• తాజా వార్తలు
  •  

తొలి యాపిల్ కంప్యూట‌ర్ రూ. 2.3 కోట్లు పలికింది 

యాపిల్‌.. టెక్నాల‌జీతో ప‌రిచ‌య‌మున్న ప్ర‌తి వ్య‌క్తి ఆ కంపెనీ ప్రొడ‌క్ట్ ఒక్క‌సారైనా వాడాల‌ని కోరుకుంటాడు.  యాపిల్ కంప్యూట‌ర్‌, మ్యాక్‌, ఐపోడ్‌, ఐ ప్యాడ్‌, ఐ ఫోన్‌, యాపిల్ వాచ్ ఇలా ఎలక్ట్రానిక్ ఉప‌క‌ర‌ణాల త‌యారీలో ప్ర‌పంచంలోనే ఐకాన్‌గా నిలిచిన యాపిల్ 40 ఏళ్ల క్రితం ఓ సాదాసీదా కంపెనీ. స్టీవ్ జాబ్స్ ఆయ‌న స‌హ‌చ‌రులు క‌లిసి స్థాపించిన ఈ సంస్థ మొద‌ట కంప్యూట‌ర్లే త‌యారు చేసేది. ఆలా 40 ఏళ్ల క్రితం యాపిల్ త‌యారు చేసిన మొద‌టి కంప్యూట‌ర్ వేలానికి వ‌చ్చింది. ఓ అజ్ఞాత వ్య‌క్తి దాన్ని ఏకంగా 3,65,000 డాల‌ర్లు (దాదాపు 2కోట్ల 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌)కు సొంతం చేసుకున్నాడు. 
66లో మిగిలింది ఈ ఒక్క‌టే
 1976లో యాపిల్ వ్య‌వ‌స్థాప‌కులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్ కలిసి అసెంబుల్డ్ మదర్‌బోర్డులతో 66 కంప్యూటర్లు త‌యారు చేశారు. వీటిలో మిగిలింది ఇదొక్క‌టే.  దీనికి యాపిల్ 1 అని పేరు పెట్టారు. అప్పట్లో దీని ధర 666.66 డాలర్లు.  ఇప్పుడు క్రిస్టీ ఆక్ష‌న్ హౌస్‌లో వేలంలో  3 ల‌క్ష‌ల 55వేల డాల‌ర్ల ధ‌ర ప‌లికింది.  ప్రీ అసెంబుల్డ్ మ‌ద‌ర్ బోర్డుతో వ‌చ్చిన తొలి కంప్యూట‌ర్ ఇదే కావ‌డం విశేషం.