• తాజా వార్తలు
  •  

ఐ ఫోన్‌లోని అల్ట్రా సౌండ్ స్కాన‌ర్ ద్వారా త‌న‌కు క్యాన్స‌ర్ ఉంద‌ని క‌నుగొన్న డాక్ట‌ర్

క్యాన్స‌ర్ ప్రాణాంత‌కమే. కానీ ఎంత త్వ‌ర‌గా క‌నుక్కుంటే రోగి లైఫ్‌ను అంత ఎక్కువ కాలం పొడిగించ‌గ‌ల‌మ‌ని డాక్ట‌ర్స్ చెబుతారు. అందుకే క్యాన్స‌ర్ ట్రీట్‌మెంట్‌లో దాని ఎర్లీ డ‌యాగ్న‌సిస్ అత్యంత కీల‌కం.  ఐఫోన్‌లోని అల్ట్రా సౌండ్ స్కాన‌ర్ ద్వారా త‌న‌కు క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు డ‌యాగ్న‌సిస్ చేసుకున్నారు అమెరికాలోని ఓ డాక్ట‌ర్‌.  ఇది క్యాన్స‌ర్ డ‌యాగ్న‌సిస్‌లో ఓ పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయింది.
 సొంతంగా ప్ర‌యోగం
> జాన్ మార్టిన్ అనే వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్ గొంతులో ఏదో ఇబ్బందిగా ఉండ‌డంతో దానికి కార‌ణ‌మేంటో తెలుసుకోవాల‌నుకున్నారు.  ప్యాకెట్ సైజ్‌లో ఉండే అల్ట్రా సౌండ్ డివైస్‌తో దాన్ని డిటెక్ట్ చేశారు. ఈ డివైస్‌ను క‌నెక్టిక‌ట్ బేస్డ్ ఆర్గ‌నైజేష‌న్ అయిన బ‌ట‌ర్‌ఫ్లై నెట్‌వ‌ర్క్ త‌యారుచేసింది.  ఈ సంస్థ‌లో ఛీఫ్‌గా ప‌ని చేస్తున్న మార్టిన్ దాన్ని తానే వాడారు. ఐఫోన్‌తో కంపాటబులిటీ క‌లిగి ఉండే ఈ డివైస్‌తో త‌న‌కు  మెడ భాగంలో స్క్వామ‌స్ సెల్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు మార్టిన్ గుర్తించ‌గ‌లిగారు.
 ఫ‌స్ట్ సాలిడ్ స్టేట్ అల్ట్రా సౌండ్ మెషీన్
> ఇది అమెరిక‌న్ మార్కెట్‌లోకి వ‌చ్చిన ఫ‌స్ట్ సాలిడ్ స్టేట్ అల్ట్రా సౌండ్ మెషీన్. ఈ డివైస్‌ను సెమీ కండ‌క్ట‌ర్ మాన్యుఫాక్చ‌రింగ్ యూనిట్‌లో త‌యారు చేశారు. సెమీ కండ‌క్ట‌ర్ చిప్‌లో ఉండే కెపాసిటివ్ మైక్రో మెషీన్డ్ అల్ట్రా సౌండ్ ట్రాన్స్‌డ్యూస‌ర్స్‌తో ప‌ని చేస్తుంది. దీనితో బాడీని స్కాన్ చేసుకోవ‌డమే కాదు ప్రింట్ అవుట్ కూడా తీసుకోవ‌చ్చు.
 ఖ‌రీదు త‌క్కువ‌
> సాధార‌ణంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సిస్టం ఖ‌రీదు  16 ల‌క్ష‌ల నుంచి 75 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఈ బ‌ట‌ర్‌ఫై ఐక్యూ డివైస్ ఖ‌రీదు ల‌క్షా ముప్పైవేల రూపాయ‌లు (2వేల డాల‌ర్లు) మాత్ర‌మే.  అమెరిక‌న్ క‌రెన్సీలో ఇది పెద్ద అమౌంటే కాద‌ని, అంద‌రూ కొనుక్కుని సొంతంగా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు టెస్ట్ చేసుకోవ‌చ్చ‌ని మార్టిన్ చెబుతున్నారు.  ఐఫోన్‌తో కంపాటబులిటీ ఉండే ఈ డివైస్‌ను వాడుకోవ‌డం కూడా చాలా ఈజీ అంటున్నారు.