• తాజా వార్తలు

గుండె జబ్బుల నుండి కాపాడడం లో సహాయపడనున్న స్మార్ట్ ఫోన్ లు.

మానవాళి జీవితం లో పెనుమార్పులు తీసుకు వస్తున్న స్మార్ట్ ఫోన్ లు ఇప్పుడు మనయొక్క ఆరోగ్యాన్ని కాపాడడం లోనూ ప్రముఖ పాత్ర వహించనున్నాయి.  ప్రత్యేకించి అత్యవసర సేవలైన హృదయానికి సంబందించిన వ్యాధులైన గుండె పోటు  లాంటి వాటినుండి మనలను కాపాడడం లోనూ , అప్రమత్తం చేయడం లోనూ ఈ స్మార్ట్ ఫోన్ లు సహాయ పడనున్నాయి.

గుండె పట్టేయడం, హార్ట్ ఎటాక్ లాంటివి వచ్చినపుడు కొన్ని నిమిషాలు కాదు కొన్ని సెకండ్ ల వ్యవధి లోనే ఫలితాలు మారిపోవచ్చు. అంటే మనిషి యొక్క ప్రాణం పోవడం లేదా తిరిగి బ్రతకడం అనేది ఈ గుండె పోటు వచ్చ్సినపుడు సెకండ్ లలోనే జరుగుతుంది. గుండె పోటు వచ్చిన వారికి మొదట చేసే చికిత్సను కార్డియో పల్మనరీ  రిససిటేషన్  అని అంటారు దీనినే షార్ట్ గా CPR అని పిలుస్తారు. గుండె పోటు వచ్చిన వారికి సరైన సమయం లో ఈ CPR ను అందించినట్లయితే మనం ఎన్నో ప్రాణాలను కాపాడిన వారము అవుతాము. ఈ CPR  ను అందించడానికి  మనం డాక్టర్ కావలసిన అవసరం లేదు. గుండె పోటు వచ్చే వ్యక్తిని ముందుగా గుర్తిస్తే చాలు. మరి గుర్తించడం ఎలా?

హార్ట్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ లు వచ్చే ముందు మన మెదడు యొక్క పనితీరును అంచనా వేసి మనలను ముందుగా అప్రమత్తం చేసే యాప్ లు ఇప్పుడు అందుబాటులోనికి వచ్చేసాయి. ఇవి ముందుగా అంచనా వేయడమే గాక అత్యవసర పరిస్థితి లో ఏమి చేయాలి అనే దానిపై కూడా  వినియోగదారులకు అవగాహన కల్పిస్తాయి. అంటే ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి CPR ను అందించడం ద్వారా ఆనేక జీవితాలను కాపాడవచ్చు అన్నమాట.

ఇక్కడ ఇంకొక అవరోధం కూడా ఉంది. ఈ డిజిటల్ టూల్ ల ద్వారా అందించే సమాచారం ఖచ్చితంగా లేకపోతే అది మెడికల్ ఎర్రర్స్ కు దారి తీయడమే గాక అనేక జీవితాలను బలి తీసుకుంటుంది. అత్యవసర పరిస్థితులలో డిజిటల్ టెక్నాలజీ ని ఉపయోగించడం  అనే అంశం పై లోతైన పరిశోధనలు జరిపి అత్యంత ఖచ్చిత మైన సమాచారం తో ముందుకు రావలసిన  అవసరం ఉంది.

పరిశోధకులు చెబుతున్న  దాని ప్రకారం వారు నిర్వహించిన కొన్ని పరిశోధనలు చాలా వరకూ సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ 100 శాతం ఫలితాలు మాత్రం రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రాణం తో పని కదా !

జన రంజకమైన వార్తలు