కోట్లు
ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఇంత పెద్ద ప్రొఫెషనల్ కమ్యూనిటీ లేదని సంస్థ చెబుతోంది. కాగా లింక్డిన్ తన యూజర్ బేస్ ను మరింతగా పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. రానున్న ఏడాది కాలంలో మరో 10 కోట్ల మందిని చేర్చుకోవాలని అనుకుంటోంది.