• తాజా వార్తలు
  •  

ఇండియన్ ఐటీ సెక్టార్ పై ట్రంప్ ఎఫెక్ట్

ఇండియన్ ఐటీ సంస్థలకు షాకిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ 'హైర్ అమెరికన్, బై అమెరికన్' పేరుతో తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులతో ఇక ఎవరైనా అమెరికా వెళ్లేందుకు అవకాశం లేకుండాపోతోంది. ముఖ్యంగా దీని ప్రభావం దేశీయ ఐటీ సంస్థలపై తీవ్రంగా ఉండనుందని భావిస్తున్నారు. దీనివల్ల నాన్ అమెరికన్ ఐటీ సంస్థలపై ఆర్థిక భారం పడనుందని అసోచామ్ నివేదిక చెబుతోంది.
రెమిటెన్స్ డౌన్
అమెరికా నుంచి రెమిటెన్స్ లు కూడా భారీగా తగ్గుతాయని అసోచామ్ అంచనా వేసింది. వరల్డ్ బ్యాంకు లెక్కల ప్రకారం రెమిటెన్స్ లో అమెరికా భారత్ కు రెండో అతిపెద్ద వనరుగా ఉంది. దాని తర్వాత సౌదీ అరేబియా నుంచి ఎక్కువ రెమిటెన్స్ లు వస్తున్నాయి. తాజాగా అమెరికా తీసుకున్న నిర్ణయంతో ఐటీ సంస్థలు తమ వర్క్ ఫోర్స్ ను బలవంతంగా వేరువేరు ప్రాంతాలకు తరలించనున్నట్లు తెలుస్తోంది.
దిగ్జజ సంస్థలపైనా భారం
కంపెనీల ఖర్చులు, రూపాయి విలువ పెరగడం కంపెనీల బ్రాండ్ వేల్యూను తగ్గిస్తుందని భావిస్తున్నారు. దీని ప్రభావం ఉద్యోగాలపై తీవ్రంగా ఉండనుంది. వీసా నిబంధనలు కఠినతరం కావడంతో భారత్ లో ఐటీ దిగ్గజాల నియామకాల్లో, వేతనాల్లో, ఉద్యోగాల్లో పెను మార్పులు రావడం ఖాయమని అసోచాం అంచనా వేస్తోంది.

జన రంజకమైన వార్తలు