• తాజా వార్తలు
  •  

7వేల రైల్వేస్టేష‌న్ల‌లో హాట్‌స్పాట్‌లు


* మారుమూల స్టేష‌న్ల‌లోనే ఏర్పాటు

* ఫ్రీ వైఫైతోపాటు ఇంట‌ర్నెట్ సేవ‌ల కోసం కియోస్క్‌లు
దేశంలోని 7వేల రైల్వే స్టేష‌న్ల‌ను హాట్‌స్పాట్‌లుగా మార్చ‌డానికి రైల్వే శాఖ ప్ర‌యత్నాలు ప్రారంభించింది. మారుమూల స్టేష‌న్ల‌లోనే వీటిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. కేవ‌లం వైఫై ప్రొవైడ్ చేయ‌డ‌మే కాకుండా ఈ రైల్వే స్టేష‌న్ల‌ను ఇంట‌ర్నెట్ బేస్డ్ స‌ర్వీసుల‌కు ఓ హ‌బ్‌గా మార్చాల‌ని స‌న్నాహాలు చేస్తోంది. రైల్‌వైర్ సాతీ ప్రాజెక్ట్ కింద ఈ 7వేల రైల్వేస్టేష‌న్ల‌ను హాట్‌స్పాట్‌లుగా మారుస్తామ‌ని రైల్వే మినిస్ట‌ర్ సురేశ్ ప్ర‌భు ఇటీవ‌ల చెప్పారు. రైల్వేస్‌కు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్‌ను యూజ్ చేసుకుని ఈ ప్రాజెక్టును చేప‌డ‌తామ‌ని చెప్పారు.
డిజిట‌ల్ ఇండియాకు తోడు
డిజిట‌ల్ ఇండియా ప్ర‌ధాని మోడీ క‌ల‌. ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్లు, ఆధార్ బేస్డ్ పేమెంట్స్ ఇవ‌న్నీ అందులో భాగ‌మే. కొత్త‌గా హాట్‌స్పాట్‌లుగా మార్చ‌నున్న రైల్వేస్టేష‌న్ల‌లో వీట‌న్నింటికీ ఏర్పాట్లు చేయ‌బోతున్నారు. ఈ-కామ‌ర్స్ పోర్ట‌ళ్ల‌కు ఏదైనా వ‌స్తువు ఆర్డ‌రివ్వాల‌న్నా.. రిసీవ్ చేసుకోవాల‌న్నా ఈ సెంట‌ర్‌ను వాడుకోవ‌చ్చు. డిజిటల్ బ్యాంకింగ్‌, ఆధార్ కార్డ్ జ‌న‌రేష‌న్‌, గ‌వ‌ర్నమెంట్ స‌ర్టిఫికెట్ల కోసం అప్ల‌యి చేసుకోవ‌డం, వాటిని ఇష్యూ చేయ‌డం, టాక్స్‌లు క‌ట్ట‌డం వంటి ఇంట‌ర్నెట్ ఆధారిత సేవ‌ల‌న్నీ చేసేందుకు ఈ స్టేష‌న్ల‌లో కియోస్క్‌లు ఏర్పాటు చేస్తారు. వీటిలో ట్రైన్డ్ పీపుల్‌ను అందుబాటులో ఉంచుతారు.
న‌క్స‌ల్స్ ఎఫెక్ట్‌డ్ రాష్ట్రాల అభివృద్ధి కోసం..
రైల్వేస్ టెక్నిక‌ల్ వింగ్ అయిన రైల్‌టైల్ సీఎండీ ఆర్‌కే బ‌హుగుణ ఈ ఆలోచ‌న‌ల‌కు రూప‌క‌ర్త‌. ముఖ్యంగా న‌క్స‌ల్స్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఒడిశా, బీహార్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్ ల‌లోని మారుమూల‌, గ్రామీణ రైల్వేస్టేష‌న్ల‌ను హాట్‌స్పాట్‌లుగా మార్చి వారికి ప్ర‌పంచంంతో సంబంధాలు మెరుగుప‌ర‌చాల‌ని కేంద్రం భావిస్తోంది. జ‌గ‌ద‌ల్‌పూర్‌, దేవ్‌బంద్‌, బ‌రౌనీ, ఖుషీన‌గ‌ర్‌, కోడెర్మా స్టేష‌న్ల‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తారు. త‌ర్వాత 200 స్టేష‌న్ల చొప్పున అమ‌లు చేస్తారు. రాబోయే రెండేళ్ల‌లో రైల్‌వైర్ సాతీ ప్రాజెక్టు కింద 5వేల స్టేష‌న్ల‌ను, 25వేల గ్రామ పంచాయ‌తీల‌ను నెట్‌వ‌ర్క్‌తో క‌నెక్ట్ చేయాల‌న్న‌ది రైల్వే ప్లాన్‌. దీనికి 2వేల కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 30 వేల మంది యూత్‌కు జాబ్స్ దొరుకుతాయి.

జన రంజకమైన వార్తలు