• తాజా వార్తలు

2025 నాటికి చైనాను 5జీ నెట్ వర్క్ ఎలా మార్చేయనుందో తెలుసా?

    చైనా ఇప్పటికే 5జీ నెట్ వర్కును పరీక్షిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచే ఇవి మొదలయ్యాయి.  2016 అక్టోబరులోనే 100 నగరాల్లో 5జీ పరికరాలను పరిశీలించింది. మొబైల్ డేటా అందించడంలో 4జీ కన్నా 20 రెట్లు వేగంగా 5జీ నెట్‌వర్క్ పనిచేస్తుంది. చైనాలో పరీక్షిస్తున్న వేగం ప్రకారం 5జీతో సెకనుకు 20 జీబీ స్పీడ్‌తో డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం 4జీ సెకనుకు 1జీబీ స్పీడుతో మాత్రమే పనిచేస్తోంది.  2025 నాటికి చైనాలో 5జీ నెట్ వర్కు ముఖచిత్రం ఎలా ఉండబోతుందనేనది షాంఘైలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా పలువురు అధికారులు, నిపుణులు వెల్లడించారు.
    2020 నాటికి వాణిజ్యపరంగా 5జీ సేవలు ప్రారంభించనున్న చైనా 2025 నాటికి చైనా ప్రపంచలోనే అతిపెద్ద 5జీ మార్కెట్ గా అవతరించనుంది. 2025 నాటికి చైనాలో 43 కోట్ల 5జీ కనెక్షన్లు ఉంటాయని పరిశ్రమ వర్గాల అంచనా.  అప్పటికి ప్రపంచంలోని మొత్తం 5జీ కనెక్షన్లలో ఇది 39 శాతం ఉంటుందని అంచనా. 
    ప్రాథమిక దశలో 5జీ సేవల వల్ల మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సూపర్ హై డెఫినిషన్ వీడియోలు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివన్నీ అత్యంత సులభమైపోతాయి. 5జీ నెట్ వర్కు రాకతో ఆటోమొబైల్ రంగం, ఫైనాన్స్, హెల్త్ కేర్ వంటి ఎన్నో రంగాల్లో ప్రగతి సాధ్యమై ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుంది.

జన రంజకమైన వార్తలు