• తాజా వార్తలు
  •  

యాంటీ వైర‌స్ లా యాంటీ రాన్స‌మ్ వేర్ సాఫ్ట్‌వేర్‌ లలో బెస్ట్ ఏంటి ?

రాన్స‌న్‌వేర్‌... ఈ పేరు విన‌గానే టెకీల గుండెల్లో గుబులు రేగుతుంది. దీనికి కారణం రాన్స‌న్‌వేర్ పేరుతో వైర‌స్ రావ‌డ‌మే కారణం. రాన్స‌న్‌వేర్ వైర‌స్ విష‌యం ప‌క్క‌న‌పెడితే యాంటీ రాన్స‌న్‌వేర్ సాఫ్ట్‌వేర్ గురించి ఎంత‌మందికి తెలుసు? అయితే విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఉప‌యోగించేవాళ్ల‌కు రాన్స‌న్‌వేర్ సాఫ్ట్‌వేర్  కొన్ని ఉచితంగా యాంటీ రాన్స‌న్‌వేర్ సాఫ్ట్‌వేర్ అందిస్తోంది. అవేంటో చూద్దామా..

అన్ని వైర‌స్‌ల‌కు అడ్డుక‌ట్ట‌గా.. 
రాన్స‌న్‌వేర్ యాంటీ వైర‌స్ సాఫ్ట్‌వేర్ వన్నాక్రై, సీబీటీ లాక‌ర్‌, పెట్యా, టెల్సాక్రాఫ్ట్‌, క్రైప్టోలాక‌ర్‌, జెప్టో, క్రెప్ట్ ట్రిపుల్ ఎక్స్‌, టెలీక్రాప్ట్‌, ఆటోలాకీ లాంటి వైర‌స్‌ల నుంచి రాన్స‌న్‌వేర్ యాంటీ వైర‌స్ ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంది. రాన్స‌న్‌వేర్ యాంటీ సాఫ్ట్‌వేర్‌లు రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి మీ పీసీని రామ్స‌న్‌వేర్ వైర‌స్ అటాక్‌ల నుంచి కాపాడుతుంది. మీ కంప్యూట‌ర్‌లోని సెన్సిటివ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌కు హాని కలిగించ‌క‌ముందే ఇది బ్లాక్ చేస్తుంది.  దీనికోసం  మాల్‌వేర్ సిగ్నేచ‌ర్స్‌, బిహేవియ‌ర‌ల్ బేస్డ్ టెక్నిక్స్ లాంటి ఫీచ‌ర్ల‌ను ఉపయోగిస్తుంది. ఇక రెండో టైప్ ఏంటంటే. .. అప్ప‌టికే వైర‌స్ బారిన ప‌డిన ఫైల్స్‌ను రిక‌వ‌ర్ చేయ‌డం. దీని కోసం డెక్రైప‌పోట‌ర్ టూల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 

క్రై ప్రివెంట్‌
యాంటీ వైర‌స్ బారిన ప‌డ‌కుండా మ‌న పీసీని కాపాడుతుంది ఈ యాంటీ వైర‌స్‌.  ఇది బేసిక‌ల్‌గా ఒక యాంటీ మాల్‌వేర్ ప్రోగ్రామ్‌. క్రైపొటొలాక‌ర్ లాంటి వైర‌స్‌ల నుంచి ఇది పీసీని బ‌య‌ట‌ప‌డేస్తుంది. మీ ప్రైవేటు డేటాను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. దీని వ‌ల్ల మీకు ఎంతో మ‌నీ ఆదా కానుంది. ప్ర‌త్యేక‌మైన ఫోల్డ‌ర్ల‌లో దాయ‌డం ద్వారా మ‌న డేటాను ఈ ఫీచ‌ర్ సేవ్ చేస్తుంది. రియ‌ల్ టైమ్ ప్రొటెక్ష‌న్ దీని ప్ర‌త్యేక‌త‌.

ఎస్‌బీ గార్డ్ యాంటీ రామ్స‌న్‌వేర్‌
ఎస్‌బీ గార్డ్ కూడా మ‌రో ఫ్రీ యాంటీ వైర‌స్ అన్ని ర‌కాల సాఫ్ట్‌వేర్ అటాక్‌ల నుంచి కంప్యూట‌ర్‌ని కాపాడుతుంది. దీనిలో 700 పైగా  రిజిస్ట్రీ ఎంట్రీలు ఉన్నాయి.. అవి కాకుండా వేరే సాఫ్ట్‌వేర్‌లు సిస్ట‌మ్స్‌లోకి ఎంట‌ర్ కాకుండా ఇది కాపాడుతుంది.  విండోస్‌లో డాక్యుమెంట్ల ప్రొటెక్ష‌న్ కోసం ఇది ఒక ప్ర‌త్యేక‌మైన యాంటీ వైరస్‌.

ట్రెండ్ మైక్రో రాన్స‌న్‌వేర్‌
రాన్స‌న్‌వేర్ ఎఫెక్ట్ అయిన ఫైల్స్‌ను తిరిగి పొంద‌డానికి ఈ సాఫ్ట్‌వేర్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. టెలిక్రైప్ట్‌, బాడ్‌బ్ఆక్‌, క్రైప్ట్ ట్రిపుల్ ఎక్స్‌, వాన్నాక్రై, టెలిక్రైప్ట్ లాంటి వైర‌స్‌ల‌కు ఇది అడ్డుక‌ట్ట వేస్తుంది. 

కాస్ప‌ర్‌స్కై యాంటీ రామ్స‌న్‌వేర్‌
బ్యాక్ గ్రౌండ్‌లో సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుపోవ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. బిజినెస్ అవ‌స‌రాల కోసం ఈ యాంటీ వైర‌స్ టూల్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.  అప్లికేష‌న్ల‌ను మేనేజ్ చేయ‌డం, ఫోల్డ‌ర్ల‌ను ప‌రిరీక్షించ‌డం, డేటాను భ‌ద్రం చేయ‌డం దీని స్పెష‌ల్‌.
 

జన రంజకమైన వార్తలు