• తాజా వార్తలు
  •  

యాపిల్ నుంచి వాయిస్ కంట్రోల్డ్ స్పీకర్ వ‌చ్చేసింది

స్మార్ట్ హోమ్స్ కోసం వాయిస్ కంట్రోల్డ్ స్పీకర్స్‌ను అమెజాన్‌, గూగుల్ చాలా రోజుల క్రిత‌మే మార్కెట్లోకి తెచ్చాయి. ఇప్పుడు ఈ కాంపిటీష‌న్‌లోకి యాపిల్ కూడా వ‌చ్చేసింది. న్యూయార్క్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్‌వైడ్ డెవ‌ల‌ప‌ర్స్ కాన్ఫ‌రెన్స్ (wwdc 2017)లో యాపిల్ హోంపాడ్ అనే వాయిస్ కంట్రోల్డ్ స్పీక‌ర్‌ను ఆవిష్క‌రించింది. 2015లో యాపిల్ స్మార్ట్ వాచ్ ప్ర‌వేశ‌పెట్టిన త‌ర్వాత తీసుకొచ్చిన రెండో హార్డ్‌వేర్ ప్రొడ‌క్ట్ ఇదే.
ఎలా ప‌ని చేస్తుంది? యాపిల్ హోంపాడ్.. మన వాయిస్ కంట్రోల్ తో మ్యూజిక్‌ను ప్లే చేస్తుంది. దీంతోపాటు స్మార్ట్ హోమ్స్‌లో వాయిస్ కంట్రోల్డ్ యాక్ష‌న్స్ కోసం కూడా వినియోగించుకోవ‌చ్చు. అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ .. రెండూ ఇప్ప‌టికే ఈ స్పీక‌ర్ల మార్కెట్‌లో ముందున్నాయి. అయితే ఇవి యాపిల్ మ్యూజిక్ వంటి స‌ర్వీసుల‌ను స‌పోర్ట్ చేయ‌లేవు. కాబ‌ట్టి యాపిల్ యూజ‌ర్లు కొత్త హోంపాడ్‌ను వినియోగిస్తారు. ఆ ర‌కంగా చూస్తే వీటి అమ్మ‌కాల‌పై యాపిల్ పెద్ద‌గా కంగారుప‌డాల్సిన ప‌ని కూడా లేన‌ట్లే.
మార్కెట్ పెద్ద‌దే
ఇంట‌ర్నెట్ క‌నెక్టెడ్ స్పీక‌ర్స్ మార్కెట్ భారీగా పెరుగుతోంది. ఏడాదికి 600% వృద్ధి క‌నిపిస్తోంద‌ని మార్కెట్ అంచ‌నా. వీటి ధ‌ర క‌నీసం 10వేల‌కు పైనే ఉంది. అయినా గ‌త ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ చివ‌రి మూడు నెల‌ల్లోనే వీటిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా 42 ల‌క్ష‌ల యూనిట్లు కంపెనీలు విక్ర‌యించాయి. ఇందులో అమెజాన్ 88%, గూగుల్ 10% పంచుకున్నాయి. మార్కెట్ ఇంత భారీ స్థాయిలో ఉంది కాబ‌ట్టే ఇప్పుడు యాపిల్ కూడా ఈ హోం పాడ్ ప్రొడ‌క్ట్‌ను తీసుకొచ్చింది.

జన రంజకమైన వార్తలు