• తాజా వార్తలు
  •  

 ఎయిర్‌టెల్ ఇంట‌ర్నెట్ టీవీలో ఐదు అద్భుత‌మైన ఫీచ‌ర్లు 

ఇండియ‌న్ టెలికాం రంగంలో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న ఎయిర్‌టెల్‌.. డీటీహెచ్ రంగంలోనూ త‌నదైన ముద్ర వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది.  తాజాగా లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ ఇంట‌ర్నెట్ టీవీలో మిగ‌తా సెట్‌టాప్ బాక్స్‌ల కంటే ఎన్నో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను తీసుకొచ్చింది. అవేమిటో చూడండి..
ఇవీ ఆఫ‌ర్లు
ఎయిర్‌టెల్ ఇంట‌ర్నెట్ టీవీ సెట్‌టాప్ బాక్స్ ధ‌ర 4,999 రూపాయ‌లు.  దీంతోపాటు మూడు నెల‌ల‌పాటు -ఫ్రీ యాక్సెస్ ఇస్తుంది. 7,999 రూపాయ‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే సంవ‌త్స‌రంపాటు అన్ని ఛాన‌ళ్ల‌ను ఫ్రీగా చూడొచ్చు.  ఇప్ప‌టికే ఎయిర్‌టెల్ డీటీహెచ్ వాడుతున్న‌వారికి సెట్‌టాప్ బాక్స్‌ను వెయ్యి రూపాయ‌ల త‌గ్గింపుతో 3,999 రూపాయ‌ల‌కే అందిస్తుంది. దీంతోపాటు మూడు నెల‌ల‌పాటు ఫ్రీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా ఇస్తుంది. అంతేకాదు ఈ సెట్‌టాప్ బాక్స్ తీసుకుంటే 999 రూపాయ‌ల కంటే త‌క్కువ రెంట‌ల్ కట్టే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల‌కు 10జీబీ, 999 కంటే ఎక్కువ రెంట‌ల్ పే చేసే వారికి 25 జీబీ డేటాను ప్ర‌తి నెలా అదనంగా ఇస్తుంది. దీంతోపాటు ఇంటర్నెట్ టీవీ రీఛార్జిపై 10% క్యాష్‌బ్యాక్ కూడా వ‌స్తుంది.  

1. ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫారంపై ప‌ని చేస్తుంది. 
ఎయిర్‌టెల్ ఇంట‌ర్నెట్ టీవీ గూగుల్ ఆండ్రాయిడ్ టీవీ ఫ్లాట్‌ఫాంపై ప‌ని చేస్తుంది. ఈ 4k సెట్‌టాప్ బ్యాక్స్ 2జీబీ ర్యామ్‌, 8జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో రావ‌డం మ‌రో స్పెషాలిటీ. * గూగుల్ వాయిస్ సెర్చ్‌, డాల్బీ అట్మెస్‌, ఎస్డీ కార్డ్‌, మ‌ల్టిపుల్ యూఎస్‌బీస్లాట్‌తో వ‌చ్చింది.  ఇన్‌బిల్ట్‌గా ఉన్న 4K Chromecast మీ ఫోన్‌లో ఉన్న కంటెంట్‌ను టీవీ స్క్రీన్‌పై కాస్టింగ్‌, స్క్రీన్ మిర్ర‌రింగ్ ద్వారా చూపిస్తుంది. వీడియో కాన్ఫ‌రెన్సింగ్ యాప్‌, క్లౌడ్ స్టోరేజ్‌, రికార్డింగ్‌, క్యాచ్ అప్ టీవీ, రీస్టార్ట్ టీవీ వంటి ఫీచ‌ర్లు తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయి. 
  
2.వాయిస్ బేస్డ్ రిమోట్ కంట్రోల్ 
ఈ టీవీకి బ్లూటూత్ వాయిస్ బేస్డ్ రిమోట్ కంట్రోల్ ఉంది.  మీ వాయిస్ క‌మాండ్స్ ద్వారా టీవీలో ఛానల్స్ మార్చుకోవ‌చ్చు. ఆన్‌, ఆఫ్ చేసుకోవ‌చ్చు.  అంతేకాదు మీ ఫోన్‌ను స్మార్ట్ కంట్రోల‌ర్‌గా ఉప‌యోగించి గేమ్స్ కూడా ఆడుకోవ‌చ్చు. స్పీక‌ర్స్‌, హెడ్‌సెట్స్ వంటి బ్లూటూత్ డివైస్‌ల‌ను క‌నెక్ట్ చేసి మంచి ఆడియో అవుట్‌పుట్‌ను వినొచ్చు. 

3.ఎయిర్‌టెల్ గేమ్‌పాడ్ అప్లికేష‌న్‌
ఎయిర్‌టెల్ ఇంట‌ర్నెట్ టీవీ యూజ‌ర్ల కోసం మొబైల్ ఫోన్లో న్యూ గేమ్‌పాడ్ అప్లికేష‌న్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. ఈ అప్లికేష‌న్‌ను ఉప‌యోగించి ఇంట‌ర్నెట్ టీవీ సెట్‌టాప్ బాక్స్ ద్వారా వ‌చ్చే గేమ్స్‌ను మీ మొబైల్ ద్వారా ఆడుకోవ‌చ్చు. బ్లూ టూత్ ద్వారా ఎయిర్‌టెల్ గేమ్‌పాడ్ యాప్ సెట్‌టాప్ బాక్స్‌కి క‌నెక్ట్ అవుతుంది. 

4.ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్‌గా నెట్ ఫ్లిక్స్‌, యూట్యూబ్ 
ఈ సెట్‌టాప్ బాక్స్ ద్వారా యూ ట్యూబ్ వంటి గూగుల్ అప్లికేష‌న్ల‌ను ఫ్రీగా వాడుకోవ‌చ్చు. ఫ్రీ గేమ్స్ కూడా ఉన్నాయి.  Eros Now movies ద్వారా మూడు నెల‌ల ఫ్రీ మూవీ స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా ల‌భిస్తుంది. కొత్త స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు నెట్ ఫ్లిక్స్ నెల రోజుల ఫ్రీ ట్ర‌య‌ల్ కూడా వ‌స్తుంది. 

5.అన్ని ర‌కాల టీవీల‌కూ  క‌నెక్ట్ అవుతుంది
ఎయిర్‌టెల్ ఇంట‌ర్నెట్ టీవీ అన్ని టీవీల‌కు కంపాట‌బిలిటీ క‌లిగి ఉంది. 4కే, హెచ్‌డీ డిస్‌ప్లేల‌తో వ‌చ్చే ఎల్ఈడీ,ఎల్‌సీడీ, ప్లాస్మా టీవీల‌న్నింటికీ ప‌ని చేస్తుంది.  పాత టీవీసెట్లు వాడుతున్న‌వారు ఆడియో, వీడియో కేబుల్ జాక్ ద్వారా ఈ సెట్‌టాప్ బాక్స్‌ను వాడుకోవ‌చ్చు.  ఆప్టిక్ కేబుల్ ద్వారా హోం థియేట‌ర్‌కు అవుట్‌పుట్ తీసుకునే అవ‌కాశం ఉంది.  
 

జన రంజకమైన వార్తలు