• తాజా వార్తలు
  •  

ప్రపంచంలోనే ఫస్ట్ డిజిటల్ మనీ ఎయిర్ పోర్ట్


క్యాష్ లెస్ రేసులో చైనా కూడా మహా వేగంగా పరుగులు తీస్తోంది. ముఖ్యంగా విమానాశ్రయాలను క్యాష్ లెస్ గా మార్చేందుకు ఆ దేశం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. డిజిటల్ టెక్నాలజీస్ ను గుప్పిస్తోంది. ఈ క్రమంలో చైనాలోని హ్యాంగ్ జౌ ఎయిర్ పోర్టు ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాష్ లెస్ ఎయిర్ పోర్టుగా అవతరిస్తోంది.
సర్వీసెస్ అన్నీ క్యాష్ లెస్సే..
హ్యాంగ్ జౌ విమానాశ్రయంలో అన్ని రకాల సేవలకు డిజిటల్ పేమెంట్లే యాక్సెప్ట్ చేస్తారు. వసతి, విమాన టిక్కెట్లు, పార్కింగ్, కార్ రెంటల్స్ వంటివన్నీ క్యాష్ లెస్ గానే సాగనున్నాయి. కార్గో రిలేటెడ్ పేమెంట్లనూ క్యాష్ లెస్ చేసేశారు.
సెక్యూరిటీ చెక్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు
కేవలం క్యాష్ లెస్ గానే కాకుండా సెక్యూరిటీ చెక్ లను పూర్తిగా మానవరహితంగా మార్చుతున్నారు. పూర్తిగా ఆర్టఫిషియల్ ఇంటిలిజెన్సు సహాయంతో పనులన్నీ సులభంగా చక్కబెడుతున్నారు. ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీస్ తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ విమానాశ్రయాన్ని క్యాష్ లెస్ గా మార్చడంలో చైనా ప్రభుత్వానికి ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అలీబాబా సహకరించింది. అంతేకాదు.. చైనా సమాజాన్ని క్యాష్ లెస్ గా మార్చేలా టెక్నాలజీని స్ప్రెడ్ చేయడానికి అలీబాబా భారీగా ఖర్చు చేస్తోంది.

జన రంజకమైన వార్తలు