• తాజా వార్తలు
  •  

బ్రౌజింగ్ డాటా కొంటారా..?


ఇండియాలో ఆధార్ డాటాపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆధార్ వల్ల ప్రజల వ్యక్తిగత సమాచారమంతా ఎవరికైనా చేరే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు అమెరికాలోనూ ఇలాంటిదే ఒక వివాదం పెద్దదవుతోంది. ఆ వివాదానికి మూలం అక్కడి అధ్యక్షుడు ట్రంప్. వివాదాలతో సహవాసం చేయటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాబీ. అధ్యక్ష పదవిని చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదంతో నెత్తినొప్పులు వస్తున్నా ఆయన మాత్రం నాకు నచ్చింది నేను చేస్తా అన్నట్లుగా సాగిపోతున్నారు. తాజాగా అలాంటి రొచ్చులో అడుగేశారు ట్రంప్. ఒబామా హయాంలో స్పష్టమైన విధానాన్ని అనుసరించిన బ్రౌజింగ్ డేటా సేల్ ఇష్యూలో.. ట్రంప్ తన స్టైలులో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా ఈ అంశంపై హౌజ్ ఆఫ్ రిఫ్రజెంటేటివ్స్ లో చేసిన తీర్మానాన్ని చూస్తే.. బ్రౌజింగ్ డాటా బట్టబయలు చేయడానికి అంతా సిద్ధమైపోయిందని అర్థమైపోతుంది. దీనిపై ట్రంప్ సంతకం పెట్టటం మాత్రమే మిగిలి ఉంది.
బ్రౌజింగ్ డాటా అమ్మడమేంటి..? ఇంతకీ ఈ బ్రౌజింగ్ డేటా సేల్ అంటే ఏమిటా అనుకుంటున్నారా.. ఇంటర్నెట్ వినియోగదారులు నిత్యం ఇంటర్నెట్ ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వాడే సమయంలో వారు రకరకాల సైట్లను ఓపెన్ చేయటం.. చూడటం లాంటివి చేస్తుంటారు. ఇలా వ్యక్తులు చూసే వెబ్ సైట్ల వివరాలు తెలిస్తే దాన్ని బట్టి ఎవరు ఏం చూస్తున్నారు. ఏ వయసు వారు ఎలంటి ఇంట్రస్టుతో ఉన్నారు.. సిటీలో ఎలా.. రూరల్ లో ఎలా అన్న సమాచారం, ట్రెండు అంతా తెలుసుకోవచ్చు. మార్కెటింగ్ సంస్థలు ఈ బ్రౌజింగ్ హిస్టరీని కొనుగోలు చేసి.. కంపెనీలకు సేవలు అందిస్తాయి.
అదే జరిగితే.. ఇంటర్నెట్ లో ఇప్పుడు ఎవరేం చేసినా.. అది వారి వ్యక్తిగతం. వారికి పూర్తి స్థాయి ప్రైవసీ ఉంటుంది. కానీ.. ట్రంప్ సంతకం చేస్తారని చెబుతున్న బ్రౌజింగ్ డేటా సేల్ విషయానికి వస్తే.. పూర్తిగా వ్యక్తిగతమైన ఈ సమాచారం అంగడి వస్తువు అవుతుంది. అప్పుడు ఎవరైనా కొనుగోలు చేయొచ్చు. ఉదాహరణకు.. ఈ బిల్లు మీద ట్రంప్ కానీ సంతకం చేస్తే.. ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ చేసే బ్రౌజింగ్ డేటాను మనమైనా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇలా.. సామాన్యులు మొదలు అసమాన్యుల వరకూ తమ వ్యక్తిగత అంశాల్ని షేర్ చేసే విషయాన్నీ ముడి సరుకుగా మారి.. ఎవరైనా కొనుగోలు చేసుకునే వీలుఉంటుంది.
ప్రైవసీని పూర్తి స్థాయిలో దెబ్బేసే ఈ బిల్లుపై ట్రంప్ సంతకం పెట్టకూడదంటూ పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంతేనా.. ఒకవేళ తమ డిమాండ్లను పట్టించుకోకుండా ట్రంప్ కానీ సంతకం పెడితే మాత్రం.. ఆయన ప్రభుత్వంలోని రాజకీయ నేతల బ్రౌజింగ్ డేటాను కొనుగోలు చేసి మొదట బజార్లో పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇదేదో అషామాషీ వ్యవహారంగా కాకుండా.. ఇందుకోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని షురూ చేశారు. మరి.. వివాదాస్పదమైన బ్రౌజింగ్ డేటా సేల్ బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తారా? చేయరా అన్నది త్వరలోనే తెలియనుంది.

జన రంజకమైన వార్తలు