ఇండియాలో 4జీ విప్లవం సృష్టించిన రిలయన్స్ జియో టెక్ సెక్టార్లో మరింతగా విస్తరించేందుకు శరవేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ను కూడా లాంచ్ చేయబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు జియో ఫైబర్ బ్రాడ్ బాండ్ ఇప్పటికే ముంబయి, పుణెల్లో పరీక్ష దశలో ఉంది. మరికొద్ది నెలల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
జియో ఫైబర్ బ్రాడ్ బాండ్ ను ‘ఫైబర్ టు ది హోమ్’(ఎఫ్ టీటీహెచ్) ఆధారంగా కేబుల్ వ్యవస్థ ద్వారా అందించనున్నారు. ప్రస్తుతం దేశంలో ఏక్ట్ ఫైబర్ సంస్థ 1 గిగా బైట్ వేగంతో ఇండియాలోనే ఫాస్టెస్ట్ బ్రాడ్ బాండ్ గా ఉంది. ఇప్పుడు జియో కూడా అదే వేగంతో అంతకంటే తక్కువ ధరల్లో సేవలందించడానికి రెడీ అవుతోంది. అంతేకాదు.. మూడు నెలల పాటు ఫ్రీగా ఇచ్చే యోచన ఉంది.
జియో బ్రాండ్ బాండ్ ప్లాన్లు ఇవీ..
* స్పీడ్ బేస్డ్ ప్లాన్లు
* వాల్యూమ్ బేస్డ్ ప్లాన్లు
* ప్రత్యేక బ్రాడ్ బాండ్ ప్లాన్లు
స్పీడ్ బేస్డ్ ప్లాన్లు..
* జియో ఫైబర్ 50 ఎంబీపీఎస్ ప్లాన్... దీని వేగం 50 ఎంబీపీఎస్ ఉంటుంది. డాటా లిమిట్ 2 వేల జీబీ. ధర 1500. 30 రోజుల కాలపరిమితి.
* జియో ఫైబర్ 100 ఎంబీపీఎస్ ప్లాన్... దీని వేగం 100 ఎంబీపీఎస్ ఉంటుంది. డాటా లిమిట్ వెయ్యి జీబీ. ధర 2000. 30 రోజుల కాలపరిమితి.
* జియో ఫైబర్ 200 ఎంబీపీఎస్ ప్లాన్... దీని వేగం 200 ఎంబీపీఎస్ ఉంటుంది. డాటా లిమిట్ 750 వేల జీబీ. ధర 3500. 30 రోజుల కాలపరిమితి.
* జియో ఫైబర్ 400 ఎంబీపీఎస్ ప్లాన్... దీని వేగం 400 ఎంబీపీఎస్ ఉంటుంది. డాటా లిమిట్ 500 వేల జీబీ. ధర 4000. 30 రోజుల కాలపరిమితి.
* జియో ఫైబర్ 600 ఎంబీపీఎస్ ప్లాన్... దీని వేగం 600 ఎంబీపీఎస్ ఉంటుంది. డాటా లిమిట్ 300 వేల జీబీ. ధర 5500. 30 రోజుల కాలపరిమితి.
వాల్యూమ్ బేస్డ్ ప్లాన్లు
* రోజుకు 5జీబీ.. అపరిమిత వేగం, ధర రూ.వెయ్యి, 30 రోజుల కాలపరిమితి
* రోజుకు 10జీబీ.. అపరిమిత వేగం, ధర రూ.2000.. 30 రోజుల కాలపరిమితి
* రోజుకు 20జీబీ.. అపరిమిత వేగం, ధర రూ.3,000 , 30 రోజుల కాలపరిమితి
* రోజుకు 40జీబీ.. అపరిమిత వేగం, ధర రూ.4,000.. 30 రోజుల కాలపరిమితి
* రోజుకు 60జీబీ.. అపరిమిత వేగం, ధర రూ.5,000.. , 30 రోజుల కాలపరిమితి
ప్రత్యేక ప్లాన్లు..
* రూ.500 ప్లాన్... డాటా లిమిట్ 600 జీబీ, వేగం 15 ఎంబీపీఎస్, 30 రోజుల కాలపరిమితి
* రూ.1000 ప్లాన్... డాటా లిమిట్ 500 జీబీ, వేగం 20 ఎంబీపీఎస్, 30 రోజుల కాలపరిమితి
* రూ.500 ప్లాన్... డాటా లిమిట్ రోజుకు 3.5 జీబీ, 30 రోజుల కాలపరిమితి
* రూ.500 ప్లాన్... డాటా లిమిట్ ఇంకా స్పష్టత రాలేదు, వేగం 60 ఎంబీపీఎస్, 30 రోజుల కాలపరిమితి
* రూ.800 ప్లాన్... అన్ లిమిటెడ్ డాటా, 30 రోజుల కాలపరిమితి