• తాజా వార్తలు
  •  

గూగుల్ మ్యాప్స్‌, సెర్చ్‌లోకూడా.. విప‌త్తుల స‌మాచారం అందించే ఎస్‌వోఎస్ అల‌ర్ట్స్

ఏదైనా విప‌త్తులు సంభ‌వించిన‌ప్పుడు వాటికి సంబంధించిన స‌మాచారం అందించే ఎస్‌వోఎస్ అల‌ర్ట్స్  (SOS Alerts)  ఫీచర్‌ను గూగుల్ .. త‌న యూజ‌ర్లకు  అందుబాటులోకి తెచ్చింది. మంగ‌ళ‌వారం నుంచి గూగుల్ సెర్చ్‌, గూగుల్ న్యూస్‌, గూగుల్ మ్యాప్స్ స‌ర్వీసుల‌న్నింటిలోనూ ఈ అల‌ర్ట్స్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌కృతి విప‌త్తులు (natural calamities),  టెర్ర‌రిస్ట్‌ల దాడులు వంటి మ‌నుషుల వ‌ల్ల జ‌రిగే విప‌త్తులు  (human caused disasters) స‌మయంలో ఆ ఇన్ఫ‌ర్మేష‌న్‌ను మీకు అందిస్తుంది.  
మీ సెర్చి క్వ‌ర్రీతోపాటు మీరు ఎఫెక్టెడ్ ప్లేస్‌కు ఎంత దూరంలో ఉన్నార‌నే దాన్ని బ‌ట్టి మీకు ఇచ్చే స‌మాచారం ఆధార‌ప‌డి ఉంటుంది.   మీరు మ్యాప్స్‌, టాప్ స్టోరీస్ చూసిన‌ప్పుడు మీకు డిజాస్ట‌ర్ సంబంధించిన ఇన్ఫోతోపాటు అథెంటిక్ ఇన్ఫోను కూడా ఇస్తుంది. ఎమ‌ర్జెన్సీ ఫోన్ నెంబ‌ర్లు, వెబ్‌సైట్ల స‌మాచారాన్ని మీకు అందిస్తుంది.  మీరు ప్ర‌భావిత ప్రాంతానికి బాగా దగ్గ‌ర‌గా ఉండి ఉంటే మీ మొబైల్‌కు కూడా నోటిఫికేష‌న్స్ పంపిస్తామ‌ని గూగుల్ చెబుతోంది. 
డిజాస్ట‌ర్లు  సంభవించిన స‌మ‌యంలో యూజ‌ర్లు గూగుల్ మ్యాప్స్‌లో ఎస్‌వోఎస్ అల‌ర్ట్స్‌ను చూడొచ్చు.  వీటిమీద టాప్ చేస్తే దాని స‌మాచారం, ఎమ‌ర్జె్సీ నంబ‌ర్లు, హెల్ప్‌లైన్ నెంబ‌ర్లు, వెబ్‌సైట్ల వివ‌రాల‌న్నీ డిస్‌ప్లే  అవుతాయి.  ఇంగ్లీష్‌తోపాటు లోక‌ల్ లాంగ్వేజ్‌లోనూ ఈ ఇన్ఫో అందుబాటులో ఉంటుంద‌ని గూగుల్ చెప్పింది. 
 

జన రంజకమైన వార్తలు