• తాజా వార్తలు
  •  

గూగుల్ ఇమేజ్ సెర్చ్‌లో కొత్త ఫీచ‌ర్ బ్యాడ్జెస్‌

మారుతున్న ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టుగా త‌న సాంకేతిక‌త‌ను డెవ‌ల‌ప్ చేయ‌డంలో ఇంట‌ర్నెట్ దిగ్గ‌జం గూగుల్ ముందంజ‌లో ఉంటుంది. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గట్టుగా టెక్నాల‌జీని బేస్ చేసుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సాఫ్ట్‌వేర్‌ల‌లోనూ మార్పులు చేస్తుంది ఈ సంస్థ‌. తాజాగా గూగుల్ మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను ప్ర‌వేశపెట్టింది అదే బ్యాడ్జెస్‌. గూగుల్ ఓపెన్ చేసిన త‌ర్వాత ఎక్కువ‌గా మ‌నం సెర్చ్ చేసే వాటిలో ఇమేజెస్ కూడా ఉంటుంది. అయితే మ‌నం ఇమేజ్ ఎంపిక చేసుకోవ‌డంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక పేరుతో ఇమేజ్ సెర్చ్ చేయ‌గానే చిన్న‌, పెద్దా అన్ని సైజుల్లోనూ ఇమేజ్‌లు ఒకేసారి వ‌చ్చేస్తాయి. దీంతో మ‌ళ్లీ ఈ ఇమేజ్‌ల‌ను ఫిల్ట‌ర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గూగుల్ తాజాగా ప్ర‌వేశ‌పెట్టిన ఫీచ‌ర్ బ్యాడ్జెస్ యూజ‌ర్ల‌కు సెర్చింగ్ చాలా సుల‌భం అవుతుంద‌ని ఆ సంస్థ చెబుతోంది.

పిన్‌టెరెస్ట్‌లా...
మ‌న‌కు కావాల్సిన ఇమేజ్‌ల‌ను సెర్చ్ చేయ‌డానికి గూగుల్‌లో వెతుకుతాం. ఉదాహ‌ర‌ణ‌కు రావుగోపాల‌రావు అని టైప్ చేస్తే.. ర‌జ‌నీకాంత్ మాత్ర‌మే రాడు రావుగోపాల‌రావు పేరుతో ఉన్న ఇత‌ర వ్య‌క్తులు కూడా వ‌స్తారు. దీని కోసం ప్ర‌త్యేకంగా సినీ న‌టుడు రావుగోపాల‌రావు అని టైప్ చేయాల్సిందే. అయితే తాజాగా గూగుల్ ప్ర‌వేశ‌పెట్టిన బ్యాడ్జెట్  టూల్ ద్వారా మ‌నం కొట్టిన పేరుతో చాలామంది ఉంటే మ‌న‌కు కేట‌గిరిలు కూడా చూపిస్తుంది. అంటే సినిమా రావుగోపాల‌రావా లేక  బిజినెస్ రావుగోపాల‌రావా లేదా ఇత‌రులా అనే కేట‌గిరీలు మ‌న ముందుకు వ‌స్తాయి. దీని ద్వారా మ‌న‌కు సెర్చింగ్ చాలా సుల‌భం అవుతుంది. ఇమేజ్ సెర్చింగ్‌కు పెట్టింది పేరైన పిన్‌టెరెస్ట్ మాదిరిగానే ఈ కొత్త ఫీచ‌ర్‌ను గూగుల్ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెచ్చింది.

జీఐఎఫ్ ఫీచ‌ర్‌
మ‌నం ఏదైనా ఒక విష‌యం గురించి ఇమేజెస్‌లో సెర్చ్ చేసిన‌ప్పుడు కొన్ని రిజ‌ల్ట్స్ వ‌స్తాయి. అయితే బ్యాడ్జెట్ ద్వారా సెర్చ్ చేస్తే మ‌నం కోరుకునే ఫ‌లితాల‌ను వెంట‌నే రాబ‌ట్టే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు మ‌న ఆ ఫొటో మీద ఒక‌సారి ట్యాప్ చేస్తే చాలు ఆ పిక్చ‌ర్‌కు సంబంధించిన జీఐఎఫ్‌ల‌ను కూడా మ‌నం చూడొచ్చు. మ‌నం ఏదైనా ప‌ర్టిక్యుల‌ర్ విష‌యం గురించి సెర్చ్ చేస్తున్న‌ప్పుడు కూడా బ్యాడ్జెస్ ఫీచ‌ర్ గొప్ప‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఉదాహ‌ర‌ణకు ఐస్‌క్రీమ్ గురించి వెతికితే భిన్న‌మైన రిజ‌ల్ట్స్ మ‌న‌కొస్తాయి. అదే బ్యాడ్జెట్ ద్వారా వెతికితే ఆ ఐస్‌క్రీమ్ ఎలా త‌యారు చేయాలి.. త‌దిత‌ర వివ‌రాలు కూడా మ‌న‌కు అందుబాటులోకి వ‌స్తాయి. అంటే మ‌న‌కు కేవ‌లం పిక్చ‌ర్లు మాత్ర‌మే కాదు అద‌న‌పు వివ‌రాలు అందించ‌డానికి బ్యాడ్జెట్ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  అయితే పిన్‌టెరెస్ట్‌తో పోలిస్తే గూగుల్ ఇమేజ‌స్ ఇంకా వెనుక‌బ‌డే ఉంది. అందుకే యూజ‌ర్ల‌ను ఆక‌ట్ట‌కునేందుకే ఈ బ్యాడ్జెట్ ఫీచ‌ర్‌ను ముందుకు తీసుకొచ్చింది ఆ సంస్థ‌.

జన రంజకమైన వార్తలు