• తాజా వార్తలు
  •  

గూగుల్ స‌మ‌ర్పిస్తోంది గూగుల్ క్లాసిఫైడ్స్

ఇంట‌ర్నెట్ ఓపెన్ చేయ‌గానే మ‌న‌ల్ని ప‌ల‌క‌రించేది గూగుల్. మ‌నం ఏం కావాల‌న్నా వెంటనే ఈ సెర్చ్ఇంజిన్‌లో వెతుకుతాం. ఇంట‌ర్నెట్‌లో ఎన్నో సెర్చ్ ఇంజిన్‌లు ఉన్నా.. గూగులే నంబ‌ర్‌వ‌న్‌. సాధార‌ణంగా వెబ్‌సైట్ల‌కు, యూట్యూబ్ వీడియోల‌కు గూగుల్ యాడ్స్ ఇస్తుంది. దీని ద్వారా వ‌చ్చే ఆదాయంలో కొంత శాతం సైట్‌, యూట్యూబ్ ఛానెల్ య‌జ‌మానుల‌కు ఇస్తుంటుంది. అంటే అడ్వ‌ర్ట్‌టైజ్‌మెంట్ గూగుల్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు. ప్ర‌పంచంలోనే దాదాపు అన్ని పెద్ద బ్రాండ్లు గూగుల్‌కు యాడ్స్ ఇవ్వ‌డానికే ఇష్ట‌ప‌డ‌తాయి. దీని వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా త‌మ ప్ర‌చారం పొందొచ్చ‌నేది ఆ సంస్థ‌ల వ్యూహం. ఐతే ఇప్పుడు గూగుల్ మ‌రో ఆలోచ‌న చేసింది. అదే క్లాసిఫైడ్స్‌. అంటే ప్ర‌క‌ట‌న‌ల‌ను ఆహ్వానించ‌డం. సాధార‌ణంగా ప‌త్రిక‌లు, టీవీలు క్లాసిఫైడ్స్ ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంటాయి. ఇప్పుడు గూగుల్ కూడా అదే బాట‌లో వెళుతోంది.
జాబ్స్ క్లాసిఫైడ్స్‌
ప్ర‌పంచవ్యాప్తంగా నిరుదోగ్యం అనేది ఎప్ప‌డూ స‌మ‌స్యే. ప‌ట్టాలు తీసుకునే బ‌య‌ట‌కు వ‌చ్చే విద్యార్థులంద‌రికి ఉద్యోగాలు దొర‌క‌ట్లేద‌నేది వాస్త‌వం. అలాంటి వారు నిరంత‌రం ఉద్యోగం కోసం అన్వేషిస్తుంటారు. ఇలాంటి నిరుద్యోగుల‌ కోస‌మే గూగుల్ కంపెనీ జాబ్స్ క్లాసిఫైడ్స్ ఆప్షన్‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. జాబ్ లిస్టింగ్స్‌, అప్లికేష‌న్ ట్రాకింగ్ కోసం ఈ క్లాసిఫైడ్ ఉప‌యోగ‌ప‌డనుంది. గూగుల్ హైర్ ఈ క్లాసిఫైడ్‌ను నిర్వ‌హించ‌నుంది. వినియోగ‌దారులు త‌మ గూగుల్ అకౌంట్స్‌ను ఉప‌యోగించి గూగుల్ హైర్‌తో సైన్ ఇన్ కావాలి. ఐతే ప్ర‌స్తుతం ఇన్విటేష‌న్ ఉంటేనే యూజ‌ర్లు హైర్‌లో లాగ్ఇన్ అయ్యే అవ‌కాశం ఉంది. త్వ‌ర‌లోనే ఈ విధానాన్ని స‌ర‌ళీకృతం చేసి అంద‌రికి అందుబాటులోకి తెస్తామ‌ని గూగుల్ చెబుతోంది. గూగుల్ హైర్ ద్వారా లాగ్ అయి గూగుల్ క్లాసిఫైడ్స్‌లో త‌మ ప్రొఫైల్‌ను ఉంచ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లో కంపెనీల‌కు త‌మకు కావాల్సిన అభ్య‌ర్థిని సుల‌భంగా వెతికే అవ‌కాశం ఉంటుంద‌ట‌. వినియోగ‌దారులు ఇచ్చిన స‌మాచారం సుర‌క్షిత‌మ‌ని... ఎలాంటి దుర్వినియోగానికి అవ‌కాశం లేద‌ని గూగుల్ తెలిపింది.
మ‌న వివ‌రాలు దొరికేస్తాయ్‌
ఏ కంపెనీకైనా త‌మకు కావాల్సిన అభ్య‌ర్థుల వివ‌రాల‌ను గూగుల్ సెర్చ్ ద్వారా పొందే అవ‌కాశం ఉంది. అయితే అంద‌రికి ఈ వివ‌రాలు విజుబుల్‌గా ఉండ‌వు. గూగుల్ హైర్ ద్వారా రిజిస్ట‌ర్ చేసుకుని గుర్తింపు పొందిన సంస్థ‌ల‌కు మాత్ర‌మే ఈ వివ‌రాల‌ను గూగుల్ అందిస్తుంది. ఈ జాబ్ క్లాసిఫైడ్ సెక్ష‌న్లో అభ్య‌ర్థుల పేర్లు, ఇంట్ర‌డ‌క్ష‌న్‌, జండ‌ర్, పుట్టిన తేదీ, కాంటాక్ట్ వివ‌రాలు, వ‌ర్క్ హిస్ట‌రీ, ఎడ్యుకేష‌న్‌, సైట్స్ లింక్డ్‌, ప్లేస్ త‌దిత‌ర వివ‌రాలు ఉంటాయి. గ‌తంలో అత‌ను ఏ ఏ సైట్లు ఉప‌యోగించాడ‌నే వివ‌రాలు కూడా ఉంటాయి. అయితే గూగుల్ వెబ్ బ్రౌజింగ్‌, యూట్యూబ్ హిస్ట‌రీ వివ‌రాల‌ను మాత్రం గూగుల్ థ‌ర్డ్ పార్టీతో పంచుకోదు. ఐపీ అడ్రెస్‌లు, యాప్‌ల వివ‌రాలు, లాంగ్వేజ్‌, లొకేషన్ లాంటి వివ‌రాల‌ను కూడా గూగుల్ గోప్యంగా ఉంచుతుంది. యూజ‌ర్ ప‌బ్లిక్‌గా విజుబుల్‌గా ఉంచిన విష‌యాల‌ను మాత్ర‌మే ఎంప్లాయ‌ర్లు చూడ‌గలుగుతారు.

జన రంజకమైన వార్తలు