• తాజా వార్తలు
  •  

వచ్చే నాలుగేళ్లలో నెట్ వర్క్ రంగంలో ఎన్నెన్ని మార్పులో.. 2021 నాటికి మొబైల్ డాటా, మొబైల్ వీడియో ట

 2021 నాటికి భారత్ లో మొబైల్ ఫోన్లకు కనెక్టయ్యే పరికరాల సంఖ్య 138 కోట్లకు చేరబోతోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రోజురోజుకీ విస్తారమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇదే ఊపు కొనసాగితే వచ్చే నాలుగేళ్లలో మొబైల్ కనెక్టెడ్ డివైసెస్ 138 కోట్లకు చేరుతాయని ప్రసిద్ధ నెట్ వర్కింగ్ సంస్థ సిస్కో తన వార్షిక విజువల్ నెట్ వర్కింగ్ ఇండెక్స్ లో అంచనా వేసింది. అంతేకాదు 2021 నాటికి మొబైల్ డాటా ట్రాఫిక్  ఏడు రెట్టు పెరుగుతుందని అంచనా వేసింది. ఇక మొబైల్ వీడియో ట్రాఫిక్ అయితే ఊహించని స్థాయిలో ఏకంగా 11 రెట్లు పెరుగుతుందని భావిస్తున్నారు.
    ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుతం ఫీచర్ ఫోన్లే రారాజుల్లా ఉన్నప్పటికీ నాలుగేళ్ల మొత్తం సీను మారిపోనుందని సిస్కో లెక్కలేసింది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం మొబైల్ ఫోన్లలో స్మార్టు ఫోన్లు 60 శాతం ఉంటాయని అంచనా వేసింది.
    2021 నాటికి ప్రపంచంలో బ్యాంకు ఖాతాలున్నవారి కంటే... మంచినీటి సౌకర్యం ఉన్నవారి కంటే మొబైల్ ఫోన్లు ఉన్నవారి సంఖ్యే ఎక్కువ కానుంది. 2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు వాడే వారి సంఖ్య 550 కోట్లకు చేరనుంది.
 ఇంకా ఏం చెప్పింది..?
 2021 నాటికి మొబైల్ డాటా వినియోగంలో 75 శాతం వీడియోలకే వెచ్చిస్తారు.
 ప్రస్తుతం ఇది 49 శాతంగా ఉంది. అంటే నాలుగేళ్లలో ఇప్పుడున్న కంటే 50 శాతం పెరగనుందన్నమాట.
 2019 నాటికి 2జీ కనెక్షన్లు బాగా తగ్గిపోతాయి. 3జీ, 4జీలదే డామినేషన్
ఇండియాలో ఒక్క 2016లోనే 5.96 కోట్ల మొబైళ్లు మొబైల్ నెట్ వర్క్ పరిధిలోకి వచ్చాయి.
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్టు ఫోన్లు, ఇతర స్మార్లు ఫరికరాల వినియోగం కారణంగా మొబైల్ నెట్ వర్క్ మరింత విస్తరించనుంది.
2020కి 5జీ ఊపు మొదలైపోతుంది..
2020 నుంచి 5జీ విస్తరణ ప్రారంభమవుతుందని సిస్కో అంచనా వేసింది. 5జీ సేవలకు సంబంధించిన మౌలిక వసతుల ఏర్పాటు స్పీడందుకోనుంది.
 ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారిత సేవలు ఎక్కువవుతాయి.
 ఐవోటీ పరిధి మరింత విస్తరిస్తుంది.
 5జీ సేవలు ప్రపంచంలో ఎక్కువ ప్రాంతాలకు అందనున్నాయి.
లైవ్ మొబైల్ వీడియో అతి సాధారణమైపోతుంది.
 మొబైల్ డాటా వినియోగం ఇంకా తక్కువే..
 భారత్ లో మొబైల్ డాటా వినియోగం ఇంకా తక్కువగానే ఉందని సిస్కో నివేదిక తేల్చింది. 2015లో ఇండియాలో సగటున 430 ఎండీ మొబైల్ డాటా వినియోగం నమోదు కాగా 2016లో 559 మెగా బైట్లుగా ఉంది. అయితే.. 2017లో అది 1జీబీ కంటే ఎక్కువ కానుందని అంచనా వేస్తున్నారు.
 

"

జన రంజకమైన వార్తలు