• తాజా వార్తలు
  •  

ట్రంప్ గెలిస్తే ఆపిల్ కి ఎందుకంత ఆనందం ?

 

మెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సంచలన విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ట్రంప్ యొక్క గెలుపు ఆపిల్ కంపెనీ యొక్క ఆనందానికి కారణం అయ్యింది. వాస్తవానికి ఆపిల్ సీఈఓ అయిన టిం కుక్ సాధారణం గానే ట్రంప్ వ్యతిరేకి. అది అందరికీ తెల్సిన విషయమే. అయితే కానీ ఎలక్షన్ కాంపెయిన్ లో భాగం గా న్యూ యార్క్ లోని ఎకనామిక్ క్లబ్ లో గత సెప్టెంబర్ లో ట్రంప్ ప్రకటించిన పాలసీ టిం కుక్ కు ఆనందాన్ని కలిగిస్తుంది.

ఇంతకీ ఏమిటా పాలసీ?

కంపెనీల యొక్క విదేశీ లాభాలను తక్కువ పన్ను రేట్ లకే US కి రప్పించనున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ప్రస్తుతం ఈ పన్ను యొక్క స్లాబ్ రేట్ 35% ఉండగా దీనిని 10 శాతానికే పరిమితం చేస్తానని ట్రంప్ ప్రకటించాడు. తద్వారా అమెరికన్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా పొందుతున్న లాభాలను తిరిగి అమెరికా కు తీసుకురావడం లో మంచి వెసులుబాటును కల్పించినట్లు అవుతుంది.

సరిగా ఇదే అభిప్రాయాన్ని 2013 లో టిం కుక్ వ్యక్తపరిచాడు. “ విదేశాలలో ఉన్న అమెరికన్ కంపెనీల లాభాలను తిరిగి అమెరికా కు తీసుకు రావాలంటే ఇక్క పన్ను రేట్ లు ఎక్కువగా ఉంటున్నాయి. 35 శాతం పన్నుగా చెల్లించాలి అంటే అది అతి పెద్ద మొత్తం అవుతుంది. ఈ రేట్ ను తగ్గించే ప్రభుత్వాల కోసం మనం ఎదురుచూడాలి. వీలయితే ఎటువంటి పన్ను లేకుండా చూసే విధానాల కోసం మన కంపెనీలు ఎదురుచూస్తున్నాయి” అని అప్పట్లో ఒక ఇంటర్ వ్యూ లో కుక్ చెప్పారు.

ఇది కేవలo ఆపిల్ కు మాత్రమే కాదు 72 శాతానికి పైగా ఉన్న సుమారు 500 కంపెనీలకు కూడా ఇది శుభవార్తే. ఇవి సుమారు 2.1 ట్రిలియన్ డాలర్ లకు పైగా విదేశీ లాభాలను ఇర్లాండ్, సింగపూర్, మరియు లక్సంబర్గ్ లాంటి దేశాలలో  ఈ కంపెనీలు కలిగిఉన్నాయి. ఈ జాబితాలో ఆపిల్ టాప్ లో ఉన్నది.181.1 బిలియన్ డాలర్ లతో ఆపిల్ మొదటి స్థానం లో ఉండగా 108.3 బిలియన్ డాలర్ ల తో గూగుల్ మరియు 47.4 బిలియన్ డాలర్ లతో మైక్రోసాఫ్ట్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా ట్రంప్ యొక్క కొత్త విధానాలతో ఆపిల్ కు భారీ మొత్తం లో లాభం చేకూరనుంది.

మరి ట్రంప్ గెలుపు ఆపిల్ కు ఆనందమే కదా!

 

జన రంజకమైన వార్తలు