• తాజా వార్తలు
  •  

నెల‌కు..10 జీబీ డేటా ఫ్రీ

ఇది జియో నుంచి వ‌చ్చిన కొత్త ఆఫ‌ర్ మాత్రం కాదు.. మార్కెట్లో పోటీని త‌ట్టుకుని క‌స్ట‌మ‌ర్ల‌ను నిల‌బెట్టుకోవ‌డానికి ఎయిర్‌టెల్ నుంచి వ‌చ్చిన కొత్త ఆఫ‌ర్‌.. నెల‌కు 10 జీబీ డేటా చొప్పున మూడు నెల‌ల‌పాటు 30 జీబీ డేటా ఫ్రీగా ఇస్తామ‌ని ఎయిర్‌టెల్ ప్ర‌క‌టించింది. అయితే ఈ ఆఫ‌ర్ ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు మాత్ర‌మే.
ఆఫ‌ర్ అందుకోవాలంటే..
ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్లు మై ఎయిర్‌టెల్ యాప్‌లోకి లాగిన్ అయి ఈ ఆఫ‌ర్‌ను ఎవాయిల్ చేసుకోవాలి. ఏప్రిల్ 30 వ‌ర‌కే గ‌డువు. ఇప్ప‌టికే ఈ ఆఫ‌ర్ చాలా మంది పోస్ట్‌పెయిడ్ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు కంపెనీ మెయిల్స్‌, మెసేజ్ ల ద్వారా ఇన్‌ఫామ్ చేసింది. వీరిలో చాలా మంది దీన్ని ఎవాయిల్ చేసుకున్నారు కూడా. మూడు నెల‌ల‌పాటు ప్ర‌తి నెలా 10 జీబీ డేటాను ఫ్రీగా పొందండి.. మీ స‌మ్మ‌ర్ వెకేష‌న్‌కు స‌రిప‌డే డేటాను మేం ఫ్రీగా అందిస్తున్న‌మంటూ ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ యూజ‌ర్ల‌కు ఈ మెయిల్స్ పంపుతోంది.
రోమింగ్‌కు 499 రూపాయ‌ల ప్యాక్
విదేశాల‌కు ట్రావెల్ చేసే ఎయిర్‌టెల్ యూజ‌ర్ల కోసం 499 రూపాయ‌ల‌కు ఫ్రీ రోమింగ్ ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. 499 రూపాయ‌లు చెల్లించి ఈ ప్యాక్ తీసుకుంటే రోమింగ్‌లో ఉన్నా కూడా అన్‌లిమిటెడ్ ఇన్‌క‌మింగ్ కాల్స్‌, ఫ్రీ డేటా, ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఈ ఆఫ‌ర్‌ను తీసుకోకుండా క‌స్ట‌మ‌ర్ విదేశాల‌కు వెళ్లి రోజుకు రూ.499 కంటే ఎక్కువ బిల్లింగ్ చేస్తే ఆటోమేటిగ్గా రోమింగ్ ఫ్రీ ప్యాక్‌ను అప్ల‌యి చేయ‌నున్నారు. అంత‌కంటే త‌క్కువ యూజ్ చేస్తే ప్లాన్ ప్ర‌కార‌మే బిల్ వ‌స్తుంది. ఈరెండు ఆఫ‌ర్ల గురించి ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ స‌బ్ స్క్రైబ‌ర్ల‌కు బ్యాచ్‌ల‌వారీగా మెయిల్స్ పంపుతోంది.
జియోను త‌ట్టుకోవ‌డానికేనా?
ఆరు నెల‌ల క్రితం వ‌చ్చిన రిల‌య‌న్స్ జియో ఉచిత ఆఫ‌ర్ల‌తో మార్కెట్‌ను ముంచెత్తిన నేప‌థ్యంలో మిగిలిన టెల్కోలు ప్రైస్‌వార్‌కు దిగాయి. ఎయిర్‌టైల్ తాజా ఆఫ‌ర్లు కూడా జియో నుంచి క‌స్ట‌మ‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డానికే అన్న‌ది సుస్ప‌ష్టం.

జన రంజకమైన వార్తలు