• తాజా వార్తలు
  •  

జియో ఫైబ‌ర్ గురించి యాక్సిడెంటల్‌గా లీక‌యిన వివ‌రాలు... నెల‌కు 100 జీబీ డేటా 3నెల‌లు ఫ్రీ

ఫ్రీ ఆఫ‌ర్ల‌తో మొబైల్ ఫోన్ టారిఫ్‌ను నేల‌కు దించిన జియో బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల‌ను కూడా అందుబాటులోకి తెస్తోంద‌ని చాలా కాలంగా చెబుతున్నారు.  జియో వ‌స్తే కాంపిటీష‌న్ పెరిగి   బ్రాడ్‌బ్యాండ్ సేవ‌ల ధ‌ర‌లు కూడా త‌గ్గుతాయ‌ని యూజ‌ర్లు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారంద‌రికీ సంతోషం క‌లిగించేలా జియో ఫైబ‌ర్ (బ్రాడ్ బ్యాండ్‌)కు సంబంధించి ఓ లీక్ వెలువడింది.  డేటా ఆఫ‌ర్లు, లొకేష‌న్ల గురించి ఈ లీక్ లో వివ‌రాలున్నాయి.

100 జీబీ డేటా, 100 ఎంబీపీఎస్ స్పీడ్ 
జియో ప్రారంభ ఆఫ‌ర్‌గా మూడు నెల‌లపాటు ఉచితంగా బ్రాడ్ బ్యాండ్ సేవ‌లు అందిస్తుంద‌ని ఆ లీక్ సారాంశం. 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెల‌కు 100 జీబీ  డేటాను ఫ్రీగా ఇస్తుంది. 100 జీబీ వాడేస్తే త‌ర్వాత స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు త‌గ్గిపోతుంది.  ఇలా మూడు నెల‌ల‌పాటు ఇస్తుంద‌ని లీక్ లో వివ‌రాల ప్ర‌కారం తెలుస్తోంది. అంతేకాదు జియో ఫైబ‌ర్ స‌ర్వీసుల‌ను ముందుగా అహ్మ‌దాబాద్‌, ఢిల్లీ, జైపూర్‌, ముంబ‌యి, సూర‌త్‌, వ‌డోద‌ర‌ల్లో ప్రారంభిస్తారు. తెలుగు స్టేట్స్ నుంచి హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం కూడా ప్రారంభిస్తార‌ని ఆ వెబ్‌సైట్‌లో ఉంది.   ఈ సిటీస్‌లో కొన్ని కాంప్లెక్స్‌లు లేదా అపార్ట్‌మెంట్ల‌ను సెలెక్ట్ చేసుకుని క‌స్ట‌మ్స్ రౌట‌ర్ల ద్వారా ఎక్కువ మందికి బ్రాడ్‌బ్యాండ్ సేవ‌లందిస్తుంది. యూజ‌ర్ కావాలంటే సొంతంగా రౌట‌ర్ తీసుకోవ‌చ్చు. 

జియో అఫీషియ‌ల్ వెబ్‌సైట్ నుంచే లీక్!
జియో అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లోనే ఈ వివరాలు ఉన్నాయ‌ని ఓ నెటిజ‌న్ పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆ వివ‌రాలను జియో అఫీషియ‌ల్ వెబ్‌సైట్ నుంచి స్క్రీన్ షాట్ తీసి పెట్టాడు. ఈ యూఆర్ ఎల్ యాక్సెస్ కావ‌డం లేదు. అలాగే జియో అఫీషియ‌ల్ వెబ్‌సైట్లో ఈ సెక్ష‌న్ ప్ర‌స్తుతానికి ష‌ట్‌డౌన్ చేసి ఉంది. కాబట్టి ఈ లీక్‌లోని  వివ‌రాలు ఎంత‌వ‌ర‌కు  నిజ‌మ‌వుతాయ‌న్న‌ది వెయిట్ చేసి చూడాల్సిందే.  
 

జన రంజకమైన వార్తలు