• తాజా వార్తలు

వ‌చ్చే రెండేళ్ల‌లో రూ.1200 కోట్ల పెట్టుబ‌డులు పెట్టనున్న యాక్ట్ పైబ‌ర్‌

భార‌త్‌లో ప్ర‌స్తుతం వేగంగా వ్యాపారాన్ని విస్త‌రిస్తున్న సంస్థ‌ల్లో యాక్ట్ ఫైబ‌ర్ ఇంట‌ర్నెట్ ప్రొవైడ‌ర్ మందంజ‌లో ఉంటుంది. దేశ‌వ్యాప్తంగా త‌మ స‌ర్వీసుల‌ను అంద‌జేయ‌డానికి ఈ సంస్థ ర‌క‌ర‌కాల స్కీముల‌తో ముందుకొస్తుంది. తాజాగా వ1 జీబీపీఎస్ ప‌థాకాన్ని వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చిన యాక్ట్‌.. ఇలాంటి మ‌రిన్ని ప‌థాకాల‌కు శ్రీ‌కారం చుట్ట‌డానికి సిద్ధంగా ఉంది. దీనిలో భాగంగా వ‌చ్చే రెండేళ్ల‌లో రూ. 1000 నుంచి రూ.1200 కోట్ల పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆ సంస్థ వ్యూహ‌ర‌చ‌న చేస్తోంది.
దేశంలో వివిధ న‌గ‌రాల్లో సంస్థ‌ను విస్త‌రించ‌డ‌మే కాక‌.. ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌గ్రేడేష‌న్ చేయ‌డానికి కూడా యాక్ట్ ఈ పెట్టుబ‌డుల‌ను ఉప‌యోగించ‌నుంది. ట్రూ నార్త్‌, టీఏ అసోసియేట్స్ పేరుతో యాక్ట్ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. విస్త‌ర‌ణ కోసం ఇప్ప‌టికే యాక్ట్ గ‌త రెండేళ్ల‌లో దాదాపు రూ.1100 కోట్లు ఖ‌ర్చు చేసింది. దీనిలో భాగంగానే హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలో ఒక గిగా స్పీడ్‌తో ఇంట‌ర్నెట్ స‌ర్వీసుల‌ను మొద‌లుపెట్టింది. గ‌తంతో పోలిస్తే రెండేళ్ల కాలంలో యాక్ట్ ఫైబ‌ర్‌కు వినియోగ‌దారులు గ‌ణ‌నీయంగా పెరిగార‌ని.. ముఖ్యంగా మెట్రో న‌గ‌రాల్లో వీరి సంఖ్య ఎక్క‌వ‌గా ఉంద‌ని యాక్ట్ తెలపింది.
గిగా వేగంతో ఇంట‌ర్నెట్‌ను అందిస్తున్నఏకైక సంస్థ భార‌త్‌లో యాక్ట్ పైబ‌ర్ మాత్ర‌మేన‌ని ఆ సంస్థ పేర్కొంది. హెడ్ క్వార్ట‌ర్స్ బెంగ‌ళూరులో కూడా ఒక గిగా స్పీడ్ ప్ర‌యోగం చేయ‌డానికి యాక్ట్ ప్రయ‌త్నిస్తోంది. త్వ‌ర‌లో భార‌త్‌లోని 11 న‌గ‌రాల్లో ఈ స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపింది.

జన రంజకమైన వార్తలు