• తాజా వార్తలు

ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. జియో యూజ‌ర్ల‌కు 432 లైవ్ ఛాన‌ళ్లు ఫ్రీ

ఇండియ‌న్ బిజినెస్ లెజండ్ రిల‌య‌న్స్‌.. టెక్నాల‌జీ రంగంపైనా పూర్తి స్థాయిలో క‌మాండ్ సాధించే దిశ‌గా వేగంగా అడుగులు వేస్తోంది. జియోతో ఇండియ‌న్ టెలికం రంగంలో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న రిల‌య‌న్స్ మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ను జియో యూజ‌ర్ల ముందుకు తెచ్చింది. జియో టీవీ యాప్‌తో ఏకంగా 432 లైవ్ ఛానల్స్‌ను ఫ్రీగా పొంద‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. 15 ప్రాంతీయ భాష‌ల్లోఈ ఛాన‌ల్స్ అందుబాటులో ఉంటాయి. దీంతోపాటు స్పోర్ట్స్ ఛాన‌ళ్ల‌ను అందించే హాట్‌స్టార్ ప్రీమియం స‌ర్వీస్‌ను కూడా యూజ‌ర్లు పొంద‌వ‌చ్చు. మొబైల్ నెట్‌వ‌ర్క్‌లో దూసుకుపోతున్న జియో.. లైవ్ టీవీ యాప్‌ల్లోనూ టాప్ ప్లేస్ కోస‌మే ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది.
200 ఛాన‌ళ్ల‌తో ప్రారంభ‌మై..
జియో టీవీ యాప్ ఆరు ప్రాంతీయ భాష‌ల్లో 200 ఛాన‌ళ్ల‌తో ప్రారంభ‌మైంది. జియో ప్రారంభ ఆఫ‌ర్‌, ఆ త‌ర్వాత హ్యాపీ న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్ తో ఇప్ప‌టి వ‌ర‌కు యూజ‌ర్ల‌కు అన్‌లిమిటెడ్ కాల్స్‌, డాటాను ఉచితంగా ఇచ్చింది. పెయిడ్ స‌ర్వీస్‌గా మార్చుకోవాలంటే 99 రూపాయ‌ల టారిఫ్‌ను పెట్టింది. దీనితో రీఛార్జి చేసుకుంటే ఆ త‌ర్వాత నుంచి యూజ‌ర్లు జియో ఆఫ‌ర్ల‌న్నీ పొంద‌చ‌వ‌చ్చు. నెల‌కు 303 రూపాయ‌లు చెల్లిస్తే నెల‌రోజుల‌పాటు రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ను ప్ర‌క‌టించిన జియో.. త‌ర్వాత స‌మ్మ‌ర్ స‌ర్‌ప్రైజ్ కింద ఇదే అమౌంట్‌కు మూడు నెల‌ల‌పాటు ఫ్రీ కాల్స్‌, డాటా ఇస్తామ‌ని అనౌన్స్ చేసి యూజ‌ర్ల‌ను మెస్మ‌రైజ్ చేసింది. యూజ‌ర్ల‌ను మ‌రింత ఎట్రాక్ట్ చేసేందుకు లైవ్ టీవీ ఛాన‌ల్స్ సంఖ్య ఏకంగా రెండింత‌లు చేసింది.
డీటీహెచ్‌పైనా క‌న్నేసిందా?
జియో తాజా ఆఫ‌ర్ చూస్తే రిల‌యన్స్ కేబుల్ టీవీ, డీటీహెచ్ రంగంలోనూ సంచ‌ల‌నం సృష్టించేలా క‌నిపిస్తోంది. జియో టీవీ యాప్ ద్వారా ఉచితంగా అందిస్తున్న ఛాన‌ల్స్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫోటైన్‌మెంట్‌, కిడ్స్‌, మూవీస్‌, మ్యూజిక్‌, న్యూస్‌, బిజినెస్‌, స్పోర్ట్స్‌, లైఫ్‌స్టైల్‌, డివోష‌న‌ల్ ఛాన‌ల్స్ ఉన్నాయి. ఎయిర్ టెల్‌, వొడాఫోన్‌, ఐడియా నెట్‌వ‌ర్క్‌లు ఛాన‌ల్స్ ఇస్తున్నా వాటి సంఖ్య త‌క్కువ‌.

జన రంజకమైన వార్తలు