• తాజా వార్తలు

రిపేర్ చేయించుకునే హక్కును తిరస్కరించిన న్యూ యార్క్ అసెంబ్లీ

మొబైల్ ఫోన్ లు, ట్యాబు లేట్ లు , కంప్యూటర్ ల రిపేర్ కు సంబంధించి న్యూ యార్క్ అసెంబ్లీ ముందుకు వచ్చిన ఒక బిల్లును న్యూ యార్క్ అసెంబ్లీ తిరస్కరించింది. ఇది రిపేర్ చేయించుకునే హక్కు కు సంబందించిన బిల్లు. పగిలిపోయిన లేదా పాడు అయి పోయిన మొబైల్ ఫోన్ లూ, టాబ్లెట్ లూ, కంప్యూటర్ లను సులభంగా రిపేర్ చేయించుకునే సౌలభ్యాన్ని వినియోగదారునుకి ఇది కల్పిస్తుంది. కానీ టెక్ దిగ్గజాలైన ఆపిల్, సిస్కో, మరియు జిరాక్స్ లాంటి కంపెనీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి. ఎందుకంటే ఈ బిల్లు కనుక పాస్ అయితే ఈ కంపెనీ లు విడుదల చేసే ఎలక్ట్రానిక్ పరికరాల యొక్క విడిభాగాలు, డిజైన్ మాన్యువల్ లను చిన్న చిన్న రిపేర్ షాప్ లకు కూడా ఈ కంపెనీలు ఇవ్వవలసి ఉంటుంది. ఇది రిపేర్ షాప్ లు నడిపే టేక్నిషియన్స్ కు ఒక వరం లాగా మారనుంది. అంతేగాక దేశ వ్యాప్తంగా రిపేర్ చేయించుకునే హక్కు కు మద్దతుగా ఉన్న అడ్వొకేట్ లకు ఒక ఆయుధంగా ఉంది ఉండేది.

జూన్ నెల చివరి వరకూ న్యూ యార్క్ అసెంబ్లీ ఈ ఫెయిర్ రిపేర్ చట్టాన్ని సమర్థిస్తూ వచ్చింది, కానీ చివరికి వోటింగ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కమిటి ముందు ఈ బిల్ వీగిపోయింది.

“ టెక్ కంపెనీలు తమ ఉత్పత్తుల విడిభాగాలను తయారీ మాన్యువల్ లనూ రిపేర్ షాప్ లకు ఇచ్సినట్లయితే ఐ ఫోన్ లాంటి ఖరీదైన వినియోగదారులకు వాటిని రిపేర్ చేయించుకోవడం చాలా సులువు అవుతుంది. వినియోగదారులకు ఎక్కువ కాస్ట్ ఆప్షన్ లు ఉండడమే కాక వారి పరికరం యొక్క జీవిత కాలం కూడా పెరుగుతుంది. ఏదైనా పరికరం పాడు అయినపుడు కొత్తది కొనుక్కోవడం కంటే బాగు చేయిoచుకోవడమే ఉత్తమం కదా! అంతేగాక ఈ ఫెయిర్ రిపేర్ ఆక్ట్ వలన ఈ -వ్యర్థాలను కూడా తగ్గించిన వారము అవుతాము” అని ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులు అంటున్నారు.

మరో వైపు టెక్ కంపెనీలు మాత్రం ఈ బిల్లు కనుక పాస్ అయితే తమకు కష్టమని భావిస్తున్నాయి.వినియోగదారుని యొక్క రిపేర్ అవకాశాల పై గట్టి నియంత్రణ ఉన్నపుడే ఉత్పత్తుల యొక్క సమగ్రత ను కాపాడగలమనీ అంతేగాక వినియోగదారునికి మంచి అనుభవాన్ని ఇవ్వగలమనీ వాదిస్తున్నాయి. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు మాత్రం ఆపిల్ నిరాకరించింది.

కానీ ఈ బిల్ పాస్ అవకుండా ఆపిల్ మరియు ఇతర కంపెనీలు తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేసినట్లు సమాచారం.

జన రంజకమైన వార్తలు