• తాజా వార్తలు
  •  

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ వీటిలో ఏది ఉత్త‌మం?

ఇంట‌ర్నెట్ అందుబాటులో ఉందంటే సినిమాలు చూడాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. త‌మ‌కిష్ట‌మైన లేదా బాగా హిట్ అయిన మూవీస్‌ల‌ను చూడ‌టానికి ఒక‌ప్పుడు క్యాసెట్‌లు తెప్పించుకోవ‌డం, సీడీలు కొన‌డం చేసేవాళ్లు. ఆ రోజులెప్పుడో పోయాయి. ఇప్పుడు ఏం కావాల‌న్నా, ఏం చూడాల‌న్నా.. ఏం చేయాల‌న్నా అంతా ఇంట‌ర్నెటే. ఇంట్లో ఉంటే మాత్ర‌మే సిస్ట‌మ్‌లో చూసే రోజులు కూడా అయిపోయాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్‌.. అందులో ఇంట‌ర్నెట్ ఉంటే చాలు ఎక్క‌డ ఉన్నా.. మ‌నం సినిమాలు చూసేయ‌చ్చు. అయితే సినిమాలు చూడ‌టానికి చాలా సైట్లు ఉన్నా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ ప్రాచుర్యం పొందాయి. మ‌రి ఈ మూడింట్లో సినిమాలు చూసేందుకు ఉత్త‌మ‌మైంది ఏమిటి?

యాప్ ఇంట‌ర్‌ఫేస్‌
నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్ పాత‌వే అయినా..కొత్త‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ జాబితాలో చేరింది. రియ‌ల్ టైమ్ ఎక్స్‌పీరియ‌న్స్ కోసం వినియోగ‌దారులు వీటిని ఉప‌యోగిస్తున్నారు. అంటే కేవ‌లం సినిమాలు మాత్ర‌మే కాదు లైవ్ ప్రోగ్రామ్‌లు, క్రికెట్, టెన్నిస్‌, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు వీటిని బాగా వాడుతున్నారు. ఇవ‌న్నీ యాప్ బేస్డ్‌గా న‌డిచేవే. ఇన్‌స్టంట్ ఫ‌లితాల కోసం నెట్‌ఫ్లిక్స్ ఎక్కువ ఉప‌యోగిస్తున్నారు. యూజ‌ర్ ఫ్రెండ్లీ ఫీచ‌ర్లు ఉండ‌డం వ‌ల్ల ఇది వాడ‌డం చాలా సుల‌భం. రియ‌ల్‌టైమ్ సెర్చ్ రిజ‌ల్ట్స్ కోసం హాట్‌స్టార్‌ను మించింది లేదు. అయితే ఈ యాప్‌ను బాగా బిల్డ్ చేసినా.. ఇంకా చాలాసార్లు లైవ్ చూడ‌డంలో ఇబ్బంది క‌లుగుతోంది.  అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీకు కావాల్సిన వివ‌రాలు పూర్తిగా టైప్ చేస్తేనే అవి మీకు ల‌భ్యం అవుతాయి. అయితే అంతా బాగానే ఉన్నా గ‌త ఎపిసోడ్స్‌ను చూడ‌డంలో ఇబ్బందులు ఉన్నాయి. 

ప్లేబాక్ ఎక్స్‌పీరియ‌న్స్‌
ఈ మూడింట్లో ఉన్న పెద్ద ఫీచ‌ర్ ప్లేబాక్‌. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ వీడియో క్వాలిటీ, మొత్తం ఎపిసోడ్ లిస్ట్ ల‌భ్యంతో పాటు టోట‌ల్‌గా ప్లేబాక్ ఎక్స్‌పీరియ‌న్స్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అదే అమెజాన్ ప్రైమ్‌లో క‌స్ట‌మైజ్డ్ ఆప్ష‌న్లు ఉన్నాయి. అంటే స‌బ్ టైటిల్ సైజును మార్చుకోవ‌డం, వీడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీని ఛేంజ్ చేసుకోవ‌డం లాంటివి. ఒక వీడియో చూడ‌టానికి ఎంత డేటా ఖ‌ర్చ‌వుతుంది లాంటి వివ‌రాలు కూడా ల‌భిస్తాయి. దీంతో ప్లేబాక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. హాట్‌స్టార్‌లోనూ స్ట్రీమింగ్ క్వాలిటీ ఆప్ష‌న్లు ఉన్నాయి. వీడియోల‌కు ఎంత డేటా ఖ‌ర్చు అవుతుందో తెలుసుకోవ‌చ్చు. 

కంటెంట్‌
అన్నిటిక‌న్నా ముఖ్య‌మైంది కంటెంట్‌.  ఎక్క‌డా దొర‌క‌ని టీవీ షోస్‌, హౌస్ ఆఫ్ కార్డ్స్‌, కొత్త సంగ‌తులు, బ్లాక్ మిర్ర‌ర్ ఇలా ఎన్నో కొత్త విష‌యాలు మీరు నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. అంటేకాదు అతిపెద్ద కేట‌లాగ్ ఈ యాప్ సొంతం. బాలీవుడ్ సినిమాలు త‌క్కువే ఉన్నా.. అన్ని ర‌కాల సినిమాలు దీని ల‌భ్య‌మ‌వుతాయి. ఇక‌ అమెజాన్ ప్రైమ్ విష‌యానికొస్తే టీవీ షోస్‌తో పాటు గ్రాండ్ టూర్‌, ఫీయ‌ర్ ద వాకింగ్ డెడ్ లాంటి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు ఎన్నో ఉన్నాయి. రీజ‌న‌ల్ లాంగ్వేజెస్‌లోనూ ఇవి ల‌భ్య‌మ‌వుతున్నాయి.  హాట్‌స్టార్ ప్రిమియ‌ర్ స‌ర్వీస్‌. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌, సిలికాన్ వాలీ, అమెరిక‌న్ క్రైమ్ స్టోరీ లాంటి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌తో పాటు క్రీడ‌లు దీని ప్ర‌త్యేక‌త‌. ఐతే కొన్ని ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చూడాలంటే స‌బ్‌స్క్రిప్ష‌న్ చేసుకోవాలి. వాటి  ధ‌ర నెట్‌ఫ్లిక్స్ రూ.500గా ఉంటే.. అమెజాన్ ప్రైమ్‌కు రూ.499, హాట్‌స్టార్‌కు రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు