• తాజా వార్తలు
  •  

పాత రూట‌ర్ ఎక్స్చేంజ్‌తో జియోఫై పై 100% క్యాష్‌బ్యాక్‌

ఆరు నెలలు ఫ్రీ డేటా, కాల్స్ ఆఫ‌ర్ల‌తో టెలికం రంగం దుమ్ముదులిపిన జియో దెబ్బ‌తో మిగ‌తా టెలికం కంపెనీల‌న్నీ మార్కెట్లో నిల‌బ‌డేందుకు భారీ డిస్కౌంట్లు ప్ర‌క‌టిస్తున్నాయి. మొబైల్ మార్కెట్‌లో కంఫ‌ర్టబుల్ ప్లేస్ సంపాదించిన జియో ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌పై దృష్టి పెట్టింది. జియోఫై పేరిట ఇప్ప‌టికే తీసుకొచ్చిన రూట‌ర్‌ను ఇప్పుడు తాజా అస్త్రంగా ఎక్కుపెట్టింది.
ఎక్స్చేంజ్‌తో భారీ ఆఫ‌ర్
ఇత‌ర టెలికం కంపెనీల డేటాకార్డ్స్‌, డాంగిల్స్‌, వైఫై రూట‌ర్లు యూజ్ చేస్తున్న‌వారిని త‌న‌వైపు తిప్పుకునేందుకు వాటిని ఎక్స్చేంజ్‌లో ఇచ్చి జియోఫై రూట‌ర్‌ను తీసుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. ఇలా ఎక్స్చేంజ్ కింద తీసుకుంటే 100% వ‌ర‌కు క్యాష్ బ్యాక్ ఇస్తామ‌ని లేటెస్ట్‌గా అనౌన్స్ చేసింది. జియోఫై 1 రూట‌ర్, జియోఫై 2 రూట‌ర్, జియోఫై 3 రూట‌ర్, జియోఫై 4 డాంగిల్‌పై ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.
రెండు ఆఫ‌ర్లు
ఇత‌ర కంపెనీల డాంగిల్స్‌, డేటాకార్డ్స్‌, వైఫై రూట‌ర్లు వాడుతున్న‌వారు వాటిని జియో డిజిట‌ల్ స్టోర్ లేదా జియో కేర్ స్టోర్‌లో ఇచ్చి 1999 రూపాయ‌ల‌ను చెల్లించి జియోఫైను తీసుకోవాలి. కంపెనీ 2010 రూపాయ‌ల విలువైన 4జీ డేటాను ఎక్స్చేంజ్ ఆఫ‌ర్ కింద ఇస్తుంది. అంటే మీకు జియోఫై 100% ఫ్రీగా వ‌చ్చిన‌ట్లే. అయితే 408 రూపాయ‌ల మ్యాండేట‌రీ ఫ‌స్ట్ రీఛార్జి చేయించుకోవాలి. ఇందులో 99 రూపాయ‌లు జియో ప్రైమ్ మెంబ‌ర్ షిప్, మిగిలిన 309 రూపాయ‌ల‌తో 84 రోజుల‌పాటు డేటా వాడుకోవ‌చ్చు. * రెండో ప్లాన్‌లో జియోఫైను 1099 రూపాయ‌ల‌కు కొని 408 రూపాయ‌ల మ్యాండేట‌రీ ఫ‌స్ట్ రీఛార్జి చేయించుకోవాలి. 1005 రూపాయ‌ల 4జీ డేటా ఇస్తారు. అయితే ఈ ప్లాన్‌లో మీ పాత డాంగిల్ లేదా డేటాకార్డును ఎక్స్చేంజి కింద ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఈ రెండింటిలోనూ మొద‌టి ఆఫ‌ర్ అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, రెండో ఆఫ‌ర్ ల్యాప్‌టాప్ యూజ‌ర్ల‌కు, టాబ్లెట్లు వినియోగించేవారికి ప‌నికొస్తుంద‌ని కంపెనీ చెబుతోంది.

జన రంజకమైన వార్తలు