• తాజా వార్తలు
  •  

డిజిటల్ స్పేస్ లో చైనా కంటే మనం ఎంత వెనుక ?

 అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనా ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. 2030 నాటికి ఈ దేశాలే ప్ర‌పంచంలో అగ్ర‌స్థానంలో ఉంటాయ‌ని కూడా ప‌లు సంస్థ‌లు ఇప్ప‌టికే తేల్చి చెప్పాయి. అయితే, ప‌లు రంగాల్లో చైనాకి గ‌ట్టిపోటీనిస్తోన్న భార‌త్‌.. డిజిటల్ స్పేస్ లో మాత్రం ఆ దేశం కంటే ఎంతో వెన‌క‌బ‌డిపోయింది. తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం ఈ విషయంలో చైనా మనకంటే చాలా ముందుంది.  ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వాడకంలో చైనా ముందంజలో ఉందని తేలింది.
 * చైనాలో 71 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా మ‌న‌దేశంలో మాత్రం 21 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారు.
 * చైనాలో 68 శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతుండ‌గా మ‌న‌దేశంలో 18 శాతం మంది మాత్ర‌మే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు.
 * 2013 నుంచి చైనాలో స్మార్ట్ ఫోన్ ఓనర్ షిప్ 31 శాతం పెరిగితే ఆ సమయంలో భారత్ లో మాత్రం 6 శాతమే పెరిగిందని స‌ర్వే ద్వారా తెలిసింది.
 * బేసిక్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నవారు ఆ దేశంలో 98 శాతం మంది ఉంటే మ‌న‌దేశంలో 72 మంది  మాత్రమే ఉన్నారు.
 * చైనాలో 72 శాతం మంది పట్టణ ప్రాంత‌ ప్రజలు స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో 63 శాతం మందికి స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయ‌ని ప్యూ రీసెర్చి సంస్థ తెలిపింది.
 * ఇక మ‌న‌దేశంలో మాత్రం పట్టణ ప్రాంతాల్లో 29 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 13 శాతం మంది ప్ర‌జ‌లు స్మార్ట్ ఫోన్లు ఉప‌యోగిస్తున్నారు.
 * చైనాలో 60 శాతం మంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు వాడుతుండగా ఇండియాలో అది ఇంకా 14 శాతమేనని ప్యూ రీసెర్చి వెల్లడించింది.

 

జన రంజకమైన వార్తలు